ఐఐఐటి- బెంగుళూరు


ఐఐఐటి-బీ సెప్టెంబర్ 15, 1999 లో ఐ.టి.పి.ఎల్ అనే ప్రదేశము యొక్క ఒక భాగములో భారతీయ సాంకేతిక సమాచార పీఠం పేరుతో నిర్మించబడింది.[1] ఈ పీఠము తమ విద్యార్థులకు మొదటి నాలుగు సంవత్సరములు ఐ.టి.పి.ఎల్ లో పాఠాలు చదివించారు. ఆగస్టు 2003 లో ఐఐఐటీ-బీని ఐ.టి.పి.ఎల్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ (విద్యుత్తు పట్నం) అనే ప్రదేశానికి మార్చారు. జాతీయ ప్రాముఖ్య పీఠములను స్ఫూర్తిగా తీసుకొని ఐఐఐటీ-బీని స్థాపించారు. ఉదాహరణకు, మన దేశములో భారతీయ సాంకేతిక పీఠములు, జాతీయ సాంకేతిక పీఠములు, భారతీయ యోజన పీతములు జాతీయ ప్రాముఖ్య పీతములుగా గుర్తిస్తారు. ఈ పీఠము ప్రారంభించినప్పుడు, విద్యార్థులకు సాంకేతిక సమాచారములో పట్టాలు బహుకరించేది. జనవరీ 2005 లో విశ్వవిద్యాలయ ఖ్యాతి కలిగిన తరువాత ఈ పీఠము తమ విద్యార్థులకు సాంకేతిక సమాచారములో ప్రవీణులుగా గుర్తించి డిగ్రీ లను బహుకరించడం ప్రారంభించింది. ఈ పీఠము విశ్వవిద్యాలయముగా పరివర్తన చెందక క్రితము భారతీయ సాంకేతిక సమాచార పీఠమునుంచి అంతర్జాతీయ సాంకేతిక సమాచార పీఠముగా పేరు అనువదించబడింది (2004 లో).

మూలాలు మార్చు

  1. "About us The International Institute of Information Technology Bangalore". www.iiitb.ac.in. Retrieved 2021-08-31.
 
IIIT బెంగళూరు లైబ్రరీ