కత్రినా కైఫ్  (జననం 16 జూలై 1983) బ్రిటిష్ నటి, మోడల్.[1] ఆమె తండ్రి కశ్మీరీ కాగా, తల్లి బ్రిటన్ కు చెందినవారు. ఆమె బాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో నటించారు. హిందీతో పాటు తెలుగు, మళయాళం సినిమాల్లో కూడా కనిపించారామె.[1] ఆమె చాలా ప్రఖ్యాతమైన మోడల్ కూడా. భారతదేశంలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న నటుల్లో ఈమె కూడా ఒకరు. కత్రినాను మీడియా అత్యంత ఆకర్షణీయమైన సెలెబ్రటీగా గుర్తించింది.

కత్రినా కైఫ్
2019లో కత్రినా కైఫ్
జననం
కత్రినా టర్కోట్

(1983-07-16) 1983 జూలై 16 (వయసు 40)
విక్టోరియా, హాంకాంగ్, బ్రిటీష్ హాంకాంగ్
(ప్రస్తుతం హాంకాంగ్)
జాతీయతబ్రిటిష్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2003–ప్రస్తుతం
జీవిత భాగస్వామి

బ్రిటిష్ హాంగ్ కాంగ్ లో జన్మించిన కత్రినా, భారత్ కు రాకముందు ఎన్నో దేశాలు తిరిగారు వీరి కుటుంబం. ఆమె టీనేజ్ లో ఉన్నప్పుడు మొదటిసారి మోడలింగ్ చేశారు. ఆ తరువాత దానినే కెరీర్ గా మలచుకున్నారు కత్రినా. ఈమె మోడల్‌గా కింగ్ ఫిషర్ క్యాలెండర్‌లో కనిపించారు. లండన్ లో జరిగిన ఒక ఫ్యాషన్ షోలో నిర్మాత కైజద్ గుస్తాద్ ఆమెకు తన సినిమా బూమ్ (2003) లో నటించమని అడిగారు. ఆమె ఒప్పుకుని ఈ సినిమా చేశారు కానీ, ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ కావడమే కాక విమర్శాత్మకంగా కూడా విఫలమైంది. ఈ సినిమాలో నటించేటప్పుడు ఆమెకు మోడలింగ్ లో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఆమెకు హిందీ రాకపోవడంతో సినిమా అవకాశాలు మాత్రం ఎక్కువగా రాలేదు. తరువాత ఆమె తెలుగులో మల్లీశ్వరి (2004) సినిమాలో నటించారు. ఈ సినిమా ఏవరేజ్ గా ఆడింది. బాలీవుడ్ లో తరువాత ఆమె చేసిన మైనే ప్యార్ క్యూ కియా? (2005), నమస్తే లండన్ (2007) వంటి సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఆమె నటిస్తున్న సినిమాలు హిట్ అవుతున్నా, ఆమె నటనకు మాత్రం విమర్శలు వచ్చాయి.

2009లో ఉగ్రవాదం గురించి తీసిన న్యూయార్క్ సినిమాలో ఆమె నటనతో ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్ పొందారు కత్రినా. ఆ తరువాత అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ (2009), రాజ్నీతీ (2010), జిందగీ నా మిలేగీ దుబారా (2011) సినిమాల్లో నటించారామె. మేరే బ్రదర్ కీ దుల్హన్ (2011) సినిమాతో రెండో ఫిలింఫేర్ ఉత్తమ నటి నామినేషన్ అందుకున్నారు ఆమె. ఆ తరువాత ఆమె  నటించిన ఏక్ థా టైగర్ (2012), ధూమ్3 (2013) సినిమాలు అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాలుగా నిలిచాయి. ఆమె నటనకు ఎన్నో విమర్శలు వచ్చినా, ఆమె ఎన్నో కమర్షియల్ గా విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ, టాప్ హీరోయిన్ గానే కొనసాగుతూ వచ్చారు.[2]

ఆమె తన తల్లితో కలసి ఎన్నో దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అలాగే స్టేజ్ షోలు కూడా ఇస్తారు. ఆమె ఎక్కువగా తన వ్యక్తిగత జీవితం గురించి బయటకు చెప్పారు.[3]

