ఇబ్రాహీం మతం

ఒక ఏకేశ్వరోపాసక మతం.ఆదమ్ ప్రవక్తతో ఆరంభమైంది.
(ఇబ్రాహీం మతము నుండి దారిమార్పు చెందింది)

జుడాయిజం నుండి క్రైస్తవం, ఇస్లాం మతములు .క్రీస్తు శకంలో పాత నిబంధన ., .కొత్త నిబంధనలో .క్రీస్తు జీవిత చరిత్ర.ఆధారముగా క్రైస్తవం.ఇస్లాం మతము ఏర్పాటు చెయ్యడం జరిగింది ఇస్లాంలో క్రీస్తు జీవితచరిత్ర కనబడుతుంది

ఇబ్రాహీం మతములు: జుడాయిజం, క్రైస్తవమతము, ఇస్లాం యొక్క చిహ్నాలు.
ప్రపంచంలోని దేశాలలో, ఊదా రంగులో ఇబ్రాహీం మతములు, పసుపు రంగులో తూర్పు మతములు చూపుతున్న పటము.

ఇబ్రాహీం మతము (ఆంగ్లం : Abrahamic religion) ఒక ఏకేశ్వరోపాసక మతము. ఈ ఏకేశ్వరోపాసక విధానము ఆదమ్ ప్రవక్తతోనే ఆరంభమైనది. కాని దీనిని పునర్-వ్యవస్థీకరించిన ఇబ్రాహీం లేదా అబ్రహాము (హిబ్రూ אַבְרָהָם ; అరబ్బీ ابراهيم ) దీని స్థాపకుడిగా భావింపబడుతాడు. ఆదమ్ ప్రవక్త మత పరంపర ఇద్రీస్, నూహ్, సాలెహ్ లతో కొనసాగి, ఇబ్రాహీం మతముగా స్థిరపడి కొన్ని ప్రధాన మతములకు పునాది వేసింది. ఉదాహరణకు జుడాయిజం లేదా యూద మతము, క్రైస్తవ మతము, ఇస్లాం మతం, కొన్ని సార్లు బహాయి విశ్వాసము కూడా.[1][2] ఇంకా కొన్ని మతములు ఈ కోవకు చెందుతాయి. ఉదాహరణకు డ్రూజ్ మతము.[3] ఈ ఇబ్రాహీం మతమును, ప్రపంచంలోని దాదాపు సగం జనాభా అవలంబిస్తోంది. 380 కోట్లమంది, ఈ మతాన్ని అవలంబిస్తున్నారు.[4] తూర్పు మతములు ఇంకో ప్రధాన మతముల సమూహము, ఇవి ధర్మమును అనుసరించి యేర్పడినవి. వీటికి ఉదాహరణలు భారతీయ మతములు,, టావో మతములు.

పుట్టు పూర్వోత్తరాలు మార్చు

"ఇబ్రాహీం మతము" అనేది, ఇస్లామీయ పదజాల మూలం.[1][2] యూదమతము లేదా జుడాయిజం, క్రైస్తవమతము, ఇస్లాం మతము, వీటి మూలాలన్నీ ఒకటే, పశ్చిమ దేశాలలో ఈ ఆలోచనలు 20వ శతాబ్దంలో బయలు దేరాయి. (e.g. James Kritzeck, Sons of Abraham, 1965).

ఇబ్రాహీంకు ప్రవక్తల పితామహుడిగా పేరు గలదు. ఈ ప్రవక్తలు బనీ ఇస్రాయీల్ లేదా ఇస్రాయేలుల సంతతి లేదా ఇస్ హాఖ్ ప్రవక్త సంతతి, ఇస్ హాఖ్ వంశంలో అవతరించారు. ఈ సంతతిలో అవతరించిన ప్రవక్తలకు ఉదాహరణలు మూసా (మోషే), ఈసా (ఏసుక్రీస్తు). ఇస్మాయీల్ ద్వారా ఇతని వంశములో ముహమ్మద్ (ఆయనపై శాంతి శుభాలు వర్షించునుగాక ) ప్రవక్త జన్మించారు.

