కరీంగంజ్ జిల్లా

అస్సాం లోని జిల్లా

అస్సాం రాష్ట్రం లోని 27 జిల్లాలలో కరీంగంజ్ జిల్లా (బెంగాలీ: করিমগঞ্জ জেলা) ఒకటి. కరీంగంజ్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది.

కరీంగంజ్
Bengali: করিমগঞ্জ জেলা
కరీంగంజ్ సమీపంలో లొంగై నది
కరీంగంజ్ సమీపంలో లొంగై నది
District location in Assam
District location in Assam
Country India
Stateఅసోం
Headquartersకరీంగంజ్
Area
 • Total1,809 km2 (698 sq mi)
Population
 (2011)
 • Total12,17,002
 • Density673/km2 (1,740/sq mi)
Time zoneUTC+5:30 (IST)
Official languageBengali (Bangla)
Websitehttp://www.karimganj.nic.in

చరిత్ర మార్చు

ఆరంభకాలం మార్చు

కరీంగంజ్ ఆరభకాల చరిత్ర అస్పష్టంగా ఉంది. లభిస్తున్న ఆధారాలు ఈ ప్రాంత చరిత్ర నిర్మాణాల అవసరానికి తగినంత లేదు. మద్య మద్య ఖాళీలతో ఒక రేఖాత్మక రూపం మాత్రం లభిస్తుంది. నిధంపూర్ రాజా భాస్కరబర్మన్ తామ్ర పత్రాల ఆధారంగా ఈ ప్రాంతం కామరూప్ సామ్రాజ్యంలో సా.శ. 6వ శతాబ్దం నుండి ఒక శతాబ్ధకాలం భాగంగా ఉండేది.

ఆర్యుల కాలం మార్చు

ఈ ప్రాంతానికి వలస వచ్చిన ఆర్యబ్రాహ్మణుల కాలంలో ఈ ప్రాంతం వ్యవసాయ పరంగా ఆర్థికపరంగా వికదించింది. సమతా మదురనాథ్ రాగి పళ్ళాల ఆధారంగా అది 7వ శతాబ్ధానికి చెందినవని తెలియజేస్తుంది. పర్వతపాదాలలో ఉన్న ఉత్తర కాచర్ హిల్స్ ప్రాంతం సమతా సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అది ౠజువు చేయడానికి కచ్చితమైన ౠజువు మాత్రం లేదు.

చంద్రవంశం మార్చు

కీ.శ 10వ శతాబ్దంలో చంద్రవంశానికి చెందిన రాజా శ్రీచంద్రా ఈప్రాంతం అంతటినీ తనరాజ్యంలో కలుపుకున్నారు. ఈ కాలంలోనే కరీంగంజ్‌కు 8 కి.మీ దూరంలో ప్రస్తుత బంగ్లాదేశ్లో చంద్రపురా మఠం స్థాపించబడింది. ఇది తరువాత ప్రముఖ శిక్షణాకేంద్రంగా విలసిల్లింది. ప్రఖ్యాత చరిత్రకారుడు డాక్టర్ సి. సర్కార్ వ్రాతల ఆధారంగా ఆరంభకాలంలో పూర్తి తూర్పు భారతదేశానికి చంద్రపురా ప్రఖ్యాత హిందువుల శిక్షణా కేంద్రంగా ఉండేదని తెలుస్తుంది. బతేరా వద్ద లభించిన గోవిందకేశవ దేవా, ఇహానా దేవాకు చెందిన 2 శిలాశాసనాలు 12వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో స్వతంత్ర శ్రీహట్టా రాజ్యం ఉండేదని తెలుస్తుంది. అందులో పూర్తి కరీంగంజ్, కచార్ జిల్లాలో అత్యధిక భూభాగం భాగంగా ఉండేదని తెలుస్తుంది.

