ఇండియా మార్క్ II అనగా మానవ శక్తితో నడిచే పంపు, దీనిని 50 మీటర్లు లేదా అంతకు తక్కువ లోతుల నుండి నీటిని తోడేందుకు రూపొందించారు. మార్క్ II ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే నీటి చేతి పంపు.[1] అభివృద్ధి చెందుతున్న దేశాలలో, గ్రామీణ ప్రాంతాలలోని గ్రామాలలో నీటి అవసరాలను తీర్చడానికి 1970 లో ఈ పంపును రూపొందించారు.

గ్రామీణ ఉగాండాలో ఇండియా మార్క్ II పంపు.

ఈ పంపును బోరు బావి మీద బిగిస్తారు. ఈ పంపు యొక్క హ్యాండిల్ ను పదేపదే పైకి కిందకి కదిలించడం ద్వారా బావిలో దిగువన ఉన్న నీరు పైకి వస్తుంది. 1990ల మధ్యలో ఐదు మిలియన్ల పంపులు తయారుచేయబడి ఉపయోగింపబడుతున్నవి.[1]

చరిత్ర మార్చు

ఈ పంపును 1970 లో భారత ప్రభుత్వం, యునిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. ప్రపంచంలో నీటి ఎద్దడి గల అనేక గ్రామాలలో నీటి సదుపాయం కల్పించుటకు ఈ పంపును రూపొందించడం జరిగింది. ఈ పంపులను వాడుటకు పూర్వం నాణ్యత తక్కువ గల చేత ఇనుముతో కూడిన పంపులను యూరోప్, ఉత్తర అమెరికాలలో ఉపయోగించేవారు. ఇటువంటి పంపులను యు.ఎస్ లో వ్యవసాయ కుటుంబాలు ఒక రోజుకు మూడు లేదా నాలుగు సార్లు వాడేవారు. ఈ పంపును భారతదేశంలో మొత్తం స్త్రీలు, పిల్లలు విరివిగా ఉపయోగించడం వలన వేగంగా పోవుట జరుగినది. ఆ కాలంలో యునిసెఫ్ ఒక సర్వే నిర్వహించి భారతదేశంలో ఈ పంపుల నాణ్యత గూర్చి తెలుసుకొనేటప్పుడు 75 శాతం పంపులు పనిచేయుటలేదని గమనించింది. ఈ పంపుల నిర్వహణ, వినియోగం గూర్చి వివిధ వర్క్ షాపులు నిర్వహించింది. ఆ కాలంలో మార్క్ 2 పంపు అధిక నాణ్యత కలిగిన పంపుగా గుర్తింపు పొందింది. దీనిని భారతీయ సాంకేతిక నిపుణులు తయారు చేశారు. 20 సంవత్సరాలలో ఒక మిలియన్ పంపులు తయారు కాబడినవి., ప్రపంచ వ్యాప్తంగా వినియోగంలోకి వచ్చినవి. ఒక భారతీయ పత్రిక ఈ మార్క్ 2 పంపు భారతదేశంలో ముఖ్య ఆవిష్కరణలలో ఒకటిగా అభివర్ణించింది.[2]

సాంకేతిక సమాచారం మార్చు

  • గరిష్ఠ వినియోగ లోతులు: 45 మీటర్లు (147 అడుగులు).
  • కనిష్ఠ బోర్ రంధ్ర పరిమాణం: 100mm
  • స్ట్రోక్ పొడావు: 125 mm
  • సిలిండర్ సెట్టింగ్ డెప్త్ అవధి: 9-45mm
  • ఒక స్ట్రోక్ కు విడుదల : 0.40 ltrs
  • ఒక గంటలో నీటి విడుదల: 0.8 m3

ఇండియా మార్క్ II పంపు, ప్రజారంగంలో ఉపయోగించుటకు డిజైన్ చేయబడిన చేతిపంపు. అంతర్జాతీయ డిజైన్ ను రూరల్ వాటర్ సప్లై నెట్వర్క్ (RWSN), చే నియంత్రించ బడుచున్నది, [3] అయిననూ, భారత్, ఘనా, ఉగాండాలో తమ తమ జాతీయ స్టాండర్డ్ ను అనుసరించి తయారు చేయబడిన పంపులు వాడబడుచున్నవి.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Wood, M. (1994): Are handpumps really affordable? Proceedings of the 20th WEDC Conference, WEDC pp. 132-134
  2. "Village water supplies" UNICEF http://www.unicef.org/sowc96/hpump.htm Archived 2016-03-03 at the Wayback Machine
  3. http://www.rural-water-supply.net/en/implementation/handpump-overview/india-mark-ii

ఇతర లింకులు మార్చు