ఎస్.ఎ.చంద్రశేఖర్

భారతీయ సినిమా దర్శకుడు

ఎస్.ఎ.చంద్రశేఖర్ ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, నటుడు, రచయిత. ఇతడు ముఖ్యంగా తమిళ చిత్రాలకు పనిచేశాడు.[3] ఇతడు సట్టం ఒరు ఇరుత్తరై (1981) అనే తమిళ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[4] ఇతడు వేట్రి, నాన్ సిగప్పు మనిధన్, ముత్తం, సట్టం ఒరు ఇరుత్తరై వంటి అనేక విజయవంతమైన సినిమాలను తీశాడు.

ఎస్.ఎ.చంద్రశేఖర్
జననం
ఎస్.ఎ.చంద్రశేఖర్[1]

వృత్తినటుడు, దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1981-ప్రస్తుతం
జీవిత భాగస్వామిశోభ చంద్రశేఖర్
పిల్లలుఇద్దరు, విజయ్ తో సహా
బంధువులువిక్రాంత్ (మేనల్లుడు)
విరాజ్ (అల్లుడు)

వ్యక్తిగత జీవితం మార్చు

ఎస్.ఎ.చంద్రశేఖర్ తమిళనాడు రాష్ట్రంలోని, రామేశ్వరం నగరంలోని "తంగచిమదం" అనే ప్రాంతానికి చెందినవాడు.[2] ఇతడు కర్ణాటక సంగీత కళాకారిణి శోభను వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించింది. కొన్ని సినిమాలలో పాటలు పాడింది. కొన్ని సినిమాలకు కథను సమకూర్చింది. ఇతని కుమారుడు విజయ్ కూడా తమిళ సినిమా నటుడు, గాయకుడు.[5] ఇతని దర్శకత్వంలో వెలువడిన "నాలయ తీర్పు" అనే సినిమాతో విజయ్ వెండితెర జీవితాన్ని ప్రారంభించాడు. ఇతని కుమార్తె విద్య రెండేళ్ల వయసులోనే మరణించింది.[6] ఇతని సమీప బంధువులు ఎస్.ఎన్.సురేందర్ నేపథ్య గాయకుడిగా, విక్రాంత్ నటుడిగా సినిమాలలో పనిచేస్తున్నారు.

సినిమా రంగం మార్చు

ఇతడు తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో 70కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. నిర్మాతగా ఏడు చలన చిత్రాలను నిర్మించాడు. 17 తమిళ సినిమాలకు కథను అందించాడు. 44 సినిమాలకు స్క్రీన్‌ప్లే వ్రాశాడు. అంతే కాక 15 సినిమాలలో నటించాడు కూడా. ఇతడు తెలుగులో "చట్టానికి కళ్లులేవు", "బలిదానం", "పల్లెటూరి మొనగాడు", "దేవాంతకుడు", "దోపిడి దొంగలు", "ఇంటికో రుద్రమ్మ" సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇతని సినిమాలలో విజయ కాంత్, విజయ్, రజనీకాంత్, చిరంజీవి, శోభన్ బాబు, విష్ణువర్ధన్, అంబరీష్, శంకర్ నాగ్, మిథున్ చక్రవర్తి, జితేంద్ర, ధనుష్ మొదలైన హీరోలు నటించారు. విజయశాంతి, రోహిణి, త్రిష, ముచ్చర్ల అరుణ, ఆరతి, మేఘనా నాయుడు, రాధిక, పూనమ్ కౌర్, రంభ, ప్రియాంక చోప్రా, అభిరామి, మీనా, సిమ్రాన్ మొదలైన నటీమణులు ఇతని సినిమాల్లో నటించారు. ఇతడు ఎక్కువగా విజయకాంత్, విజయ్‌లతో సినిమాలు తీశాడు. ఇతని కుమారుడు విజయ్ ఇతని దర్శకత్వంలో 16 పైచిలుకు సినిమాలలో నటించాడు. ఎస్. శంకర్, ఎం.రాజేష్, పొన్‌రామ్‌, రజినీ మురుగన్ తదితరులు ఇతని వద్ద సహాయకులుగా పనిచేసి ఆ తరువాత దర్శకులుగా రాణించారు.[7][8]