మధ్యయుగం మార్చు

సా.శ. 1328లో యేమన్‌కు చెందిన ముస్లిం సూఫీ సన్యాసి షాహ్ జలాల్ సైలహెట్‌, శ్రీహట్టాను కరీంగంజ్ ప్రాంతం అంతటినీ జయించాడు. పతేర్‌ఖండికి చెందిన ప్రస్తుత తానా ప్రాంతంతో కూడిన కరీంగంజ్ త్రిపురా రాజు ఆధీనంలోకి వచ్చింది. 1300 లోఅయినప్పటికీ మిర్జా మొహమ్మద్ తురాని నాయకత్వంలో ప్రజలు పెద్ద సంఖ్యలో దండెత్తి వచ్చి బదర్పూర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

తురాని మార్చు

తురాని తనతకుతానే కిరీటధారణచేసి ఓడినచబడిన గవర్నర్ పురారాజా కుమార్తె ఉమావతిని వివాహం చేసుకున్నాడు. రాజకుటుంబం క్రమంగా తమరాజ్యాన్ని విస్తరించారు. వారి వారసుడు మాలిక్ ప్రతాప్ రాజా పథేర్ఖండి ప్రాంతాన్ని మొత్తంగా ఆక్రమించాడు. అయినప్పటికీ హుస్సైన్ షాహ్ పాలనాకాలంలో (1483-1519) ప్రతాప్‌ఘర్ కూడా సుల్తానేట్‌లో చేర్చబడింది. జిల్లాలోని కలిగంజ్ వద్ద హుస్సైన్ షాహ్ శిలాశాసనం, సుప్రకండి వద్ద మహ్ముద్ షాహ్ శిలాశాసనం ద్వారా ఈ ప్రాంతం మొత్తం బెంగాల్ సుల్తానేట్ ఆధీనంలో ఉందని తెలుస్తుంది. 1576 నాటికి ఈ ప్రాంతం సిల్హేటి ప్రాంతం వరకు అక్బర్ సుల్తానేటులో భాగంగా మారింది. " అయిన్-ఐ- అక్బరి " అనుసరించి జిల్లాలోని ప్రాంతాలు మొగల్ ప్రభుత్వ " ప్రతాప్‌ఘర్ మెహ్ల్ " పరిధిలో చేర్చబడింది. జిల్లా ప్రాంతం సిల్హేటి సర్కార్, మొగల్ సుభాహ్‌లో భాగంగా ఉంటూ వచ్చింది.

బ్రిటిష్ కాలం మార్చు

1785లో బంగ్లా సుబ దివానును బ్రిటిష్ ఈస్టిండియా స్వాధీనం చేసుకుంది. దీనితో సిల్హెట్ జిల్లాలో భాగంగా ఉన్న కరీంగంజ్ కూడా బ్రిటిష్ ప్రభుత్వంలో కలుపబడింది. 1778 వరకు బ్రిటిష్ తన అధికారపరిధిలోకి తీసుకోలేదు. కరీంగంజ్ ప్రాంతం ప్రాంతీయ జమీందార్ రాధారాం అధీనంలో ఉంటూవచ్చింది. దక్షిణ కరీంగంజ్ ప్రాంతంలోని అత్యధికభాగంలోని ప్రజలు రాధారాంను నవాబు రాధారాం అని పిలిచారు. ఆయన విచక్షణారహితంగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి అపజయం పాలయ్యాడు. అయినప్పటికీ రాధారాం ప్రాణాలతో తప్పించుకున్నాడు. అయినప్పటికీ బ్రిటిష్ సైన్యం అతనిని వెంబడించి సైలహెట్‌కు తీసుకుపోబడ్డాడు. చివరకు రాధారాం ఆత్మహత్య చేసుకున్నాడు. 1786 నాటికి రాధారాం తరువాత కరీంగంజ్ ప్రాంతం అంతా బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చాడు.

