ఎరుకల

దక్షిణ భారతదేశంలో నివసిస్తున్న ఒక సామాజికవర్గం.

ఎరుకల లేదా కుర్రు ప్రధానంగా దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో నివసిస్తున్న సామాజికవర్గం. ఎరుకలవారు దక్షిణ భారతదేశపు ఆదివాసులు. తమను తాము కుర్రువారిగా పిలుచుకుంటారు. తెలుగు ప్రాంతాలలో వీరిని ఎరుకలు అని పిలుస్తారు. ఈ జాతికి చెందిన మహిళలకు ఎరుక చెప్పటం (సోది, గద్దె, జ్యోతిష్యం) ప్రధాన వృత్తిగా ఉండేది కనుక వీరిని ఎరుకలవారు అని పేరువచ్చింది. మహారాష్ట్రలో ఎరుకలను కైకాడి - కుచికొర్వే (మకడ్‌వాలా) అని వ్యవహరిస్తారు.[1]

ఎరుకల
వర్గీకరణగిరిజనులు, ఆదివాసులు.
మతాలుహిందూమతం
భాషలుఎరుకల భాష, తెలుగు, తమిళం, కన్నడ
జనాభా గల రాష్ట్రాలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక
Subdivisions5

చరిత్ర మార్చు

ఎరుకలు తమను తాము మహాభారతంలోని ఏకలవ్యుని వంశంగా భావిస్తారు. మహాభారతంలో ఏకలవ్యుడు నిషాధ కులానికి చెందిన వాడని చెప్పబడింది. నిషాధులను ఉత్తర భారతదేశంలో కిరాతులు అని కూడా వ్యవహరిస్తారు. కిరాతులు, నిషాదులు ఆరితేరిన విలుకాండ్రు. బస్తర్ లోని భిల్ (విల్లు అనే పదానికి అపభ్రంశం) తెగ ఈ కిరాతులు, నిషాధులకు సంబంధం కలవారని, ఎరుకలు, భిల్ తెగ యొక్క ఒక శాఖ అని భావిస్తారు.

ఆధునిక చరిత్ర మార్చు

అనేక మార్పులు, సంవత్సరాలు గతించిన తరువాత ఎరుకుల జాతి ప్రజలు అడవికి పరిమితమై అటవీ ఉత్పత్తులు, వేటాడం ద్వారా జీవనం సాగించేవారు. భ్రీటీషు వారి పాలనలో 1878 సంవత్సరం అటవీ ఉత్పత్తులను ఉపయెాగించటం, వేటాడం నిషేధించిన కారణంగా ఎరుకుల జాతి ప్రజలు మైదాన ప్రాంతాలలకు (గ్రామాలకు) విస్తరింటము జరిగింది. ఆ కారణంగా ఎరుకుల ప్రజలు అడవి సంపద మీద హక్కులు కోల్పోఇ మైదాన ప్రాంతాలలో నివసించుట వలన గ్రామ సమాజంలో కనీస సౌకర్యాలు, గౌరవం పోందలేక పోయారు. 1911 సంవత్సరం భ్రీటీషు పాలకులు ( నేటి చెనై పట్టణం అధికారులు) ఎరుకుల జాతి ప్రజలను నేరస్తుల యెుక్క జాబితాలో చేర్చారు. అప్పటి నుండి బ్రిటీషు వారి కాలంలో దుర్బర దారిద్రం ఎరుకుల జాతి ప్రజలు అనుభవించారు. భారతదేశనికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1952లో అట్టి నేరస్తుల జాబితాలో నుండి ఎరుకుల జాతిని తొలగించం జరిగింది. కాని నేటికి కూడా అనేక ప్రాంతాలలో ఎరుకుల జాతి ప్రజలు దుర్బర దారిద్రం అనుభవించుచున్నారు.భ్రీటీషు పాలనలో ఎరుకుల జాతి ప్రజలు వ్యవసాయ కూలిలుగా, చిన్న వర్తకులుగా, చాపలు అల్లటం,బుట్టలు, తయారు చేయటం ద్వారా జీవనం సాగించేవారు. ఈ కాలంలో అనేకమంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. మరి కొంతమంది ఆర్థిక స్వాతంత్ర్యం అనుభవిస్తున్నారు. కాని భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడచినా ఇప్పటికి అనేక ప్రాంతాలలో ఎరుకుల జాతి ప్రజలు సమాజంలో అణచివేతకు, అవమానలకు గురై బాధలు అనుభవిస్తున్నారు.

