ఎంవీవీ సత్యనారాయణ

ముళ్ళపూడి వీరవెంకట సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త, సినీ నిర్మాత.[2] అతను 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ నుండి ఎంపీగా గెలిచాడు.[3][4]

ముళ్లపూడివీర వెంకట సత్యనారాయణ
ఎంవీవీ సత్యనారాయణ

ఎంవీవీ సత్యనారాయణ


లోక్‌సభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019 - ప్రస్తుతం
ముందు కంభంపాటి హరిబాబు
నియోజకవర్గం విశాఖపట్నం

వ్యక్తిగత వివరాలు

జననం (1966-06-25) 1966 జూన్ 25 (వయసు 57)
తణుకు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి నాగ జ్యోతి
సంతానం శరత్ ముళ్ళపూడి
నివాసం విశాఖపట్నం
మూలం [1]

ఎంవీవీ సత్యనారాయణను విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి సమన్వయకర్తగా 2023 ఆగస్ట్ 25న వైసీపీ అధిష్ఠానం నియమించింది.[5]

జననం, విద్యాభాస్యం మార్చు

సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు లో 1966 జూన్ 25న రఘునాయకులు ముళ్ళపూడి, పర్వతా యర్ధనమ్మ దంపతులకు జన్మించాడు. అతను ఆంధ్ర యూనివర్సిటీ నుండి బీఏ పూర్తి చేశాడు. 1997లో ఎంవీవీ బిల్డర్స్ సంస్థను స్థాపించాడు. అతను విశాఖ బిల్డర్స్‌ అసోసియేషన్‌కు రెండుసార్లు చైర్మన్‌గా వ్యవహరించాడు.[6][7]

సినీ జీవితం మార్చు

ఎంవీవీ సత్యనారాయణ ఎం.వి.వి.సినిమా బ్యానర్ పై తెలుగు, కన్నడలో పలు సినిమాలను నిర్మించాడు. [8]

నిర్మించిన సినిమాలు
  1. గీతాంజలి (2014) [9]
  2. అభినేత్రి (2015)
  3. శంకరాభరణం (2015)
  4. లక్కున్నోడు (2017)
  5. నీవెవరో (2018)
  6. కవచ (కన్నడ - 2019)
  7. కరణం మల్లేశ్వరి బయోపిక్ (2021)
  8. గీతాంజలి మళ్ళీ వచ్చింది (2024)
నటుడిగా
  1. శంకరాభరణం (2015)
  2. లక్కున్నోడు (2017)

రాజకీయ జీవితం మార్చు

ఎంవీవీ సత్యనారాయణ 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి విశాఖ లోక్‌సభ కో ఆర్డినేటర్‌గా నియమితుడయ్యాడు. అతను 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుండి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎం.భరత్ పై 4414 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచాడు.[10] అతనిని 2019 సెప్టెంబరు 15న ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నియమించాడు.[11]

మూలాలు మార్చు

  1. India govt (2019). "M V V Satyanarayana - National Portal of India". Archived from the original on 15 ఏప్రిల్ 2021. Retrieved 10 July 2021.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ దళపతులు". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
  3. Sakshi (2019). "Visakhapatnam Constituency Winner List in AP Elections 2019 | Visakhapatnam Constituency Lok Sabha Election Results". Archived from the original on 10 July 2021. Retrieved 10 July 2021.
  4. "M V V Satyanarayana| National Portal of India". www.india.gov.in. Retrieved 2021-10-05.
  5. Andhra Jyothy (26 August 2023). "తూర్పు వైసీపీ ఇన్‌చార్జిగా ఎంవీవీ". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  6. India Mart (2019). "Mvv Builders". indiamart.com (in ఇంగ్లీష్). Archived from the original on 10 July 2021. Retrieved 10 July 2021.
  7. Sakshi (3 April 2019). "విశాఖలో విజయుడెవరు..?". Archived from the original on 10 July 2021. Retrieved 10 July 2021.
  8. Sakshi (22 August 2016). "విష్ణుకి విలన్గా మారిన నిర్మాత". Sakshi. Archived from the original on 10 July 2021. Retrieved 10 July 2021.
  9. Deccan Chronicle (10 January 2019). "Geethanjali producer to contest in polls". Archived from the original on 10 July 2021. Retrieved 10 July 2021.
  10. The Times of India (24 May 2019). "Visakhapatnam Constituency Election Result: YSRCP's MVV Satyanarayana wins Visakhapatnam LS seat" (in ఇంగ్లీష్). Archived from the original on 10 July 2021. Retrieved 10 July 2021.
  11. Sakshi (15 September 2019). "ఐటీ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా ఎంపీ ఎంవీవీ". Archived from the original on 10 July 2021. Retrieved 10 July 2021.

బయటి లింకులు మార్చు