తిరుగుబాటు మార్చు

1857 నవంబరులో 34వ నేటివ్ ఇంఫాంటరీకి చెందిన 3 కంపనీలు తిరుగుబాటు చేస్తూ సైలహెట్ జిల్లాలోని ఆగ్నేయభాగంలోకి చొచ్చుకువెళ్ళారు. ప్రస్తుత కరీంగంజ్ జిల్లాలోని లటు గ్రామం వద్ద సైలహెట్ మేజర్ బైయాంగ్ నాయకత్వంలోని లైట్ ఇంఫాంటరీని ఎదుర్కొన్నారు. సిపాయీలు ఓడిపోయారు అయినప్పటికీ మేజర్ భయాంగ్ చనిపోయాడు. ఇప్పటికీ లటు గ్రామంలోని మలేగర్ సమీపంలో ఉన్న కొండగుట్ట వద్ద మరణించిన తిరుగుబాటుదారుల సమాధులు ఉన్నాయి. 1878లో బ్రిటిష్ నిర్వహణలో కొత్తగా ఏర్పాటు చేయబడిన కరీంగంజ్ ఉపవిభాగానికి కరీంగంజ్ పట్టణం కేంద్రంగా చేయబడింది. విభజనకు ముందు సైలహెట్ విభాగంలో కరీంగంజ్ జిల్లా భాగంగా ఉండేది. ఈ ప్రాంతంలో పలు తాలూకాలు, జమీందారి ఆస్థానాలు ఉండేవి. బరదూర్ లోని మునుపటి హంసపూర్ జమీందారీ కరీంగంజ్ లోనే ఉంది.

అబ్దుల్ మత్లిబ్ మజుందర్ మార్చు

తరువాత కరీంగంజ్ చరిత్ర " అబ్దుల్ మత్లిబ్ మజుందర్" (1890-1980) తో మొదలైంది. 1946లో భారత్ ఇంకా బ్రిట్జిష్ ఆధీనంలో ఉండగానే ఆయన అసెంబ్లీ సభ్యుడు, కాబినెట్ మంత్రి అయ్యాడు.[1] హిందూ ముస్లిం సమైక్యతను సంరక్షించే తూర్పు భారతదేశ ఒకేఒక నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందాడు. మతపరంగా భారతదేశాన్ని విభజించడానికి వ్యతిరేకంగా ఆయన " ఫకురుద్ధీన్అలీ " (5భారతదేశ అధ్యక్షుడు) వంటి నాయకులతో కలిసి రాజకీయనాయకులతో చేతులు కలిపాడు. మజుందర్ 1925 హైలకండి బార్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. తరువాత ఆయన పరిచయాలు సిల్చార్, కరీంగంజ్ ప్రాంతాల వరకు విస్తరించాయి. స్వాతంత్ర్య పోరాటానికి బలంచేకూరుస్తూ మజుందర్, దక్షిణ అస్సాం కాంగ్రెస్ పార్టీ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆహ్వానం మీద 1939, పండిట్ జవహర్లాల్ 1945 హైలకండిని సందర్శించారు. నేతాజీ అబ్దుల్ మత్లిబ్ మజుందర్‌కు మౌలానా అబ్దుల్ కలాంతో పరిచయం చేసాడు.[2] 1937 నాటి ఎన్నికలలో ముస్లిం లీగ్ తన బలాన్ని నిరూపించుకుంది. ముస్లిం లీగ్ ప్రజాదరణను ఎదుర్కోడానికి అనుకూలంగా ఆయన అస్సాంలో " జమైత్ ఉలేమా - ఇ - హింద్" ఉద్యమం విజయవంతంగా నిర్వహించాడు. జాతీయ కాంగ్రెస్‌కు బడుగు ముస్లిం వర్గాలతో సాన్నిహిత్యం ఏర్పడడానికి జమైత్ ఒక వంతెనగా ఉండేది. 1946 నాటికి ఆయన ముస్లిం లీగ్ నుండి ముస్లిముల ఆదరణ తన వైపు తిప్పులున్నాడు. ఈ విజయం ముస్లిం లీగ్ నమ్మకాలను సడలింపజేసింది. తూర్పు ఇండియాలో ముస్లిం - హిందూ ఐక్యతకు పాటుబడుతూ దేశవిభజనను వ్యతిరేకించిన ముస్లిం నాయకులలో మజుందార్ ఒకడు.

