ఆర్థర్ కోనన్ డోయల్

ఆర్థర్ కోనన్ డోయల్ (1859 మే 22 - 1930 జులై 7) ఒక బ్రిటిష్ రచయిత, వైద్యుడు. 1887 లో ఈయన తన నాలుగు నవలలు, కథల కోసం షెర్లాక్ హోమ్స్ అనే పాత్రను సృష్టించాడు. ఈ పాత్ర ప్రధానంగా సాగిన రచనలు క్రైమ్ ఫిక్షన్ లో ఒక మైలురాయిలా నిలిచింది. ఈయన చేయి తిరిగిన రచయిత షెర్లాక్ హోమ్స్ పాత్రతోనే కాక, ఫాంటసీ, చారిత్రక నవలలు, వైజ్ఞానిక కల్పన, నాన్ ఫిక్షన్ విభాగాల్లో కూడా రచనలు చేశాడు.

సర్ ఆర్థర్ కోనన్ డోయల్
మూస:Postnom
1914 లో ఆర్థర్ కోనన్ డోయల్
పుట్టిన తేదీ, స్థలంఆర్థర్ ఇగ్నేషియస్ డోయల్
(1859-05-22)1859 మే 22
ఎడిన్‌బర్గ్, మిడ్లోథియన్, స్కాట్లాండ్
మరణం1930 జూలై 7(1930-07-07) (వయసు 71)
క్రోబరో, ససెక్స్, ఇంగ్లండు
వృత్తి
  • రచయిత
  • వైద్యుడు
విద్యయూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్
రచనా రంగం
  • డిటెక్టివ్ ఫిక్షన్
  • ఫాంటసీ
  • వైజ్ఞానిక కల్పన
  • చారిత్రక నవలలు
  • నాన్ ఫిక్షన్
గుర్తింపునిచ్చిన రచనలు
  • స్టోరీస్ ఆఫ్ షెర్లాక్ హోమ్స్
  • ద లాస్ట్ వర్ల్డ్
జీవిత భాగస్వామి
    లూసియా హాకిన్స్
    (m. 1885; died 1906)
    జీన్ లెకీ
    (m. 1907)
సంతానం5 (అడ్రియన్, జీన్ తో కలిపి)

సంతకం

జీవితం మార్చు

డోయల్ 1859 మే 22 న స్కాట్లాండులోని ఎడిన్‌బర్గ్ లో జన్మించాడు.[1][2] అతని తండ్రి చార్లెస్ ఆల్టమాంట్ డోయల్, తల్లి మేరీ. చార్లెస్ మద్యపానానికి బానిస కావడంతో 1864 లో డోయల్ కుటుంబం చెల్లా చెదురైంది. పిల్లలు ఎడిన్‌బర్గ్ లో అక్కడక్కడా నివాసం ఉండేవారు. 1867 లో ఈ కుటుంబం మళ్ళీ కలుసుకుంది.[3] చార్లెస్ 1893 లో మానసిక వ్యాధి ముదరడంతో మరణించాడు.[4][5] డోయల్ చిన్నతనం నుంచి అమ్మకు అనేక ఉత్తరాలు రాసేవాడు. అవన్నీ భద్రపరచబడి ఉన్నాయి.

మూలాలు మార్చు

  1. "Scottish Writer Best Known for His Creation of the Detective Sherlock Holmes". Encyclopædia Britannica. Archived from the original on 27 May 2009. Retrieved 30 December 2009.
  2. "Sir Arthur Conan Doyle Biography". sherlockholmesonline.org. Archived from the original on 2 February 2011. Retrieved 13 January 2011.
  3. Owen Dudley Edwards, "Doyle, Sir Arthur Ignatius Conan (1859–1930)", Oxford Dictionary of National Biography, Oxford University Press, 2004.
  4. Lellenberg, Jon; Stashower, Daniel; Foley, Charles (2007). Arthur Conan Doyle: A Life in Letters. HarperPress. pp. 8–9. ISBN 978-0-00-724759-2.
  5. Stashower, pp. 20–21.