గణాంకాలు మార్చు

  • నివాసం: మైదాన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు.
  • జీవనాధరం: వ్యవసాయం, చేతి వృత్తులు, జంతు పోషణ.
  • అక్షరాస్యత 2010 లెక్కల ప్రకారం 61%

జనాభా మార్చు

భాష మార్చు

ఎరుకుల ప్రజలు తమ స్వంత భాష అయిన ఎరుకుల భాషను ఉపయెాగిస్తారు, దానిని కుర్రు భాష లేక కులవత అంటారు, ఇది రవుల, ఇరుల అనే ధ్రవిడ భాషలకు సమీపముగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎరుకుల భాషను తమ కుటుంబాలలో ఉపయెాగిస్తారు. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలలో ఈ భాషను ఎక్కువగా ఉపయెాగిస్తారు.

ఉప జాతులు మార్చు

ఎరుకుల జాతి ప్రజలు తమ ఉప వృత్తుల ఆధారముగా విభజించబడింది.

  1. దబ్భ ఎరుకుల ( వీరు బుట్టలను వెదురు పుల్లలతో తయారు చేస్తారు.)
  2. ఈత పుల్లల ఎరుకుల (వీరు బుట్టలను ఈత పుల్లలతో తయారు చేస్తారు.)
  3. కుంచపురి ఎరుకుల ( వీరు దువ్వెనలు తయారు చేస్తారు .)
  4. కరివేపాకు ఎరుకుల ( ఆకు కుారలు అమ్ముట ధ్వార జీవనము సాగిస్తారు )
  5. ఉప్పు ఎరుకుల ( ఉప్పు అమ్ముట ధ్వార జీవనము సాగిస్తారు )

ప్రతి ఉప జాతి నాలుగు గోత్రాలుగా విభజించబడినది

  1. కావాడి
  2. సాతుబడి
  3. మానుబడి
  4. మేండ్రగుతి
  5. కోతాడి

ప్రతి గోత్రంనకు అనేక ఇంటి పేర్లు ఉన్నాయి. ( ఏ గోత్రంనకు చెందినవారు అనేది ఇంటి పేర్లు ఆధారముగా గుర్తిస్తారు )

కోరమ, కోరభ, కానిమాను, కనిహేలు, ఇతర పేర్లతో పిలువబడుచున్న కాణి చెప్పు వారు కూడా ఎరుకుల జాతికి చెందిన వారు.

