ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం

ములుగు జిల్లా, ఏటూరునాగారం మండలంలో ఈ వన్యప్రాణుల అభయారణ్యం ఉంది. ఈ అభయారణ్యం 806 చ.కి.మీ.ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ అభయారణ్యం వృక్ష, జంతుజాల సంరక్షణాకేంద్రంగా విలసిల్లుతోంది.[2] ఇక్కడ వెదురు, మద్ది, చిరుమాను, సారపప్పు చెట్టు మున్నగువాటితో కూడిన ఆకురాల్చు పొడి టేకు వంటి వృక్షజాలం ఉంది. అడవిలో పెద్దపులి, చిరుతపులి, అడవిదున్న, కడితి, దుప్పి, మనుబోతు, కృష్ణ జింక, నాలుగు కొమ్ముల జింక, మొరుగు జింక, అడవి పంది, తోడేలు, నక్క, గుంటనక్క, అడవిపిల్లి అనేక రకాల పక్షులు ఉన్నాయి.

ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యం
IUCN category IV (habitat/species management area)
ఏటూరునాగారం వద్ద అటవి ప్రాంతం
India Telangana
India Telangana
తెలంగాణ మ్యాప్ లో ఏటూరునాగారం అభయారణ్యం
ప్రదేశంతెలంగాణ, భారతదేశం
సమీప నగరంవరంగల్
భౌగోళికాంశాలు18°20′28″N 80°19′48″E / 18.341°N 80.33°E / 18.341; 80.33[1]
విస్తీర్ణం812 km2 (314 sq mi)
స్థాపితం1952
పాలకమండలితెలంగాణ అటవీశాఖ

మూలాలు మార్చు

  1. "Eturnagaram Sanctuary". protectedplanet.net.[permanent dead link]
  2. "ప్రకృతి అందాలకు చిరునామాగా మారిన ములుగు జిల్లా ఏటూరునాగారం అటవీప్రాంతం| eturunagaram forest area in the Mulugu district that has become an address for natural beauty– News18 Telugu". web.archive.org. 2022-12-25. Archived from the original on 2022-12-25. Retrieved 2022-12-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

ఇతర లింకులు మార్చు