సుర్మా లోయ మార్చు

అస్సాం సుర్మా వెల్లీ (ప్రస్తుతం ఇది కొంత బంగ్లాదేశ్లో ఉంది) లో ముస్లిములు అధికంగా ఉన్నారు. స్వతత్రం పొందిన సమయంలో ముస్లిం లీగ్, జాతీయ కాంగ్రెస్ ప్రేరిత ఉద్యమకారులు ఉద్రేకం శిఖరాగ్రానికి చేరింది. మజుందార్ అప్పటి హోం మంత్రి కుమార్ దాస్‌తో కలిసి వెల్లీ అంతా పర్యటిస్తూ దేశ విభజన, ముస్లిం సమైక్యత గురించి ఉపన్యసించారు. 1947 ఫిబ్రవరి 20 న మౌలవి మజుందర్ అస్సాం నేషనలిస్ట్ సభను ఏర్పాటు చేసాడు. తరువాత 1947 జూన్ 20 తేదీన సిల్చర్ వద్ద కూడా పెద్ద సభ ఏర్పాటు చేయబడింది.[3] రెండు సభలు చక్కని ఫలితం ఇచ్చాయి. అస్సాం లోని బారక్ వెల్లీ ప్రాంతం ప్రత్యేకంగా కరీంగజ్ భారత్‌లో విలీనం కావడానికి మజుందర్ కూడా కృషిచేసాడు.[4][5] సైలహట్‌లో కొంతభాగం (ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఓ ఉంది) చేరడానికి " రాడ్క్లిఫ్ కమీషన్ " వద్దకు పంపబడిన దౌత్యవర్గంలో మజుందర్ కూడా ఒకడు.[6][11].

స్వతంత్రానంతర ఉద్రిక్తతలు మార్చు

స్వాతంత్రం తరువాత చెలరేగిన మతకలవరం మార్చు

1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం తరువాత భారతదేశం అంతటా మతకహాలు విజృంభించాయి. గుంపులు గుంపులుగా హిందువులు తూర్పు పాకిస్థాన్ నుండి భారతదేశంలోకి పారపోయి వచ్చారు. అలాగే ముస్లిములు తూర్పు పాకిస్థానుకు వెళ్ళారు. మతకలహాలలో అనేక మంది ప్రాణాలుకోల్పోయారు. అవిభాజిత కాచర్‌లో మజుందర్ మాత్రమే మంత్రి వర్గంలో భాగస్వామ్యం వహించాడు. పార్టీ సభ్యులు కచార్‌లో హిందూ ముస్లిం ఐక్యతకు పాటుపడ్డారు. అలాగే పార్టీ సభ్యులు శరణార్ధుల పునరావాసానికి అత్యవసర సమాగ్రి సరఫరాకు సహకరించారు. 1960లో క్యాబినెట్ మంత్రి మొయినుల్ హాక్యూ చౌదరి (1957-1966) జిల్లాలో ప్రముఖ రాజకీయనాయకుడు అయ్యాడు. 1971లో ఆయన క్రి.శే ఇందిరా గాంధి మంత్రి సభలో పారిశ్రామిక మంత్రి అయ్యాడు. కీ.శే అరుణ్ కె.ఆర్. చంద్రా భార్య జ్యోత్స్న చందా పార్లమెంటులో స్థానం సంపాదించాడు. 1983 జూలై 1 కచార్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి కరీంగంజ్ జిల్లా ఏర్పాటు చేయబడింది.[7] 1989లో కరీంగంజ్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి హైలకండి జిల్లా ఏర్పాటు చేయబడింది. .[7] 1970 -1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరంలో తూర్పు పాకిస్థాన్ నుండి అస్సాంలో ప్రవేశించిన వేలాది శరణార్ధులకు మజుందార్ రిలీఫ్ & రిబలైజేషన్ అధికారిగా పనిచేసాడు..

విభజన & విభజన తరువాత కాలం మార్చు

1947లో విభజన సమయంలో సిల్హెట్ జిల్లాలో అధికభాగం తూర్పు పాకిస్థాన్‌లో కలుపబడింది. 1971లో తూర్పు పాకిస్థాన్ చివరికి స్వతంత్ర బంగ్లాదేశ్గా అవతరించింది. తరువాత కరీంగంజ్‌లోని 3 ఉపవిభాగాలు (రాటబరి, పతేర్ఖండి, కరీంగంజ్ తానాలో సగం) ప్రాంతం మీద నిషేధం విధించబడింది. అందువలన కరీంగంజ్ ఉపవిభాగం కచార్ జిల్లాలో కలిపి అస్సాంలో కలుపబడింది. 1983 జూలైలో కరీంగంజ్ జిల్లా ఏర్పాటు చేయబడింది.[7] కరీం పట్టణం కొత్తగా అవతరుంచిన జిల్లాకు కేంద్రంగా చేయబడింది.