సాధారణ విషయాలు మార్చు

వ్యాసాల క్రమం
దేవుడు

సాధారణ నిర్వచనాలు
దేవవాదం · హినోథీయిజం
ఏకేశ్వరవాదం · పానెంథీయిజం
పాంథీయిజం · మోనోలాట్రిజం


నిర్దేశిత భావనలు
పేర్లు · "దేవుడు" · ఉనికి · లింగము
సృష్టికర్త · నిర్మాణకర్త · డెమియుర్జ్ · అనంతజీవి
స్వామి · పిత · మొనాడ్ · ఏకత్వం
ఉన్నతుడు · సర్వం · వ్యక్తిగతం
యూనిటేరియానిజం · డైథీయిజం · త్రిత్వము
సర్వవ్యాప్తి · సర్వవ్యాపితం
సర్వాంతర్యామి · అనంత దయామయి
అయ్యవాజీలలో దేవుడు · ఇబ్రాహీం మతాలలో దేవుడు
బహాయి విశ్వాసంలో · క్రైస్తవంలో
హిందూమతంలో దేవుడు · ఇస్లాంలో దేవుడు · యూదమతంలో
సిక్కు మతంలో · బౌద్ధమతంలో


అనుభవాలు, ఆచరణలు
విశ్వాసం · ప్రార్థన · నమ్మకం · అవతరణలు
ఫిడేయిజం · గ్నోసిస్ · మెటాఫిజిక్స్
మిథ్యావాదం · హెర్మెటిసిజం · ఇసోటెరిసిజం


సంబంధిత విషయాలు
తత్వశాస్త్రం · మతం · ఓంటాలజీ
గాడ్ కాంప్లెక్స్ · న్యూరో థియోలజీ
అయోమయం
చెడుతో సమస్యలు (థియోడైసీ)
ఆస్తికవాదం


యూద మతము, క్రైస్తవ మతము, ఇస్లాం మతం నందు, సాధారణంగా కనిపించే సమానతలు:

  • ఏకేశ్వరోపాసన : ఈ మూడు మతములు ప్రధానంగా ఏకేశ్వరోపాసక మతములు. క్రైస్తవ మతములోని 'పరిశుద్ధ త్రిత్వము'ను యూదమతము, ఇస్లాం మతము వారు అంగీకరించరు.కారణం ఇది బహుఈశ్వరవాదానికి తెరతీస్తుంది.
  • ప్రవక్తల సాంప్రదాయం. ఈ మూడు మతాలు, ప్రవక్తల సంప్రదాయాన్ని అంగీకరిస్తాయి. ఆదమ్ ప్రథమ ప్రవక్త అని మూడు మతాలు అంగీకరిస్తాయి. ప్రవక్తల పరంపరను అంగీకరిస్తూనే యూద మతస్తులు ఏసుక్రీస్తును, ముహమ్మద్ ప్రవక్తను అంగీకరించరు. అలాగే క్రైస్తవ మతస్తులు ప్రవక్తల పరంపరను అంగీకరిస్తూ మోషే ప్రవక్తను అంగీకరిస్తారు కాని ముహమ్మద్ ప్రవక్తను అంగీకరించరు. ముస్లింలు ప్రవక్తల సంప్రదాయాన్ని అంగీకరిస్తూ మోషే, ఏసుక్రీస్తునూ ప్రవక్తలుగా అంగీకరించి ముహమ్మద్ ప్రవక్తను ఆఖరి ప్రవక్తగా, ప్రవక్తల గొలుసుక్రమంలో ఆఖరి వారిగా విశ్వసిస్తారు.
  • సెమిటిక్ ప్రజలైన అరబ్బులు, యూదులు గల అరబ్ నేలలోనే యూద మతము, ఇస్లాం మతం పుట్టాయి. క్రైస్తవ మతము యూదమతము నుండి వచ్చింది.
  • ప్రాథమికంగా భగవంతుడి అవతరణలు ఈ మతాలకు మూలం. సాధారణంగా ఇతర మతాలకు తత్వజ్ఞానాలు, సంప్రదాయాలు మూలం.
  • నీతిపరమైన ఆచరణలు మూలం. ఈ మూడు మతాలు మంచి చెడుల మధ్య తారతమ్యాలను గుర్తించి మసలు కోవాలని బోధిస్తాయి. భగవంతుడి ఆదేశాలను ఆచరించడమూ లేదా వ్యతిరేకించడమూ అనే విషయాలపై చర్చిస్తాయి.
  • చరిత్ర అనే విషయం సృష్టితో ప్రారంభమై ప్రళయాంతముతో ముగుస్తుంది. చరిత్రలోని ప్రతి విషయం భగవంతుని విషయాలతో ముడిపడి యుంటుంది.
  • ఎడారితో ముడిపడి, అనగా ఎడారులలో నివసించే తెగలతో ముడిపడి యున్నది.
  • బైబిల్, ఖురాన్లో కానవచ్చే సంప్రదాయాల పట్ల భయభక్తులు కలిగిన జీవనం. ఈ గ్రంథాలలో కానవచ్చే సారూప్యాలు, ఉదాహరణకు ఆదమ్ గురించి కథలు, నూహ్ (నోవా), ఇబ్రాహీం (అబ్రహాం), మూసా (మోజెస్), ఈసా (ఏసుక్రీస్తు), ఖురాన్ అనుగ్రహం కలిగిన ముహమ్మద్ ప్రవక్త ల పట్ల తమ భక్తి భావనలు చాటడం సామాన్యం.
  • ధార్మిక సాహిత్యంలో భగవంతుడు (యెహోవా, అల్లాహ్) విశ్వాన్ని సృష్టించడం, ప్రళయాన్ని కల్గించడం, మోక్షం పొందడం లాంటి విషయాలు సాధారణం.