వివాదాలు మార్చు

ఇతడు ఒక ఆడియో రిలీజింగ్ ఫంక్షన్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కాడు. తిరుపతి దేవస్థానంలో ప్రజలు దేవునికి ముడుపుల పేరుతో లంచం ఇస్తున్నారని, భగవంతుడు భక్తుల కోరికలన్నీ తీర్చేటట్టయితే ఇక ఎవరూ చదువుకోవలసిన అవసరం లేదని ఇతడు చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. హిందు మున్నాని అనే సంస్థ ఇతని వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని, ఇతనిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ కమీషనర్‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో హిందూ మున్నాని హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్ట్ న్యాయాధికారి ఇతనిపై కేసు నమోదు చేయవలసిందిగా పోలీసులను ఆదేశించాడు.[9]

 
చట్టానికి కళ్ళులేవు

ఫిల్మోగ్రఫీ మార్చు

సంవత్సరం సినిమా పనిచేసిన శాఖ భాష వివరణ
దర్శకత్వం నిర్మాణం స్క్రీన్‌ప్లే కథ నటన
2018 ట్రాఫిక్ రామసామి  Y తమిళం
2016 కోడి  Y తమిళం తెలుగులో ధర్మయోగి పేరుతో డబ్ అయ్యింది.
2016 నయ్యపుదై  Y  Y  Y తమిళం
2015 టూరింగ్ టాకీస్  Y  Y  Y  Y  Y తమిళం
2011 సత్తపది కుట్రమ్‌  Y  Y  Y  Y తమిళం
2010 వెలుతు కట్టు  Y తమిళం
2008 పంద్యం  Y  Y  Y తమిళం
2007 నెంజిరుక్కుమ్‌ వరై  Y  Y తమిళం
2006 ఆది  Y తమిళం తెలుగులో "నేనేరా ఆది" పేరుతో డబ్ అయ్యింది.
2005 సుక్రన్  Y  Y  Y  Y  Y తమిళం
2003 ముత్తం  Y  Y తమిళం
2002 తమిళన్  Y తమిళం దమ్ముంటే కాస్కో పేరుతో తెలుగులో డబ్బింగ్ చేయబడింది.
2001 దోస్త్  Y  Y  Y తమిళం
1999 పెరియన్న  Y  Y తమిళం
1999 నెంజినిలె  Y  Y  Y తమిళం సారథి పేరుతో తెలుగులో డబ్ అయ్యింది.
1998 ప్రియముదన్  Y తమిళం ప్రేమించేమనసు పేరుతో తెలుగులో పునర్మించబడింది.
1997 వన్స్‌మోర్  Y  Y తమిళం
1996 మాంబుమిగు మానవన్  Y  Y తమిళం
1995 విష్ణు  Y  Y తమిళం మిస్టర్ హరికృష్ణ పేరుతో తెలుగులో డబ్ అయ్యింది.
1995 దేవా  Y  Y  Y తమిళం
1994 రసిగన్  Y  Y తమిళం
1993 సెంధూరపండి  Y  Y తమిళం బొబ్బిలి రాయుడు పేరుతో తెలుగులో డబ్ అయ్యింది.
1993 జీవన్ కి షత్రంజ్  Y  Y హిందీ ఇది "రాజనాదై" అనే తమిళ సినిమాకు రీమేక్
1993 రాజదురై  Y  Y తమిళం రాజసింహ పేరుతో తెలుగులో డబ్ చేయబడింది.
1992 ఇన్నిసై మళై  Y  Y తమిళం
1992 నాలయ తీర్పు  Y  Y తమిళం
1992 మేరా దిల్ తేరే లియే  Y హిందీ నంబరగళ్ అనే తమిళ సినిమా రీమేక్
1992 ఇన్సాఫ్ కి దేవి  Y హిందీ
1990 ఆజాద్ దేశ్ కె గులామ్‌  Y  Y తమిళం
1990 జై శివ్ శంకర్  Y హిందీ
1990 సీత  Y తమిళం
1989 రాజనాదై  Y  Y తమిళం
1988 ఇదు ఎంగళ్ నీతి  Y  Y తమిళం
1988 సుధాంతిర నాత్తిన్ ఆడిమైగళ్  Y తమిళం
1988 పూవుం పూయలం  Y తమిళం
1987 ఖుద్రత్ కా కానూన్  Y హిందీ
1987 సట్టం ఒరు విలయాత్తు  Y  Y  Y  Y తమిళం
1987 నీతిక్కు దండనై  Y  Y  Y తమిళం తెలుగులో న్యాయానికి శిక్ష పేరుతో పునర్మించబడింది.
1986 నీలవె మాలరె  Y  Y తమిళం
1986 వసంత రాగం  Y  Y తమిళం
1986 ఏనక్కు నానె నీదిపతి  Y  Y  Y  Y తమిళం
1986 ఏన్ శబదం  Y తమిళం
1986 సిగప్పు మాలర్గల్  Y  Y  Y తమిళం
1985 ఇంటికో రుద్రమ్మ  Y తెలుగు
1985 నీదియిన్ మరుపక్కమ్  Y  Y తమిళం
1985 నాన్ సిగప్పు మనిధన్  Y  Y  Y తమిళం తెలుగులో మిస్టర్ విజయ్ పేరుతో డబ్బింగ్ అయ్యింది.
1985 బలిదాన్  Y హిందీ
1985 పుదు యుగం  Y  Y  Y తమిళం
1984 కుదుంబం  Y  Y  Y  Y తమిళం
1984 దోపిడి దొంగలు  Y తెలుగు
1984 వీటుకు ఒరు కన్నగి  Y  Y  Y తమిళం
1984 దేవాంతకుడు  Y తెలుగు
1984 వేట్రి  Y తమిళం
1983 సింహ గర్జనె  Y  Y కన్నడ
1983 హసిద హెబ్బులి  Y  Y కన్నడ
1983 సాచ్చి  Y  Y  Y తమిళం
1983 సంసారం ఎంబత్తు వీణై  Y తమిళం
1983 గెద్ద మగ  Y కన్నడ "మూండ్రు మగం" తమిళ సినిమా రీమేక్
1983 పల్లెటూరి మొనగాడు  Y తెలుగు
1983 బలిదానం  Y తెలుగు పట్టణదు రాజక్కల్ సినిమా రీమేక్
1982 ఇదయం పెసుగిరాదు  Y  Y  Y తమిళం
1982 న్యాయ ఎల్లిదె  Y  Y కన్నడ ఇది సట్టం ఒరు ఇరుత్తరై అనే తమిళ సినిమా రీమేక్
1982 ఓమ్‌ శక్తి  Y తమిళం
1982 పట్టణదు రాజక్కల్  Y  Y  Y తమిళం
1981 నీది పిళైతదు  Y  Y  Y తమిళం
1981 చట్టానికి కళ్లులేవు  Y  Y తెలుగు ఇది సట్టం ఒరు ఇరుత్తరై అనే తమిళ సినిమా రీమేక్
1981 జాదిక్కొరు నీది  Y  Y  Y తమిళం
1981 నెంజిలె తునివిరుంతల్  Y  Y  Y తమిళం
1981 సట్టం ఒరు ఇరుత్తరై  Y  Y తమిళం