పాలపర్తి/సాతుబడి/ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ గుంటూరు
ఇంటిపేర్లుగోత్రాలుప్రాంతాలు
చిట్టిపోతుల మానుబడిపశ్చిమ గోదావరి,ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
బొల్లురుకావడిబొల్లవరం,కర్నూలు
రాగిరికావడిమహబూబ్ నగర్ తెలంగాణ
ఉడసరిసాతుపాడిరాయలసీమ నంద్యాల
మేడ-కావడిఖమ్మం జిల్లా
అన్నగనిసాతుబడిప్రకాశం జిల్లా
మనుపటిమానుపటిఉభయ గోదావరి జిల్లాలు
అంబటి మానుబడి విశాఖపట్నం,తూర్పుగోదావరి,స్టూవర్టుపురం
ఆవులమేడ్రగూతిస్టువర్టుపురం
భారతకావడిఉభయ గోదావరి జిల్లాలు
అంచికావాడిలింగాల
అంబికావాడిబిట్రగుంట
అనపకావాడిస్టువర్టుపురం
ఆమసమానుబడిఆత్మకూరు,స్టువర్టుపురం
ఆకుల కావాడివిశాఖపట్నం జిల్లా,తూర్పుగోదావరి జిల్లా,పశ్చిమగోదావరి జిల్లా
అంగడిసాతుబడిస్టువర్టుపురం
అలిజెసాతుబడితెలంగాణా
ఇరగకావాడిప్రకాశం జిల్లా
ఇట్టమానుబడిప్రకాశం జిల్లా
ఇరుకుకావాడిలింగాల
ఉయ్యాలకావాడిస్టువర్టుపురం,ప్రకాశం జిల్లా
కట్టాకావాడిఆళ్ళూరు, ఆత్మకూరు, స్టువర్టుపురం, ప్రకాశం జిల్లా
కామంచిమానుబడిఆళ్ళూరు
కర్రెద్దులకావాడిఆత్మకూరు, స్టువర్టుపురం
కేంసారంసాతుబడితెలంగాణా
కురకులకావాడీతెలంగాణా
కందులసాతుబడిలింగాల
కంపకావాడిలింగాల,స్టువర్టుపురం
కరుకొండసాతుబడిలింగాల
కొండ్రెడ్డికావాడిలింగాల
కోనేటిసాతుబడిఆళ్ళూరు
కంద్రకొండసాతుబడిస్టువర్టుపురం
కొండ్రెడ్డిమేండ్రగూతిస్టువర్టుపురం
కుంభసాతుబడిగుంటూరు జిల్లా
గజ్జెలమేండ్రగూటిస్టువర్టుపురం
గాలేటికావాడిలింగాల,కృష్ణా జిల్లా, స్టువర్టుపురం
గుణాదరిసాతుబడిగుంటూరు జిల్లా
గంటామానబడిగుంటూరు జిల్లా
గుర్రంకొండసాతుబడికప్పరాళ్ళతిప్ప,ఆత్మకూరు
గుత్తికావాడిబిట్రగుంట
గొజ్జాకావాడిలింగాల
చిత్తూరికావాడిలింగాల,స్టువర్టుపురం
చిన్నపోతులమేండ్రగూతిస్టువర్టుపురం
జగన్నాథంకావాడిప్రకాశం జిల్లా, కడప, స్టువర్టుపురం
దాసరిసాతుబడిఆళ్ళూరు, స్టువర్టుపురం, తెలంగాణా
గంధంకావాడి రాజమండ్రి, తుర్పు గోదావరి జిల్లా
దాసుకావాడిఆళ్ళూరు, ప్రకాశం జిల్లా
దేవరసాతుబడికప్పరాళ్ళతిప్ప, స్టువర్టుపురం
దేవరకొండకోతాడిఅన్ని ప్రాంతాల్లో
దేవరాయ (దేవరాజు)కావాడితెలంగాణా
దేవుసారిసాతుబడితెలంగాణా
ముకిరికావాడిగుంటూరు జిల్లా
నల్లగొండ్లమేండ్రగూతికప్పరాళ్ళతిప్ప, ఆళ్ళూరు, లింగాల
