Xfce (నాలుగు అక్షరాలు విడివిడిగా ఎక్స్ఎఫ్‌సియి అని పలుకుతారు) అనేది లినక్స్, సోలారిస్,, BSD వంటి యునిక్స్, ఇతర యునిక్స్-వంటి వేదికలకు ఒక ఉచిత సాఫ్టువేరు డెస్కుటాప్ పర్యావరణం. ఉపయోగించడానికి సులభంగాను ఉన్నప్పటికీ వేగం, తక్కువ బరువు దీని ముఖ్యోద్దేశ్యం.

ఎక్స్ఎఫ్‌సియి

Xfce 4.4 డెస్కుటాప్.
సరికొత్త విడుదల 4.8.0 / 2011 జనవరి 16 (2011-01-16)
ప్రోగ్రామింగ్ భాష C (GTK+ 2)
వేదిక యునిక్స్ వంటిది
ఆభివృద్ది దశ క్రియాశీలము
రకము డెస్కుటాప్ పరిసరం
లైసెన్సు GNU General Public License, GNU Lesser General Public License and BSD License
వెబ్‌సైట్ www.xfce.org

ప్రస్తుత రూపాంతరం 4.8, మాడ్యులర్, పునరుపయోగించదగినది. ఇది వేరువేరు కూర్చబడిన అంశాలు అన్నీ కలిసి పూర్తిగా పనిచేసే ఒక డెస్కుటాప్ పర్యావరణాన్ని సమకూర్చుతుంది, కానీ ఇది వాడుకరి ఇష్టపడే వ్యక్తిగత పని వాతావరణం సృష్టించడానికి ఉపభాగాలుగా ఎంచుకోవచ్చును. నిరాడంబర హార్డువేర్ పై ఒక ఆధునిక డెస్కుటాప్ పర్యావరణం నడుపుటకు ఎక్స్ ఎఫ్ సియిని ప్రధానంగా ఉపయోగిస్తారు.

ఇది జిటికే ప్లస్ 2 ఉపకరణసామాగ్రి పై (నోమ్ వలె) ఆధారపడింది. ఇది Xfwm విండో నిర్వాహకాన్ని వినియోగిస్తుంది. దీని స్వరూపణం పూర్తిగా మౌసుతో నడుస్తుంది,, స్వరూపణ ఫైళ్లు సాధారణ వాడుకరి నుండి దాచబడతాయి.

పండోరా హేండ్ హెల్డ్ గేమింగ్ వ్యవస్థలో ఉన్న గ్రాఫికల్ వాడుకరి అంతరవర్తులలో ఒకటిగా ఎక్స్ఎఫ్‌సియి చేర్చబడింది.

ఆల్ఫైన్ లినక్స్ ఉపయోగించి 40 మెబై మెమోరీతో ఎక్స్ఎఫ్ సియిని నడుపవచ్చును. ఉబుంటు పై పరీక్షించినపుడు, నోమ్ 2.29, కెడియి 4.4 కంటే Xfce 4.6 తక్కువ మెమరీ వినియోగిస్తుందని తేలింది, కానీ LXDE 0.5 కంటే ఎక్కువ.

చరిత్ర మార్చు

ఎక్స్ఎఫ్‌సియి యోజనను 1996లో ఆలీవర్ ఫౌర్డాన్ ప్రారంభించాడు. నిజానికి ఎక్స్ఎఫ్‌సియి అంటే ఎక్స్ ఫార్మ్స్ కామన్ ఎన్విరాన్మెంట్, కాని ఎక్స్ఎఫ్‌సియి రెండవసారి మరలావ్రాసినపుడు ఎక్స్ ఫార్మ్ ఉపకరణసామాగ్రి వాడబడలేదు. పేరు మాత్రం అలానే ఉంచబడింది, కానీ "XFCE" అని కాకుండా "Xfce" అని వాడుతున్నారు.

అనువర్తనాలు మార్చు

ఎక్స్ఎఫ్‌సియి అనువర్తనములు కొరకు అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికను సమకూర్చుతుంది. Xfce మాత్రమే కాకుండా ఇతర, ఎక్స్ఎఫ్‌సియి లైబ్రరీలను వాడకునే మూడవ పార్టీ ప్రోగ్రాములు కూడా ఉన్నాయి. మౌస్ ప్యాడ్ పాఠ్య కూర్పకము, ఆరేజ్ క్యాలెండర్, టెర్మినల్ చెప్పుకోదగినవి. ఎప్పుడైతే ఒక అనువర్తనము రూట్ సర్వాధికారాలతో నడుపబడుతున్నదో అపుడు వాడుకరిని ఈ చర్య వలన వ్యవస్థ దస్త్రాలు హానికలుగవచ్చని విండో పై భాగంలో ఒక ఎర్రని బ్యానర్ ద్వారా హెచ్చరిస్తుంది.

తునార్ మార్చు

తునార్ అనేది ఎక్స్ఎఫ్‌సియిలో అప్రమేయ దస్త్ర నిర్వాహకం, ఎక్స్ఎఫ్ఎఫ్ఎమ్ కు ప్రత్యామ్నాయమయింది. ఇది నోమ్ యొక్క నాటిలస్ పోలి, వేగం, తక్కువ మెమోరీ అడుగుజాడల రూపొందించబడి అలాగే ప్లగిన్ల ద్వారా బాగా అనుకూలీకరించుకోవచ్చు.

ఇవి కూడా చూడండి మార్చు

బాహ్య లింకులు మార్చు