భౌగోళికం మార్చు

 
A typical house of Karimganj

కరీంగంజ్ జిల్లా వైశాల్యం 1809 చ.కి.మీ.[8] వైశాల్యపరంగా జిల్లా అలాస్కా జిల్లాలోని అఫోగ్‌నక్ ద్వీపం వైశాల్యంతో సమానం.[9]

సరిహద్దులు మార్చు

జిల్లా ఉత్తర సరిహద్దులో కచార్ జిల్లా, తూర్పు సరిహద్దులో హైలకండి జిల్లా, దక్షిణ సరిహద్దులో మిజోరాం రాష్ట్రం, వాయవ్య సరిహద్దులో త్రిపుర రాష్ట్రం, పశ్చిమ, నైరుతీ సరిహద్దులో బంగ్లాదేశ్ దేశాలు ఉన్నాయి. కరీంగంజ్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లాకు ఉత్తర సరిహద్దు అంచున కుషియారా నదీతీరంలోకరీంగంజ్ పట్టణం ఉంది. అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతీ నగరానికి ఇది చాలా దూరంలో ఉంది.

సమీప ప్రాంతాలు మార్చు

is approximately 330 km by road and about 350 km by rail. Distances of other important places are : సిల్చర్ - 55 కి.మీ, షిల్లాంగ్ - 220 కి.మీ, అగర్తలా- 250 కి.మీ. జిల్లా కుషియరా, లోగై నదుల మద్య ఉంది. కరీంగంజ్ పట్టణం కుషియరా తీరంలో బంగ్లాదేశ్ దేశ సరిహద్దులో ఉంది. జిల్లాగుండా నోటి నది ప్రవహిస్తుంది. ఆరంభంలో ఇది కుషియరా, లోంగీ నదుల అనుసంధానంగా ఉండి జిల్లా వాసులకు రవాణా సౌకర్యం కలిగిస్తూ ఉండేది. అంతే కాక రండు నదీ ప్రవాహాలు సమతూకంలో ఉండడానికి సహకరిస్తూ ఉండేది. అయినప్పటికీ ఈ కాలువను పలు ప్రాంతాలలో మూసివేసారు. అంతేకాల భూఆక్రమణలు కూడా ఈ కాలువను క్షీణదశకు తీసుకువచ్చాయి. కరీంగంజ్ జిల్లాలో లటు గ్రామం చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది.

అరణ్యప్రాంతం మార్చు

కరీంగంజ్ అరణ్యాలలో వన్యమృగ సంపద అధికంగా ఉండేది. ప్రస్తుతం మానవ చొరబాటు అధికం ఔతున్న కారణంగా అది తగ్గుముఖం పట్టింది. ఇక్కడ అరుదైన ప్రాణులైన హూలాక్ గిబ్బన్, ఫేయర్స్ లీఫ్ మంకీ, పిగ్ టైల్డ్ మకాక్యూ, ఆసియన్ ఏనుగు, వైట్ వింగ్డ్ వుడ్ డక్ మొదలైన ప్రాణులు ఉండేవి అయినా అవి ఇప్పుడు క్షీణిస్తూ ఉన్నాయి.[10][11] జిల్లా దక్షిణ భూభగంలో " ధాలేశ్వరి విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " ఉంది.[12][13]

ఆర్ధికం మార్చు

 
Karimganj is an agricultural district

కరీంగంజ్ పట్టణం తూర్పు భారతదేశంలో వ్యాపారానికి, వాణిజ్యానికి కేంద్రంగా ఉంది. ఇక్కడి నదీతీర రేవు విశాలంగా ఉండి సరుకు రవాణాకు అనుకూలంగా ఉంది. జెట్టీ వేర్‌హౌస్ మొదలైన సంస్థలు పెద్ద ఎత్తున కార్గో సేవలు అందిస్తునాయి. ఇక్కడి స్టీమర్లు బంగ్లాదేశ్ మార్గంలో పయనిస్తూ సరుకులను చేరవేస్తూ ఉంటాయి. కరీంగజ్ సరిహద్దు వ్యాపార కేంద్రంగా ఉండి కోట్లాది ఎగుమతి దిగుమతి రవాణాకు కేంద్రస్థానంగా ఉంది. కలిబరి ఘాట్ వద్ద ఉన్న కస్టం ట్రేడ్ పాయింట్ నుండి విదేశీ వాణిజ్యం జరుగుతూ ఉంటుంది.