తొలినాళ్ళ జీవితం, నేపథ్యం మార్చు

 
2012 పీపుల్స్ చాయిస్ అవార్డ్స్ ఇండియా కార్యక్రమంలో తన తల్లితో కత్రినా

కత్రినా కైఫ్ హాంగ్ కాంగ్ లో 16 జూలై 1983న జన్మించారు.[3][4][5] తండ్రి మొహ్మద్ కైఫ్ కాశ్మీర్ లో జన్మించిన బ్రిటిష్ వ్యాపారవేత్త. తల్లి సుసన్నే కైఫ్ లాయరు, సామాజిక కార్యకర్త.[6][7][8][9][10] కత్రినాకు ఏడుగురు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు. ముగ్గురు అక్కలు, ముగ్గురు చెల్లెళ్ళు, ఒక అన్నయ్య.[8][10] ఆమె చెల్లెలు ఇసబెల్ కైఫ్ కూడా మోడల్, నటిగా పనిచేస్తున్నారు.[11] కత్రినా చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత ఆమె తండ్రి అమెరికాకు వెళ్ళిపోయారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనపై గానీ, తన అక్కాచెల్లెళ్ళు, అన్నయ్య మీదగానీ తన తండ్రి ప్రభావం లేదనీ, తమను తమ తల్లే పెంచారనీ వివరించారు.[3][10][12] తమ స్నేహితులు తండ్రి ప్రేమను పొందుతున్నప్పుడు చూసి చాలా బాధపడేదాన్నని, ఇప్పటికీ ఆయనతో సంబంధాలు ఏమీ లేవని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు కత్రినా.[10]

తన చిన్నతనం గురించి ఆమె మాట్లాడుతూ "నా తల్లి సామాజిక సేవకు అంకితమయ్యారు. అందుకే కొన్ని ప్రదేశాల్లో కొంత కొంత సమయం ఉన్నామని వివరిస్తారు.

హాంగ్ కాంగ్ లో పుట్టిన మేము చైనా, తరువాత జపాన్, అక్కడ నుంచీ బోటులో ఫ్రాన్స్ కు వెళ్ళామని చెప్పారు. అక్కడ నుంచి స్విట్జర్లాండ్ వెళ్ళి కొన్ని నెలల తరువాత పోల్యాండ్, అక్కడ నుంచీ బెల్జియం వెళ్ళారని తెలిపారు ఆ తరువాత హవాయి వెళ్ళి, అక్కడ కొన్నాళ్ళున్నాకా లండన్ కు వచ్చామని వివరించారు ఆమె.[12]

ఎక్కువగా వేర్వేరు ప్రదేశాలు తిరగడంతో కత్రినా, ఆమె అక్కచెల్లెళ్ళూ, అన్నయ్యలకు ట్యూషన్ మాస్టర్లతో ఇంట్లోనే చదువుకునేవారు.[13] ఆమె లండన్ లో పెరిగారని అనుకుంటారుగానీ, భారత్ కు రావడానికి ముందు మూడేళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు.[12] చిన్నప్పట్నుంచీ తన తల్లి ఇంటిపేరుతోనే ఉన్న ఆమె తన తండ్రి ఇంటి పేరు పలకడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే కైఫ్ ఇంటిపేరుగా పెట్టుకున్నానని వివరిస్తారు.[14]

సినిమాలు మార్చు

నోట్స్ మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Hafeez, Mateen (30 August 2010).
  2. "कैटरीना के कहने पर सलमान ने इस गाने पर डांस किया बिग बॉस 16 में. - JADOLYA" (in హిందీ). Archived from the original on 2022-12-07. Retrieved 2022-12-07.
  3. 3.0 3.1 3.2 Bamzai, Kaveree (28 January 2011).
  4. "Happy Birthday Katrina: Ranbir plans big bash for lady love at Barcelona".
  5. "Katrina Kaif: Lesser known facts".
  6. Cine Blitz, Volume 29, Issue 2.
  7. Yaqoob, Tahira (11 September 2011).
  8. 8.0 8.1 "Tees Maar Khan: A British Bollywood Barbie!"
  9. "The rise and rise of Katrina Kaif".
  10. 10.0 10.1 10.2 10.3 Varma, Uttara (12 July 2009).
  11. "Isabel Kaif: 10 facts you probably didn't know about Katrina Kaif's sister" Archived 2014-03-02 at the Wayback Machine.
  12. 12.0 12.1 12.2 Chaturvedi, Anshul (26 December 2010).
  13. Chaudhury, Shoma (4 October 2008).
  14. "My name's Turquotte: Katrina".