కమలా నెహ్రూ

జవహర్లాల్ నెహ్రూ సతీమణి

కమలా నెహ్రూ భారత మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భార్య. [1]

కమల నెహ్రూ
జననం
కమల కాలే

(1899-08-01)1899 ఆగస్టు 1
పాత ఢిల్లీ
మరణం1936
స్విట్జర్లాండ్
మరణ కారణంక్షయ
వృత్తిస్వాతంత్ర్య ఉద్యమ కారిణి, గృహిణి
జీవిత భాగస్వామిజవహర్లాల్ నెహ్రూ
పిల్లలుఇందిరా గాంధీ
తల్లిదండ్రులు
  • రాజ్ పతి (తండ్రి)
  • జవహర్లాల్ కౌల్ (తల్లి)

జీవితం మార్చు

పాత డిల్లీ లోని కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంలో 1 ఆగస్టు 1899 సంవత్సరములో రాజ్ పతి , జవహర్లాల్ కౌల్ దంపతులకు జన్మించారు. ఈమె తోడ ఇద్దరు తమ్ముళ్లు చాంద్ భహదూర్ కౌల్ , కైలాష్ నాథ్ కౌల్, ఒక చెల్లెలు స్వరూప్ కఠ్జు. ఈమెకు 1916వ సంవత్సరం ఫిబ్రవరి 8న జవహర్ లాల్ నెహ్రూ తో వివాహం జరిగింది. కమలా నెహ్రూ మామగారు మోతీలాల్ నెహ్రూ. అత్తగారు శ్రీమతి స్వరూప రాణి. ఇంటి పట్టునే ఉండే మలానెహ్రూ 1921 లో సహాయ నిరాకరణోద్యమం లో మహిళల బృందానికి నాయకత్వం వహించి విదేశీ వస్తువులు దుస్తులు, మద్యము అమ్మకాలు చేయకూడదనే నినాదముతో ముందుకు సాగారు. రెండుసార్లు అరెస్ట్ అయ్యారు.

నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. తండ్రితో కలసి నెహ్రూ కూడా కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటుండేవారు. దేశ స్వాతంత్ర్యం పోరాటం కోసం నెహ్రూ కుటుంబం ఆస్తినంతా ధారపోసింది. చివరకు తన ఇంటిని సైతం కొంత భాగం హాస్పిటల్ గా మార్చి స్వాతంత్ర్య పోరాటంలో గాయపడిన వారికి వైద్య చికిత్సలు అందించేవారు. 1917, నవంబరు 19 తేదీన జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ ల ఏకైక సంతానంగా అలహాబాద్ లో జన్మించిన ఇందిర అల్లారు ముద్దుగా పెరిగారు. ఇందిర బాల్యం అలహాబాదు లోనే గడిచింది. 1924 లో కమలానెహ్రూ ఒకబాబును కన్నారు. పూర్తిగా పరిణతి చెందిన ముందే జన్మించడం వలన 2 రోజులలో బాబు చనిపోయాడు. 1934 లో జైలు నుండి విడుదలైన నెహ్రూ తిరిగి అరెస్టు కాబడి కలకత్తా, డెహ్రాడూన్‌ లలో జైలు జీవితాన్ని గడిపారు. ఈ సమయంలో నెహ్రూ ఆరోగ్యం పాడైంది. భర్త ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న కమలా నెహ్రూ దిగులుతో అనారోగ్యానికి గురైంది. చికిత్స కోసం స్విట్జర్లాండ్‌కు వెళ్లి 1936 లో టి. బి. జబ్బు మూలాన మరణించారు. కమలా నెహ్రూ చనిపోయిన తరువాత ఆమె పేరుతో కాలేజీలు, పార్కులు, ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు వెలశాయి.

కమలా నెహ్రూ తండ్రి జవహర్ లాల్ కాలే ప్రసిద్ధి వ్యాపారి. జవహర్ లాల్ నెహ్రూకు సరైనజోడి కమలా నెహ్రూ అని భావించి మోతీలాల్ 1910 ఫిబ్రవరి 8న వారి వివాహం జరిపించాడు. వివాహం తరువాత కమలా కాలే కమలా నేహ్రుగా మారింది. ఈ నెహ్రూ దంపతులకు ఇందిరా 1917 నవంబరు 19న పుట్టింది. ఈమెకు ప్రియదర్శిని అని పేరు పెట్టారు.1936లో నెహ్రూను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. 1936 ఫిబ్రవరి 28న 38వ ఏట స్విడ్జర్లాండ్ లో మరణించెను.

మూలాలు మార్చు

  1. Sakshi (15 August 2020). "పరాయి పాలన నుంచి విముక్తికై." Archived from the original on 2 సెప్టెంబరు 2021. Retrieved 2 September 2021.

ఇతర లింకులు మార్చు