ఈల అనగా నోటితో చేసే ఒక విధమైన శబ్దము. మానవులు, కొన్ని జంతువులు మాత్రమే ఈల వేయగలవు.

The Whistling Boy, Frank Duveneck (1872)

ఈల ఎలా వేస్తారు మార్చు

పెదాలు మాత్రమే ఉపయోగించి వేసే ఈలకన్నా, నోట్లో చేతి వేళ్లను ఉంచి వేసే ఈల వల్ల ఉత్పన్నమయ్యే శబ్ద తీవ్రత చాలా ఎక్కువగా, స్పష్టంగానూ ఉంటుంది. ఈలవేసే ఈ రెండు పద్ధతులలోనూ ఉండే సూత్రం ఒకటే. ఒక వాయురంధ్రం (air cavity) గుండా వేగంగా పయనించే గాలి, దాని ద్వారం దగ్గర గోడలను తాకడంతో అల్లకల్లోలమైన శబ్ద కంపనాలు ఏర్పడడం. వేళ్లు నోటిలో పెట్టి వూదడం ద్వారా వెలువడే గాలి కావలసిన పౌనఃపున్యంతో కంపిస్తుంది. ఈలకు కావలసిన వాయురంధ్రం ఈలవేసే వ్యక్తి నోటి రూపంలో లభిస్తుంది. దాని ద్వారా పయనించే గాలి శబ్ద కంపనాలు చేయడం వల్ల తీక్షణమైన శబ్దం వెలువడుతుంది. ఈల వేయడంలో అనుభవమున్న వ్యక్తులు ఒక వేలితోకూడా నోటిలోని నాలుకను తగు విధంగా మడతబెట్టి శక్తిమంతమైన శబ్దాన్నిచ్చే 'ఈల'ను వేయగలరు.

బయటి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ఈల&oldid=2884047" నుండి వెలికితీశారు