గుర్తింపు మార్చు

ఇతడు సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా అమెరికాలోని ఇంటర్నేషనల్ తమిళ్ యూనివర్సిటీ ఇతనికి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసి గౌరవించింది.[10]

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. Director S.A.Chandrasekhar. Facebook.com. Retrieved on 2015-10-16.
  2. 2.0 2.1 http://www.veethi.com/india-people/s._a._chandrasekhar-profile-8016-14.htm
  3. "Exclusive biography of #SAChandrasekhar and on his life". filmibeat.com. Archived from the original on 27 మార్చి 2017. Retrieved 28 November 2016.
  4. cbarn. "The Hindu : Metro Plus Coimbatore : `Message' man". thehindu.com. Archived from the original on 10 నవంబరు 2016. Retrieved 28 November 2016.
  5. "Exclusive biography of @actorvijay and on his life". filmibeat.com. Retrieved 28 November 2016.
  6. "Archived copy". Archived from the original on 2015-12-23. Retrieved 2018-03-05.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  7. "Demystifying India's highest paid film-maker — the elusive S Shankar — The Economic Times". indiatimes.com. Retrieved 28 November 2016.
  8. Kamath, Sudhish (26 September 2013). "Master of Bromance". Retrieved 28 November 2016 – via The Hindu.
  9. [1]
  10. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-09-10. Retrieved 2018-03-05.