వీక్షణం మార్చు

 
ఇబ్రాహీం ప్రవక్త సమాధి. పితరుల గుహ యందు గలదని విశ్వాసం.

ఇబ్రాహీం ప్రాముఖ్యత మార్చు

  • యూదుల కొరకు ఇబ్రాహీం, పితరుడు, పిత, లేదా తండ్రి. సకలలోకాల ప్రభువు, ఇబ్రాహీం సంతతి యందు అనేక ప్రవక్తలను ప్రకటిస్తాడని సెలవిచ్చాడు. యూదుల ప్రకారం, నోవా (నూహ్) ప్రవక్త కాలంలో జరిగిన మహాప్రళయము తరువాత జన్మించి వారిలో, విగ్రహారాధనను సహేతుకంగా తిరస్కరించిన వారిలో ఇబ్రహీం ప్రప్రథముడు. ఇతనే తరువాత ఏకేశ్వరోపాసక మతాన్ని స్థాపించాడు.
  • క్రైస్తవులు అబ్రహామును ఆత్మపరమైన పితగా అభివర్ణిస్తారు.[5] క్రైస్తవంలో అబ్రహాము, విశ్వాసానికి ఆదర్శం,[6] ఇతని యొక్క దేవునికి సమర్పించే గుణం, ఏసుక్రీస్తు యొక్క దేవునికి సమర్పించే గుణంతో పోలుస్తారు.[7]
  • ఇస్లాంలో, ఇబ్రాహీం, ప్రవక్తల గొలుసు క్రమంలో ఒక ముఖ్యమైన ప్రవక్త, ఈ గొలుసుక్రమం ఆదమ్తో ప్రారంభం అవుతుంది. ఏకేశ్వరోపాసక విధానాన్ని, తత్వానికి పునరుజ్జీవనం ప్రసాదించినవాడు, అందుకే ఇతన్ని "హనీఫ్" అని వ్యవహరిస్తారు. ఇబ్రహీంను "ప్రవక్తల పిత"గా కూడా అభివర్ణిస్తారు.

భగవంతుడు మార్చు

 
దావీదు డాలును యూదమతస్తులు తమ చిహ్నంగా పెట్టుకున్నారు.