నలబాయిమేండ్రగూతికప్పరాళ్ళతిప్ప, ఆళ్ళూరు
నల్లబొత్తులమేండ్రగూతిలింగాల, స్టువర్టుపురం
నెమలికావాడితెలంగాణా
నాగళ్ళమేండ్రగూతివిశాఖ జిల్లా, తూర్పు గోదావరి జిల్లా
గుంటూరుమానుబడి తెలంగాణా,తుర్పు గోదావరి జిల్లా
నెలికుదురుసాతుబడిలింగాల
పాలపర్తిసాతుబడికప్పరాళ్ళతిప్ప
పాలకొందసాతుబడిఅన్ని ప్రాంతాల్లో
పసుపురెడ్డికావాడిశ్రీకాకుళం జిల్లా ,విజయనగరం జిల్లా ,తూర్పు గోదావరి జిల్లా
పిట్లకావాడిప్రకాశం జిల్లా
పీరిగసాతుబడి, కావాడికప్పరాళ తిప్ప, ఆత్మకూరు, లింగాల
పూదటాసాతుబడితెలంగాణా
పూజారికావాడిఆత్మకూరు,లింగాల
పులి మానుబడిశ్రీకాకుళం జిల్లా ,విజయనగరం జిల్లా ,విశాఖ జిల్లా,తూర్పు గోదావరి జిల్లా
పెనుగొండకావాడిఆత్మకూరు, రాయలసీమ
పేరంసాతుబడిలింగాల, ఆళ్ళూరు
పొన్నాసాతుబడిలింగాల,కృష్ణా జిల్లా
పొర్సాసాతుబడిఆత్మకూరు, ప్రకాశం జిల్లా
పోలసాతుబడిఆత్మకూరు, లింగాల
బాదనపూరికావాడిఆళ్ళూరు, తెలంగాణా
బల్లానిసాతుబడిస్టువర్టుపురం
బల్లారిసాతుబడిలింగాల
బోనగిరికావాడిస్టువర్టుపురం, కప్పరాళ్ళతిప్ప
బొచ్చుసాతుబడిస్టువర్టుపురం, కప్పరాళ్ళతిప్ప
బొజ్జగానికావాడిస్టువర్టుపురం, లింగాల
బాగ్యంసాతుబడికప్పరాళ్ళతిప్ప
మద్దెలమానుబడిఆళ్ళూరు
అధంకిమేండ్రగుత్తి ఆళ్ళూరు,తెలంగాణ,పశ్చిమా గోదావరి
మర్కల్సాతుబడితెలంగాణా
మల్లికావాడికప్పరాళ్ళతిప్ప, స్టువర్టుపురం, లింగాల
మేకలమానుబడివిశాఖ జిల్లా, తూర్పు గోదావరి జిల్లా
మాణిక్యం మేండ్రగూతిశ్రీకాకుళం జిల్లా ,విజయనగరం జిల్లా ,విశాఖ జిల్లా,తూర్పు గోదావరి జిల్లా
మాదినెమానుబడిచిత్తూరు జిల్లా
మేడ (ద)సాతుబడిఅక్కడక్కడా
రాగాలసాతుబడిస్టువర్టుపురం
రాస్టపురంకావాడితెలంగాణా
వల్లభమానుబడిగుంటూరు జిల్లా
వనమకావాడితెలంగాణా
వల్లగికావాడిస్టువర్టుపురం
వల్లగులసాతుబడిలింగాల
పల్లెపుమేండ్రగూతిఅక్కడక్కడా
పాల్వాయిసాతుబడిలింగాల
శ్రీమర్తిసాతుబడితెలంగాణా
శ్రీరామ్సాతుబడితెలంగాణా
శ్రీరామమానుబడిప్రకాశం జిల్లా
తోటకావాడిలింగాల,ప్రకాశం జిల్లా,
సార్లసాతుబడి ప్రకాశం జిల్లా
సొరకాయలకావాడిప్రకాశం జిల్లా
లోసారిసాతుబడిలింగాల
సూరెద్దికావాడివరదయ్యపాళెం, చిత్తూరు, నెల్లూరు జిల్లా
భారతికావడిఉభయ గోదావరి జిల్లాలు
కిల్లాసాతుబడిచిత్తూరు, నెల్లూరు జిల్లా
సురసురసాతుబడి కర్నూలు

