ఎన్నికల సిరా అనగా డబుల్ ఓటింగ్ వంటి ఎన్నికల మోసాలను నిరోధించేందుకు ఓటర్ల చూపుడు వేలుపై (సాధారణంగా) పూసే ఒక పాక్షిక శాశ్వత సిరా. పౌరుల గుర్తింపు పత్రాలు శాశ్వత ప్రామాణికమైనవి లేదా సంస్థాగతమైనవిగా లేని దేశాలలో ఎన్నికల నిర్వహణ కొరకు ఇది ఒక సమర్థవంతమైన పద్ధతి.

తూర్పు తైమూర్ లో ఒక ఓటరు యొక్క చూపుడు వ్రేలుపై పూసిన ఎన్నికల సిరా.

అనువర్తనం మార్చు

ఎన్నికలలో దొంగ ఓట్లను నిరోధించేందుకు ఎన్నికల సిరాను ఒక మంచి భద్రతాంశంగా ఉపయోగిస్తారు. సాధారణంగా ఈ సిరాను ఎడమ చేతి చూపుడు వేలుపై పూస్తారు, ముఖ్యంగా చర్మంపై పూసిన ఈ సిరాను త్వరగా తొలగించడం దాదాపు అసాధ్యం. పరిస్థితి, ప్రాధాన్యత ఆధారంగా సిరాను వివిధ పద్ధతులలో పూస్తారు. ఎన్నికల సిరా సీసాలో స్పాంజిని లేదా బ్రష్ ను ముంచి పూయడం, స్ప్రే బాటిల్స్,, మార్కర్ పెన్నులు ఉపయోగించడం సర్వసాధారణ పద్ధతులు. వేలుపై పూసిన ఈ సిరా కాంతికి గురియై 15 నుంచి 30 సెకన్లలో పొడి బారుతుంది, తదుపరి సిరా అయిన చర్మాన్ని శుభ్రపరచినప్పుడు కొద్దికొద్దిగా చెరిగిపోతున్ననూ కొన్ని రోజుల పాటు ఆ సిరా గుర్తును గుర్తించవచ్చు.

మిశ్రమము మార్చు

ఇండస్ట్రీ ప్రామాణిక ఎన్నికల సిరా 10%, 14% లేదా 18% సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ ను కలిగి ఉంటుంది. సిరాలోని సిల్వర్ నైట్రేట్ వల్ల సూర్యరశ్మి తగలగానే చర్మంపై స్పష్టమైన గుర్తు ఏర్పడుతుంది.

ఆయువు మార్చు

ఎన్నికల సిరా మరక సాధారణంగా చర్మంపై 72 నుంచి 96 గంటలు, వ్రేళ్ళగోళ్ళు, చర్మం పై పొర (క్యుటికల్) ప్రాంతంలో 2 నుంచి 4 వారాల పాటు ఉంటుంది.

రంగు మార్చు

ఎన్నికల సిరామరక సంప్రదాయకంగా ఉదారంగులో ఉంటుంది. అయితే సురినామెసే 2005 చట్టసభ ఎన్నికలలో ఓటర్ల వ్రేళ్ళ మార్కింగ్ కోసం ఉదారంగు స్థానంలో నారింజ రంగు ఉపయోగించారు. ఓటర్లను మరింత ఆకర్షించేందుకు జాతీయ రంగులను పోలినటువంటి రంగుల వాడకం కనుగొనబడింది.

చరిత్ర మార్చు

NGGGFGGGGకర్ణాటక ప్రభుత్వ రంగంలోని మైసూరు పెయింట్స్ అండ్ వార్నిష్, హైదరాబాద్‌లోని రాయుడు ల్యాబరేటరీస్ అనే రెండు సంస్థలు ఈ ఇంకును తయారు చేస్తున్నాయి. భారత ఎన్నికల సంఘం, నేషనల్ ఫిజికల్ లేబోరేటరి, నేషనల్ రీసెర్చ్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ సాయంతో ఈ ఇంకును తయారు చేస్తారు. ఈ సిరా ఉత్పత్తికి 1962లో ఎంపీవీఎల్ ప్రత్యేక రైట్స్ పొందింది. అప్పటి నుంచి ఎన్నికలకు ఈ సంస్థ సిరాను అందిస్తోంది. 1976 నుంచి మరో 28 దేశాలకు ఈ సంస్థ సరఫరా చేస్తోంది. 2006 ఫిబ్రవరి ఒకటో తేది నుంచి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలు గోరు పైభాగం నుంచి కింద వరకు గీత గీయడం ప్రారంభించారు. అంతకుముందు గోరు కింద ఉండే చర్మంపై గుర్తు పెట్టేవారు.[1]

మూలాలు మార్చు

  1. "ప్రపంచ ఓటర్ల వేలిపై తెలంగాణ సిరా చుక్క". BBC. Retrieved 12 January 2019.

సాక్షి దినపత్రిక (5-4-2014)