విభాగాలు మార్చు

  • కరీంగంజ్ జిల్లాలో ఒక ఉపవిభాగం ఉంది.
  • కరీంగంజ్ జిల్లాలో 5 తాలూకాలు లేక డెవెలెప్మెంటు సర్కిల్స్ ఉన్నాయి: కరీంగంజ్, బాదర్పూర్ (అస్సాం), నీలంబజార్, పథేర్‌ఖండ్, రామకృష్ణ నగర్.
  • జిల్లాలో 2 నగర ప్రాంతాలు ఉన్నాయి : కరీంగంజ్, బాదర్పూర్.
  • జిల్లాలో 7 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులు ఉన్నాయి : నార్త్ కరీంగంజ్, సౌత్ కరీంగంజ్, బాదర్‌పూర్, పథేర్‌ఖండ్, రామకృష్ణ నగర్, దుల్లవ్‌చెరా, రామకృష్ణా నగర్.
  • జిల్లాలో 6 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి : కరీంగంజ్, బాదర్పూర్, రామకృష్ణానగర్, పథర్‌కండి, రాటబరి, నీలంబజార్.
  • జిల్లాలో 96 గ్రామపనాయితీలు ఉన్నాయి.
  • జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: రాటబరి, పథార్‌ఖండ్, కరీంగంజ్ నార్త్, కరీంగంజ్ సౌత్, బాదర్పూర్.[14]
  • రాటబరి నియోజకవర్గం షెడ్యూల్డ్ కుల్లాల కొరకు ప్రత్యేకించబడింది.[14]
  • 5 నియోజకవర్గాలు కరీంగంజ్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.[15]

రవాణా మార్చు

కరీంగంజ్ పట్టణం మిగిలిన భారతదేశంతో రైలు, రహదారి మార్గాలతో అనుసంధానించబడి ఉంది. అస్సాం, త్రిపురా ల మద్య మీటర్ గేజ్ మార్గంలో నడుపబడుతున్న రైళ్ళు కరీంగంజ్ మీదుగా పయనిస్తుంటాయి. కరీంగంజ్, గౌహతి మద్య రాత్రి బసులతో తరచుగా అనేక బసులు నడుపబడుతున్నాయి. కరీంగంజ్ నుండి దూరప్రయాణానికి నేరుగా షిల్లాంగ్, అగర్తలా, అజ్వల్మొదలైన నగరాలకు బసు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. సిల్చర్, బాదర్పూర్, పథేర్‌ఖండ్ వంటి ఇతర సమీప ప్రాంతాలకు అన్ని రకాల లైట్, హెవీ వాహనాలు లభ్యం ఔతున్నాయి.

వాయుమార్గం మార్చు

కరీంగంజ్‌కు సమీపంలో ఉన్న విమానాశ్రయం " కుంబిగ్రాం ఎయిర్‌పోర్ట్ " ఉంది. ఇది కరీంగంజ్‌కు 85కి.మీ దూరంలో కచార్ జిల్లాకేంద్రం సిల్చర్ వద్ద ఉంది.ప్రాముఖ్యత కలిగిన కరీంగంజ్ రేవు నుండి బంగ్లాదేశ్ మీదుగా కొలకత్తా వరకు నదీ మార్గాలు ఉన్నాయి.

2001 లో గణాంకాలు మార్చు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,217,002, [16]
ఇది దాదాపు. బహరియన్ దేశ జనసంఖ్యకు సమానం.[17]
అమెరికాలోని. న్యూ హాంప్‌షైర్ నగర జనసంఖ్యకు సమం.[18]
640 భారతదేశ జిల్లాలలో. 392వ స్థానంలో ఉంది..[16]
1చ.కి.మీ జనసాంద్రత. 673 [16]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 20.74%.[16]
స్త్రీ పురుష నిష్పత్తి. 961 :1000[16]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 79.72%.[16]
జాతియ సరాసరి (72%) కంటే.
  • జిల్లాలో ముస్లిముల సంఖ్య 527,214. (52.3%), హిందువులు 47% .