ప్రధాన వ్యాసాలు : గాడ్, ట్రినిటి , అల్లాహ్.

ఇస్లాం , యూద మతము, ఏకేశ్వరవాదాన్ని అవలంబిస్తాయి , ఒకే దేవుణ్ణి (వారి వారి ధర్మగ్రంథాలనుసారం) ఉపాసిస్తాయి. క్రైస్తవం కూడా ఏకేశ్వర ఉపాసనను అంగీకరిస్తుంది, కాని "త్రిత్వం" (దేవుడు, కుమారుడు , పరిశుద్ధాత్మ) అనుసరిస్తుంది. ఈ వాదాన్ని మొదటి రెండు మతాలు స్వీకరించవు. కానీ ఈ క్రైస్తవసముదాయములోని కొందరు మాత్రం ఈ వాదం (త్రిత్వం) రోమనుల సృష్టి అని, జొరాస్ట్రియన్ మతము , పాగన్ల సాంప్రదాయమని, మూల-క్రైస్తవానికి, ఈ త్రిత్వవాదానికి ఏలాంటి సంబంధం లేదని వాదిస్తాయి.

యూద మతములో భగవంతుడు మార్చు

యూద ధార్మికత హెబ్రూ బైబిల్ ఆధారితం. ఈ ధర్మానుసారం దేవుడు మోజెస్ ను ధర్మగ్రంథమైన తోరాహ్ ద్వారా తన ఆదేశాలను , ప్రకృతి సిద్ధాంతాలను అవగతం చేశాడు. "ఎలోహిమ్" అనే పదము దేవునికి ఆపాదింపబడింది. ఇస్లాంలో "ఇలాహి" లాగా.

 
శిలువగుర్తును క్రైస్తవులు తమ చిహ్నంగా పెట్టుకున్నారు.

క్రైస్తవ మతము లో భగవంతుడు మార్చు

క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం, దేవుడు, విశ్వాసం గల హెబ్రూ ప్రజలచే క్రైస్తవానికి పూర్వం పూజింపబడ్డాడు. ఇదే విషయాన్ని ఏసుక్రీస్తు ద్వారా ప్రకటించాడు.

ఇస్లాం లో భగవంతుడు మార్చు

 
ఇస్లామీయ చిహ్నం, అల్లాహ్ పేరు అరబ్బీలో.

అల్లాహ్ అనే పదము, గాడ్ లేదా దేవుడు అనే పదాలకు, అరబ్బీ తర్జుమా. ఇస్లామీయ సంప్రదాయాలనుసారం అల్లాహ్ కు 99 విశేషణాత్మక నామాలు గలవు. ఇస్లామీయ దృక్పథం షహాద ద్వారా ద్యోతకమవుతుంది. ఈ షహాద అనుసారం, దేవుడు ఒక్కడే, ఇతను ఎవడి తండ్రి గాడు, ఇతనికి సంతానమూ లేదు. ఇతనో సృష్టికర్త. సంతానం సృష్టికి వుంటుంది గాని సృష్తికర్తకు గాదు. ఈ విషయం ఖురాన్ లోని సూరయే ఇఖ్లాస్ లో స్పష్టంగా చెప్పబడింది.

బహాయి విశ్వాసం మార్చు

బహావుల్లా ప్రతిపాదించిన ఈ విశ్వాసములో గల గ్రంథాలు, ఇతను వ్రాసినవే. ఈ గ్రంథాలలో బైబిల్, ఖురాన్ విషయాలనే ప్రస్తావించాడు.

