ఆర్కాటు రామస్వామి మొదలియారు

మైసూర్ దివాన్

ఆర్కాటు రామస్వామి మొదలియారు న్యాయశాస్త్రరం నిపుణునిగా పనిచేశారు. ఆర్కాట్ సోదరులుగా సుప్రసిద్ధులైన కవలలో ఒకరు. రామస్వామి మొదలియారు, ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు న్యాయ, వైద్య రంగాల్లో నిపుణులు, ప్రపంచ ప్రసిద్ధులు. ఆర్కాటు సోదరులు కర్నూలు జిల్లాలో జన్మించి తమ రంగాల్లో ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించారు. రామస్వామి మొదలియారు అంతర్జాతీయ సంస్థగా వెలుగొందుతున్న ఐక్యరాజ్య సమితిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన తొలి ప్రాతినిధ్య బృందానికి ఆయన నాయకత్వం వహించారు. ఐరాస లక్ష్యాలను(యూఎన్ చార్టర్) రూపొందించిన మేధావి. ఆయన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ తొలి ఆర్థికమండలికి అధ్యక్షత వహించడమే కాక ఆపైన మరో మూడు పర్యాయాలు ఆ పదవి చేపట్టారు. ఈ గౌరవం దక్కిన ఆసియావాసి ఆయన ఒక్కరే.

Padma Vibhushan Diwan Bahadur Sir Arcot Ramasamy Mudaliar KCSI
ఆర్కాటు రామస్వామి మొదలియారు

ఆర్కాటు రామస్వామి మొదలియార్


Diwan of Mysore
పదవీ కాలం
January 1947 – August 15, 1947
చక్రవర్తి Jayachamaraja Wodeyar Bahadur
ముందు N. Madhava Rao
తరువాత post abolished

పదవీ కాలం
January 23, 1946 – January 23, 1947
ముందు None
తరువాత Jan Papanek

Member of the Imperial War Cabinet
పదవీ కాలం
1942 – 1945
ప్రధాన మంత్రి Winston Churchill
చక్రవర్తి George VI of the United Kingdom
తరువాత War Cabinet disbanded

Member of the Viceroy's Executive Council
పదవీ కాలం
1939 – 1942
చక్రవర్తి George VI of the United Kingdom
Governor–General Victor Hope, 2nd Marquess of Linlithgow

వ్యక్తిగత వివరాలు

జననం (1887-10-14)1887 అక్టోబరు 14
Kurnool, Madras Presidency
మరణం 1976 జూలై 17(1976-07-17) (వయసు 88)
Madras
జాతీయత Indian
రాజకీయ పార్టీ Justice Party
పూర్వ విద్యార్థి Madras Christian College
వృత్తి politician
వృత్తి lawyer
మతం Hindu

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం రామస్వామిని గురించి పేర్కొంటూ అత్యంత సఫలీకృతుడైన వ్యక్తిగా, అరుదైన వాగ్ధాటి కలిగిన వక్తగా ఆయన తన తూర్పు ప్రాంతం నుంచి చీకట్లో కొట్టుమిట్టాడుతున్న మన(పాశ్చాత్యుల)కు వెలుగును తీసుకువచ్చారు. అన్నారు.

వీరి శతజయంతి సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన గ్రంథాన్ని చల్లా రాధాకృష్ణశర్మ వ్రాశారు.

మూలాలు మార్చు

  1. http://www.un.org/en/ecosoc/about/