(పరస /సతుబడి ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నకరికల్లు )

   చర్లపల్లి / సాతుపడి. తెలంగాణ. సూర్యాపేట
   కూతాటి / కావాడి.  తెలంగాణ
   శ్రీరాముల / కావాడీ. తెలంగాణ.

మతం మార్చు

ఎరుకుల ప్రజలు హిందు దేవతలైన, శివుడు, వెంకటేశ్వరుడు, నరశింహస్వామి, నారాయణుడు, రాముడుని ఆరాధిస్తారు., పోలిమేర దేవతలైన అంకమ్మ, కోల్లపుర, సుంకలమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మ, మొదలగు గ్రామ దేవతలను ఆరాధిస్తారు. ఎరుకల కుల దైవం నంచారి దేవత. ప్రజలు ప్రకృతి దేవతలైన సూర్యుడు, చంద్రుడు, అగ్నిని పూజిస్తారు.హిందు పండగలను ఆచరిస్తారు. సంక్రాంతి, శివరాత్రి, శ్రీరామనవమి, దసారా,ఉగాది పండగలను ఆచరిస్తారు. కొన్ని ప్రాంతాలలో హిందు ఆలయాలలోనికి అనుమతి నిరాకరించుట వలన చెట్లు వద్ద రాతి బోమ్మలు, మట్టి బోమ్మలు పెట్టుకోని ఆరాధిస్తారు. ఎక్కువమంది ప్రజలు హిందు మతాన్ని పాటిస్తారు. ఐతే ఇప్పుడిప్పుడే మిషనరీల ప్రభావంతో క్రైస్తవమతం చొచ్చుకు వస్తుంది. క్రైస్తవులుగా మారిన కూడా తమ స్వంత గుర్తింపుతో క్రైస్తవ మతము (లేక) పాటించే విధానము ద్వారా తమ ప్రత్యేకతను కాపాడుకోంటున్నారు.

సామాజిక పద్దతులు మార్చు

ఎరుకుల ప్రజలలో సాధారణంగా కుటుంబ వ్యవస్ధ తండ్రి వారసత్వ సాంప్రదాయకంగా ఉంటుంది. వివాహాలలో మేనరిక సంబంధాలు అనుమతిస్తారు. ఏక భార్యత్వము కుటుంబ సాంప్రదాయక ప్రమాణము . ఐతే కోన్ని ప్రత్యేక సందర్భములలో బహు భార్యత్వము అనుమతిస్తారు.వివాహలు సాధారణంగా చర్చల ద్వారా, కానుకలు ( ఓలి ) ద్వారా జరిపిస్తారు. సాంప్రదాయకముగా వివాహము ఐన స్త్రీలు వివాహమునకు గుర్తుగా కంఠాభరణము ధరిస్తారు. ఈ కాలములో తాళి బొట్టు,మంగళ సూత్రము ధరిస్తున్నారు. విడాకులు అనుమతిస్తారు కాని వ్యభిచారము, పిల్లలు పుట్టక పోవటము కారణముగా భార్య, భర్తలలో ఎవరైన విడాకులు కోరవచ్చు. వితంతువులు మరోక వివాహమునకు అర్హులు. కుటుంబ సమస్యలు చర్చల ద్వారా లేదా కుల పంచాయితీ ద్వారా పరిష్కరిస్తారు. ఎరుకుల కుటుంబ వ్యవస్థను నడిపించటానికి సామాజికముగా వారికి క్రమశిక్షణ పద్ధతులు ఉన్నాయి. వాటిని కుల పంచాయితీ లని అంటారు. కుల పంచాయితిలో అనేక మంది అనుభవము కలవారు ఉంటారు. వారికి అనుభశాళి, కుల వ్యవస్థను గూర్చిన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి నాయకుడుగా ఉంటారు. కుల పంచాయితీ కుటుంబ తగాదాలు, నేరాలు, వ్యభిచారము, అప్పులు, ఆస్తి వివాదాలు, భూ వివాదాలు మొదలగు వాటిని పరిష్కరిస్తుంది. ఈ కుల పంచాయితీలో నేర నిర్ధారణ కోన్ని పద్ధతుల ఆధారంగా జరుగుతుంది. 1) వేడి నూనెలో చేతిని ముంచటం ద్వారా 2) కాలిన ఇనుప కడ్డీను చేతులతో పట్టుకోవటం ద్వారా 3) నిప్పల మీద నడువుట ద్వారా నేర నిర్ధారణ జరుగుతుంది. కుల పంచాయితీలలో వివాదాలు పరిష్కరించటమే కాకుండా స్థానిక సంఘంలో ఐకమత్యంను, వ్యక్తిగత ప్రవర్తన పరిశీలన జరుగుతుంది. ఎవరైనా కుల పంచాయితీను అతిక్రమించితే వారిని కుల బహిష్కరణ చేస్తారు.

