కబడ్డీ కబడ్డీ 2003 లో వెంకీ దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథా చిత్రం.[1] ఇందులో జగపతి బాబు, కల్యాణి ముఖ్య పాత్రలు పోషించగా ఇతర ముఖ్య పాత్రల్లో తనికెళ్ళ భరణి, సూర్య, ఎం. ఎస్. నారాయణ, కొండవలస, జీవా, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. కబడ్డీ ఆట నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. ఈ చిత్రాన్ని నిర్మాత వల్లూరుపల్లి రమేష్ బాబు, మహర్షి సినిమా అనే బ్యానరుపై నిర్మించాడు. చక్రి సంగీతాన్నందించాడు.

కబడ్డీ కబడ్డీ
దర్శకత్వంవెంకీ
రచనసతీష్ వేగేశ్న (సంభాషణలు)
కథశంకరమంచి పార్థసారథి
నిర్మాతవల్లూరుపల్లి రమేష్ బాబు
తారాగణంజగపతి బాబు
కల్యాణి
ఛాయాగ్రహణంఎస్. కె. ఎ. భూపతి
కూర్పుబస్వా పైడిరెడ్డి
సంగీతంచక్రి
నిర్మాణ
సంస్థ
మహర్షి సినిమా
విడుదల తేదీ
2003 ఫిబ్రవరి 16 (2003-02-16)
సినిమా నిడివి
131 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

వెంకన్నపాళెం అనే ఊర్లో రాంబాబు (జగపతి బాబు) 30 ఏళ్ళ వయసు పైబడినా ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరిగే ఒక యువకుడు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో కాలక్షేపం చేస్తుంటాడు. అతను జీవితంలో స్థిరపడటం లేదని తండ్రి (తనికెళ్ళ భరణి) ఎప్పుడూ అతన్ని తిడుతూ ఉంటాడు. వెంకన్నపాళెం పక్క ఊరైన సఖినేటిపల్లికి గ్రామపెద్ద (సూర్య) కు కావేరి అనే చెల్లెలు ఉంటుంది. రాంబాబు కావేరి (కల్యాణి)తో ప్రేమలో పడతాడు. కానీ ఆమె అన్న మాత్రం రాంబాబు పనీపాట లేకుండా తిరుగుతుంటాడని అతనికి తన చెల్లెలినిచ్చి పెళ్ళి చేయడానికి అంగీకరించడు. పైగా తమ ఊరి కబడ్డీ జట్టును రాంబాబు ఓడిస్తేనే పిల్లనిస్తానని సవాలు చేస్తాడు. రాంబాబు తన ప్రేమను నెగ్గించుకోవడానికి అప్పటి దాకా పలురకాలుగా కాలక్షేపం చేస్తున్న తన ఊరి వాళ్ళను కూడగట్టి కబడ్డీకి సిద్ధం చేసి పోటీలో గెలిచి తన ప్రేమని నెగ్గించుకోవడం సంక్షిప్తంగా ఈ చిత్ర కథ.

తారాగణం మార్చు

పాటలు మార్చు

Untitled

చక్ర సంగీతాన్నందించిన పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.[4]

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."గోరువంక గోదారి వంక"భాస్కరభట్లరవివర్మ, కౌసల్య4:48
2."జాబిల్లి బుగ్గను గిల్లి చూడాలి"భాస్కరభట్లహరిహరన్, కౌసల్య5:04
3."కోకిల కోకిల"భాస్కరభట్లచక్రి, కౌసల్య3:57
4."ప్రేమ ప్రేమ"సాయి శ్రీహర్షసాందీప్, కౌసల్య5:06
5."కబడీ కబడీ"కలువ కృష్ణ సాయిరవివర్మ, చక్రి4:31
6."కోకిల కోకిల -II"భాస్కరభట్లచక్రి, కౌసల్య3:55
Total length:27:35

మూలాలు మార్చు

  1. "కబడ్డీ కబడ్డీ చిత్ర సమీక్ష". idlebrain.com. ఐడిల్ బ్రెయిన్. Archived from the original on 10 July 2017. Retrieved 1 December 2016.
  2. సాక్షి, ఆంధ్రప్రదేశ్ (13 November 2014). "నా జీవితమే ఓ పుస్తకం". Sakshi. Archived from the original on 18 మే 2020. Retrieved 18 May 2020.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (17 November 2015). "విలన్‌గా భయపెడుతున్నా". andhrajyothy.com. Archived from the original on 18 మే 2020. Retrieved 18 May 2020.
  4. "కబడ్డీ కబడ్డీ పాటలు". Raaga.[permanent dead link]