రాస్తఫారి ఉద్యమం మార్చు

కొందరు రాస్తఫారి ఉద్యమకారులు, "జేమ్స్ రాజు బైబిలు"ను తమ ధర్మ గ్రంథంగా పరిగణిస్తారు, కాని మిగతావారు నిరాకరిస్తారు. నవీనకాలంలోని రాస్తఫారి ఉద్యమకారులు, అమ్హరిక్ గ్రంథాన్ని చదవడం ప్రారంభించారు. ఈ రాస్తఫారీల ప్రకారం "బైబిలు"లో దేవుని యొక్క సగ వాక్కులే అవతరించాయి, మిగతాసగం మానవజాతి గుండెలోనే గలవు. మార్కస్ గార్వే యొక్క ప్రబోధలు, 'పవిత్ర పిబి' మున్నగునవి మిగతా ధార్మిక గ్రంథాలు. వీటిని ఇథియోపియాకు చెందిన చక్రవర్తి "హైలె సెలాసీ I" ప్రబోధించాడు.

ప్రళయము , పునర్జన్మ మార్చు

ఇబ్రాహీం మతములోని అన్ని మతములు, ప్రళయము,, ప్రళయము తరువాత పునర్జన్మ పై విశ్వాసం ఉంచుతాయి. ప్రళయానికి ముందు, మెస్సయ, జీసెస్, లేదా ఈసా తిరిగీ అవతరిస్తాడని నమ్ముతారు.

ఉపాసనా విధానములు , ధార్మిక సాంప్రదాయాలు మార్చు

భక్తితో, దేవుని ముందు మోకరిల్లడం, ప్రార్థనలు గావించడం, ఉపవాస దీక్షలుంచడం, ఈ మూడు మతాలలో సాధారణంగా కనిపించే విషయాలు. ముస్లింలకు 'శుక్రవారం', యూదులకు 'శనివారం', క్రైస్తవులకు 'ఆదివారం', పరిశుద్ధదినాలు.

యూదులకు 'సినగాగ్', క్రైస్తవులకు 'చర్చి', ముస్లింలకు మస్జిద్లు ప్రార్థనాలయాలు.

ఖత్నా లేదా ఒడుగులు మార్చు

యూద మతము, ఇస్లాం మతములో ఖత్నా లేక ఒడుగులు (తెలుగులో 'సున్తీ' అని వ్యవహరిస్తారు) చేయుట సాంప్రదాయం. ఈ సంప్రదాయమును ఆచరించుట విధిగా ముస్లింలు భావించి ఆచరిస్తారు. కారణం, స్వచ్ఛత, శారీరక పరిశుభ్రత పాటించుట. పశ్చిమ దేశాలలోని క్రైస్తవులు ఈ సంప్రదాయాన్ని బాప్తిజం అనే సాంప్రదాయంగా ఆచరిస్తారు.

ఆహార నియమాలు మార్చు

యూద మతము, ఇస్లాం మతములో ఆహార నియమావళి నిర్దిష్టం చేయబడింది. ఇలాంటి నియమావళినే యూద మతములో "కోషెర్" అని ఇస్లాం మతములో హలాల్ అని వ్యవహరిస్తారు. ఈ రెండు మతములలో పంది మాంసాన్ని భక్షించడం నిషేధం లేదా హరామ్. ఇస్లాంలో మధ్య పానము నిషేధం. యూద మతములోని కోషర్ ఆహారపదార్థాలు, ఇస్లామీయ ప్రపంచంలో హలాల్ లేదా అనుమతించబడినవి.

ఇవీ చూడండి మార్చు

నోట్స్ మార్చు

  1. 1.0 1.1 Smith 1998, p. 276
  2. 2.0 2.1 Anidjar 2001, p. 3
  3. Why Abrahamic? Archived 2007-09-08 at the Wayback Machine Lubar Institute for the Study of the Abrahamic Religions at the University of Wisconsin
  4. Preston Hunter, Major Religions of the World Ranked by Number of Adherents Archived 2008-06-15 at the Wayback Machine
  5. Romans 4:9-12
  6. Hebrews 11:8-10
  7. MacArhur, John (1996). The MacArthur New Testament Commentary : Romans. Chicago: Moody Press. p. 505.

గ్రంథ పఠనాలు మార్చు

Introduction. Acts of Religion. By Derrida, Jacques. New York & London: Routledge. ISBN 0-415-92400-6.

బయటి లింకులు మార్చు