ఆహర అలవాట్లు మార్చు

ఎరుకుల ప్రజలు మాంసహరులు, బియ్యము, పప్పు దినుసులు ఆంధ్ర ప్రాంతాలలో భుజిస్తారు. రాగి జావ, బియ్యము రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలలో భుజిస్తారు.సాంప్రదాయకముగా చాపలు అల్లటము, పశు పోషణ, పందుల పెంపకము, బుట్టలు తయారు చేయటము, చీపుర్లు తయారు చేయటము తమ వృత్తిగా కొనసాగిస్తారు., చిన్నచిన్న వ్యాపారాలు చేస్తారు . ఎరుకుల స్త్రీలు భవిష్యత్తు వాణి (సోది) చెప్పటములో ప్రత్యేకముగా ఉంటారు, కుటుంబ పాలనలో తెలివిగా ఉంటారు.

కుల వర్గీకరణ మార్చు

ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితాలో 33వ కులం. గిరిజన తెగలలో ఈనాడు ఎరుకలు సాంఘికంగా బలమైన తెగ. ఎరుకలమ్మలు సోది చెప్పేవారు. స్టూవర్టుపురం, కప్పరాళ్ళతిప్ప, సీతానగరం (తాడేపల్లి) పల్నాడు జిల్లా నేకరికల్లు గ్రామాలు ఈ తెగ ప్రజల ఆధిపత్యంలో ఉన్నాయి. ఎరుకల భాష తమిళ భాషకు దగ్గరగా ఉంటుంది.

ఎరుకల కులంలో మొదటి లో 30 కి పైగా  ఉప తెగలు ఉన్నాయి.

ప్రస్తుతం ఉన్న ఉప తెగల రకాలు.

అవి.

1. ఎరుకల ( మొదట్లో పేర్కొన్న అనేక ఎరుకల ఉప తెగలు అన్ని ఇందులో ఉన్నాయి)

2. ఉప్ప ఎరుకల

3. దబ్బ ఎరుకల

4. కుంచేపూరి ఎరుకల

వీరిలో అనేక రకాలైన నేరాలు చేసి నేర-ఆరోపణలు ఎదుర్కొనబడి అనేక శిక్షలు అనుభవించిన వారు ఉన్నారు.

వారు సెటిల్మెంట్ ఎరుకల గా పిలవబడుతున్నారు. వీరిని క్రిమినల్ ట్రైబ్స్ అని కూడా అంటారు.

వీరిని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్తారు.

1.రాయలసీమ జిల్లాలలో పెద్దింటి గొల్లలు అని.

2. ఉభయగోదావరి జిల్లాలలో తెలగ పాముల అని.

3. ఉమ్మడి విశాఖ జిల్లాలలో మరాఠీలు అని.

4. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఎర్రగొల్లలు అని పిలుస్తారు.

పై వారి ప్రాంతాన్ని బట్టి పేరు మారింది తప్ప వీరంతా ఎరుకల కులానికి చెందినవారే. ఆయా ప్రాంతాలను బట్టి పేర్లను కూడా పోలీసులు పెట్టిన పేర్లూ మాత్రమే.

విరంత ఎరుకల కులానికి చెందినవారు.కొందరు పెద్దలు వీరిని దొంగతనాలు చేస్తున్నారు అనే నేపథ్యంలో వీరిని ఏరుకల కులం నుండి వేరుచేసి చూస్తున్నప్పటికీ చరిత్ర తెలిసిన కొందరు ఎరుకల కుల పెద్దలు వారితో పాటు కలుపుకుని  ముందుకు తీసుకుని వెళుతున్నారు.

మూలాలు మార్చు

  1. Chaudhuri, Sarit Kumar; Chaudhuri, Sucheta Sen, eds. (2005). Primitive tribes in contemporary India: concept, ethnography and demography. Vol. 2. Mittal Publications. p. 263. ISBN 81-8324-026-7.

ఇతర పఠనాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ఎరుకల&oldid=4172582" నుండి వెలికితీశారు