ఏదైనా జరగొచ్చు (2019 సినిమా)

ఏదైనా జరగొచ్చు 2019, ఆగస్టు 23న విడుదలైన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. వెట్ బ్రెయిన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుదర్శన్‌ హనగోడు నిర్మాణ సారథ్యంలో కె. రామకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ రాజా, పూజా సోలంకి, బాబీ సింహా, సాషా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించగా శ్రీకాంత్ పెండ్యాల సంగీతం అందించారు.[1] ఈ చిత్రంలో శివాజీ రాజా కుమారుడు విజయ్ రాజా తొలిసారిగా నటించాడు.[2][3] దర్శకుడు రామకాంత్ చంద్ర శేఖర్ యెలేటికి వద్ద సహాయకుడిగా పనిచేశాడు. 2018, జూలై 11న ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీరంగ ముఖ్యులు హాజరయ్యారు.[4]

ఏదైనా జరగొచ్చు
ఏదైనా జరగొచ్చు సినిమా పోస్టర్
దర్శకత్వంకె. రమాకాంత్
నిర్మాతసుదర్శన్‌ హనగోడు
తారాగణంవిజయ్ రాజా, పూజా సోలంకి, బాబీ సింహా, సాషా సింగ్
ఛాయాగ్రహణంసమీర్ రెడ్డి
కూర్పుఉద్ధవ్
సంగీతంశ్రీకాంత్ పెండ్యాల
నిర్మాణ
సంస్థ
వెట్ బ్రెయిన్ ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీ
2019 ఆగస్టు 23 (2019-08-23)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యం మార్చు

జై (విజయ్‌ రాజా) తన స్నేహితులతో కలిసి ఈజీగా డబ్బు సంపాదించేందుకు ప్లాన్ చేస్తుంటాడు. ఓ ప్రైవేట్‌ సంస్థలో రికవరీ ఏజెంట్‌గా చేరిన జైకి శశిరేఖ (పూజ సోలంకి) పరిచయం అవుతుంది. తొలి చూపులోనే శశితో ప్రేమలో పడ్డ జై, ఆమె ఇబ్బందుల గురించి తెలుసుకొని ఎలాగైన సాయం చేయాలనుకుంటాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగా కాళీ (బాబీ సింహా) అనే రౌడీ దగ్గర క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బు పెట్టి సమస్యల్లో చిక్కుకుంటాడు. కాళీ జీవితంలో ఎవరికీ తెలియని ఓ రహస్యం జై అతని స్నేహితులకు తెలుస్తుంది. జైకి తెలిసిన ఆ రహస్యం ఏంటి..? కాళీ నుంచి జై అతని స్నేహితులు ఎలా తప్పించుకున్నారు? అన్నదే మిగతా కథ.[5]

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: కె. రామకాంత్
  • నిర్మాత: సుదర్శన్‌ హనగోడు
  • సంగీతం: శ్రీకాంత్ పెండ్యాల
  • సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
  • కూర్పు: ఉద్దవ్
  • నిర్మాణ సంస్థ: వెట్ బ్రెయిన్ ఎంటర్టైన్మెంట్

పాటలు మార్చు

ఈ చిత్రానికి శ్రీకాంత్ పెండ్యాల సంగీతం అందించాడు.

  • కావాలే - అపర్ణ నందన్
  • అనుభవించు - పృథ్వీ చంద్రన్, స్వీకార్ అగస్తి
  • అదిగో - గోల్డ్ దేవరాజ్, లిప్సిక
  • చెలియా - యాజిన్ నిజార్

విడుదల మార్చు

టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఈ చిత్రానికి 1.5/5 రేటింగ్ ఇచ్చింది, "ఈ చిత్రంలో బలహీనమైన కథ, స్క్రీన్ ప్లే ఉంది" అని రాసింది.[6] న్యూస్ మినిట్ పత్రిక ఈ చిత్రంపై విమర్శ రాసింది.[7]

మూలాలు మార్చు

  1. "A comic thriller". Deccan Chronicle. 2019-04-12. Retrieved 2020-11-30.
  2. India, The Hans (2019-08-08). "Shivaji Raja's son debuts". www.thehansindia.com. Retrieved 2020-11-30.
  3. Vyas (2019-04-22). "Edaina Jaragocchu Movie teaser talk". www.thehansindia.com. Retrieved 2020-11-30.
  4. "Vijay Raja all set to make his debut with 'Edaina Jaragochu' - Times of India". The Times of India. Retrieved 2020-11-30.
  5. Sakshi (23 August 2019). "'ఏదైనా జరగొచ్చు' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 12 జూలై 2021. Retrieved 12 July 2021.
  6. "Edaina Jaragochu Movie Review {1.5/5}: Critic Review of Edaina Jaragochu by Times of India". The Times of India.
  7. "'Edaina Jaragochu' review: A jarring horror comedy which is neither scary nor funny". The News Minute. 2019-08-23. Retrieved 2020-11-30.

ఇతర లంకెలు మార్చు