కడియం శ్రీహరి వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నవంబర్ 2021లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారైయ్యారు.[3] ఆయన 01 డిసెంబర్ 2021 నుండి 9 డిసెంబర్ 2023 వరకు పని చేశాడు.[4][5]

కడియం శ్రీహరి
కడియం శ్రీహరి


ఎమ్మెల్సీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
01 డిసెంబర్ 2021 నుండి 9 డిసెంబర్ 2023[1]
ముందు జి. విజయ రామారావు
తరువాత టి.రాజయ్య
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

మాజీ ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ
నియోజకవర్గం స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1952-07-08) 1952 జూలై 8 (వయసు 71)
ప‌ర్వ‌త‌గిరి , వ‌రంగ‌ల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు భారత్ రాష్ట్ర సమితి
తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి కె.వినయరాణి
సంతానం కడియం కావ్య,[2] దివ్య , రమ్య
నివాసం హైదరాబాద్
మతం హిందూ

జననం - విద్యాభాస్యం మార్చు

క‌డియం వ‌రంగ‌ల్ జిల్లాలోని ప‌ర్వ‌త‌గిరి గ్రామంలో 8 జులై 1958 లో ల‌క్ష్మీ న‌ర్సింహ‌, విన‌య రాణి దంపతులకు జ‌న్మించారు. కడియం శ్రీహరి వ‌రంగ‌ల్‌లోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో పదవ తరగతి పూర్తి చేశాడు. వ‌రంగ‌ల్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ క‌ళాశాల నుంచి బీఎస్సీ పూర్తి చేసి, హైద‌రాబాద్ లో ఎంఎస్సీ పూర్తి చేశాడు.[6] 1975-77 నుండి నిజామాబాద్ లో సిండికేట్ బ్యాంక్ లో మేనేజ‌ర్‌గా ప‌నిచేశాడు. 1977-1987 మధ్యకాలంలో టీచ‌ర్‌గా, జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేశాడు.

రాజకీయ ప్రస్థానం మార్చు

ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగు దేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 1987-1994 మధ్యకాలంలో వ‌రంగ‌ల్ జిల్లా తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప‌నిచేశాడు. 1988 లో కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథార‌టీ చైర్మ‌న్ గా పని చేశాడు. క‌డియం శ్రీ‌హ‌రి 1994 లో తొలిసారిగా స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది, ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రభుత్వంలో మార్కెటింగ్‌ శాఖ మంత్రిగా పని చేశాడు.[7] నారా చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో సంక్షేమ శాఖ , విద్య నీటిపారుద‌ల శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు. తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడిగా ఉన్నాడు. 2013లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. 2014 లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి వ‌రంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎంపీగా పోటీ చేసి గెలుపొందాడు.

కడియం శ్రీహరి 2015లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికై తెలంగాణ డిప్యూటీ ముఖ్య‌మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ప‌నిచేశాడు.[8][9] ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం 3 జూన్ 2021న ముగిసింది. కడియం శ్రీహరి తెలంగాణ శాసనమండలికి 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో 16 నవంబర్ 2021న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారై, నవంబర్ 22న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[10][11]

ఆయన 2023 ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి సింగాపురం ఇందిరపై 7,779 ఓట్ల మెజార్టీతో గెలిచి[12][13], డిసెంబర్ 14న శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.[14]

కడియం శ్రీహరి 2024 మార్చి 31న బీఆర్ఎస్ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[15]

మూలాలు మార్చు

  1. 10TV Telugu (9 December 2023). "ఎమ్మెల్సీ పదవులకు బీఆర్ఎస్ నేతలు రాజీనామా.. ఆమోదించిన మండలి చైర్మన్" (in Telugu). Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Andhrajyothy (19 January 2022). "నెలసరి గురించి నోరు విప్పాలంటే సిగ్గెందుకు..?". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
  3. Namasthe Telangana (16 November 2021). "ఎమ్మెల్యే కోటా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు". Archived from the original on 16 November 2021. Retrieved 16 November 2021.
  4. TNews Telugu (1 December 2021). "'ఎమ్మెల్యే కోటా' ఎమ్మెల్సీల ప‌ద‌వీకాలం షురూ". Archived from the original on 1 December 2021. Retrieved 1 December 2021.
  5. 10TV Telugu (9 December 2023). "ఎమ్మెల్సీ పదవులకు బీఆర్ఎస్ నేతలు రాజీనామా.. ఆమోదించిన మండలి చైర్మన్" (in Telugu). Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  6. Eenadu (17 November 2023). "ప్రధాన అభ్యర్థులు విద్యావంతులే". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
  7. Eenadu (12 November 2023). "అయిదుగురు మంత్రులు.. ఇద్దరు డిప్యూటీ సీఎంలు". Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
  8. "Kadiyam Srihari sworn-in as Deputy Chief Minister of Telengana". Business Standard India. 25 January 2015. Archived from the original on 12 November 2019. Retrieved 12 November 2019.
  9. సాక్షి, జిల్లాలు (25 January 2017). "కడియం.. రెండేళ్లు". Sakshi. Archived from the original on 12 November 2019. Retrieved 12 November 2019.
  10. Andhrajyothy (22 November 2021). "తెలంగాణ: ఆ ఆరు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం". Archived from the original on 22 November 2021. Retrieved 22 November 2021.
  11. telugu, NT News (22 August 2023). "వరంగల్‌ ఉమ్మడి జిల్లా బరిలో వీరే.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల బయోడేటా." www.ntnews.com. Archived from the original on 14 April 2024. Retrieved 14 April 2024.
  12. Eenadu (4 December 2023). "ఇద్దరు ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలయ్యారు". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  13. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  14. Namaste Telangana (15 December 2023). "ఎమ్మెల్యేలుగా కడియం, పల్లా ప్రమాణ స్వీకారం". Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
  15. V6 Velugu (31 March 2024). "కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి, కావ్య". Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు మార్చు