[19]

భాషలు మార్చు

అస్సాం రాష్ట్రంలో బెంగాలీ భాషను అధికంగా మాట్లాడే ప్రజలు నివసిస్తున్న జిల్లాలలో కరీంగజ్ జిల్లా ఒకటి. మిగిలిన జిల్లాలు కచార్, బార్పేట, హైలకండి, ధుబ్రి, గోల్‌పారా. బారక్‌ లో?యలోని కరీంగంజ్‌లో బెంగాలీ అధికార భాషగా ఉన్న 3 జిల్లాలలో ఒకటి. మిగిలిన 2 జిల్లాలు హైలకండి, కచార్. [20] కరీంగంజ్‌జిల్లాలో మాట్లాడే బెంగాలీ యాసను సిల్హెటి అంటారు. జిల్లాలో స్వల్పంగా ఉన్న బిష్ణుప్రియా, మైటెయీ ప్రజలు మణిపురి భాషను మాట్లాడుతుంటారు. జిల్లాలో అదనంగా హ్రంగ్ఖ్వల్, కుకి ప్రజలు, ఖాశి ప్రజలు, త్రిపురి ప్రజలు, సకచప్ గిరిజనప్రజలు నివసిస్తున్నారు.

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. "Assam Legislative Assembly - MLA 1946-1952". Archived from the original on 2013-11-14. Retrieved 2014-09-25.
  2. Bhattacharyya, N. (1998). Hailakandite Netaji. Hailakandi – smaranika (in Bengali). (Souvenir of the 50th year of independence). District Administration, Hailakandi, India.
  3. Bhattacharjee, J. B. (1977). Cachar under British Rule in North East India. Radiant Publishers, New Delhi.
  4. Barua, D. C. (1990). Moulvi Matlib Mazumdar- as I knew him. Abdul Matlib Mazumdar – birth centenary tributes, pp. 8–9.
  5. Purkayashta, M. (1990). Tyagi jananeta Abdul Matlib Mazumdar. The Prantiya Samachar (in Bengali). Silchar, India.
  6. Roy, S. K. (1990). Jananeta Abdul Matlib Mazumdar (in Bengali). Abdul Matlib Mazumdar – birth centenary tributes, pp. 24–27.
  7. 7.0 7.1 7.2 Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  8. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Assam: Government". India 2010:A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1116. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  9. "Island Directory Tables:Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2015-12-01. Retrieved 2011-10-11. Afognak 1,809km2
  10. Choudhury, A.U. (1999). Status and Conservation of the Asian elephant Elephas maximus in north-eastern India. Mammal Review 29(3): 141-173.
  11. Choudhury, A.U. (2004). Vanishing habitat threatens Phayre’s leaf monkey. The Rhino Found. NE India Newsletter 6:32-33.
  12. Choudhury, A.U. (1983). Plea for a new wildlife refuge in eastern India. Tigerpaper 10(4):12-15.
  13. Choudhury, A.U. (1983). Plea for a new wildlife sanctuary in Assam. WWF - India Newsletter 4(4):15.
  14. 14.0 14.1 "List of Assembly Constituencies showing their Revenue & Election District wise break - up" (PDF). Chief Electoral Officer, Assam website. Archived from the original (PDF) on 22 మార్చి 2012. Retrieved 26 September 2011.
  15. "List of Assembly Constituencies showing their Parliamentary Constituencies wise break - up" (PDF). Chief Electoral Officer, Assam website. Archived from the original (PDF) on 22 మార్చి 2012. Retrieved 26 September 2011.
  16. 16.0 16.1 16.2 16.3 16.4 16.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  17. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Bahrain 1,214,705 July 2011 est.
  18. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Hampshire 1,316,470
  19. Indian Census
  20. Barak Valley

వెలుపలి లింకులు మార్చు

మూస:అస్సాంలోని జిల్లాలు