ఇంద్రభవనం

కృష్ణ దర్శకత్వంలో 1991లో విడుదలైన తెలుగు చలనచిత్రం

ఇంద్రభవనం 1991, మే 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. పద్మాలయ మూవీస్ పతాకంపై జి. నరసింహరావు నిర్మాణ సారథ్యంలో కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, మీనా, కృష్ణంరాజు, కోట శ్రీనివాసరావు, జ్యోతి తదితరులు నటించగా, బప్పీలహరి సంగీతం అందించాడు. 1990లో హిందీలో వచ్చిన స్వర్గ్ సినిమాకి రిమేక్ సినిమా ఇది.

ఇంద్రభవనం
దర్శకత్వంకృష్ణ
రచనడి.వి.నరసరాజు
(మాటలు)
స్క్రీన్ ప్లేకృష్ణ
దీనిపై ఆధారితంస్వర్గ్ సినిమా (1990)
నిర్మాతజి. నరసింహరావు
తారాగణంకృష్ణ,
మీనా,
కృష్ణంరాజు,
కోట శ్రీనివాసరావు,
జ్యోతి[2]
ఛాయాగ్రహణంకె.ఎస్. హరి
కూర్పుకృష్ణ
సంగీతంబప్పీలహరి[1]
విడుదల తేదీ
3 మే 1991[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యం మార్చు

ఈ చిత్రంలో కృష్ణ నమ్మకమైన సేవకుడి పాత్రను, యజమాని పాత్రను కృష్ణరాజు పోషించాడు. కొంతమంది బంధువులు, వ్యాపార విరోధుల చేసిన కొన్ని సంఘటనల వల్ల కృష్ణని బయటకు పంపిస్తాడు. అదే సమయంలో కృష్ణంరాజు జీవితంలో, వృత్తిలో చాలా నష్టపాతాడు. కృష్ణ తిరిగొచ్చి తన యజమానిని పూర్వస్థితికి ఎలా తీసుకొచ్చాడన్నది మిగతా కథ.[3]

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

ఈ చిత్రానికి బప్పీలహరి సంగీతం అందించాడు.[4]

  • లవ్ లవ్ — మనో, అనూరాధా పౌడ్వాల్
  • తల వాకిట — మనో, అనూరాధా పౌడ్వాల్
  • ప్రాణంలో ప్రాణమా — మనో, అనూరాధా పౌడ్వాల్
  • ఎటు చూసిన — మనో, అనూరాధా పౌడ్వాల్
  • చిక్కాలి చిక్కాలి — మనో, అనూరాధా పౌడ్వాల్

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Indra Bhavanam 1991 film info".
  2. "Indra Bhavanam Cast". Archived from the original on 2020-07-27. Retrieved 2020-08-14.
  3. "Indra Bhavanam Plot".
  4. "Indra Bhavanam Songs".

ఇతర లంకెలు మార్చు