కళారత్న పురస్కారం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే పురస్కారం

కళారత్న పురస్కారం పూర్వం హంస పురస్కారం ,[1] ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాదినాడు కళలలో అత్యుత్తమ కృషికి ప్రదానం చేస్తారు.[2] ఈ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి కలిపి నిర్వహిస్తాయి. ఈ పురస్కారాన్ని సాహిత్యం, సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, శిల్పకళ, జానపద, గిరిజన కళలలో ఉన్నత కృషికి ప్రదానం చేస్తారు.

కళారత్న
పురస్కారం గురించి
విభాగం సాహిత్యం, సంగీతం, నాట్యం, శిల్పకళ, చిత్రలేఖనం, జానపద , గిరిజన కళలు.
వ్యవస్థాపిత 1999
మొదటి బహూకరణ 1999
క్రితం బహూకరణ 2018
బహూకరించేవారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
నగదు బహుమతి ₹ 50,000

పురస్కారం మార్చు

ఈ పురస్కారాన్ని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రదానం చేస్తారు. 50,000 రూపాయల నగదు, శాలువా, బంగారు పూత హంసను పురస్కారంలో భాగంగా ఇస్తారు.

పురస్కార గ్రహీతలు మార్చు

కళారత్న పురస్కారాలు - 2015 మార్చు

2015 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 32 మందికి పురస్కారాన్ని అందించింది.[3][4]

కళారత్న పురస్కారాలు - 2016 మార్చు

2016 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 23 మందికి పురస్కారాన్ని అందించింది.[5][6]

కళారత్న పురస్కారాలు - 2017 మార్చు

2017 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 39 మందికి పురస్కారాన్ని అందించింది.[7][8]

కళారత్న పురస్కారాలు - 2018 మార్చు

2018, మార్చి 18న విళంబి నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని విజయవాడ తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో జరిగిన వేడుకలలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు 47 మందికి కళారత్న పురస్కారం అందజేయడ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు, శాసనసభాధిపతి కోడెల శివప్రసాద్, శాసనసభ ఉప సభాధిపతి మండలి బుద్ధ ప్రసాద్, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, భూమా అఖిల ప్రియ తదితరులు పాల్గొన్నారు.[9]

మూలాలు మార్చు

  1. http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/hamsa-awards-are-now-kalaratna/article3091236.ece
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-09. Retrieved 2016-04-01.
  3. http://www.thehindu.com/news/national/andhra-pradesh/hamsa-and-ugadi-awards-announced/article7013333.ece
  4. తెలుగువన్ (19 March 2015). "పట్టాభి రామ్, రావి కొండలరావులకు కళారత్న అవార్డు". Retrieved 20 March 2018.[permanent dead link]
  5. "23మందికి కళారత్న పురస్కారం". www.andhrabhoomi.net. 2016-04-09. Archived from the original on 2016-04-10. Retrieved 2023-03-24.
  6. "AP Hamsa awards,AP Ugadi Awards 2016,AP Ugadi Awards (Puraskaralu) 2016 Announced | TeluguNow.com". www.telugunow.com. Archived from the original on 2016-10-09. Retrieved 2023-03-24.
  7. 39 మందికి ‘కళారత్న’ 29-03-2017 ఆంధ్రజ్యోతి[permanent dead link]
  8. "ఉగాది సందర్భంగా అవార్డులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం". andhrapradesh.suryaa.com. 2017-03-28. Archived from the original on 2022-02-16. Retrieved 2022-02-16.
  9. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు (18 March 2018). "పండుగ సందర్భంగా ఏపీలో ప్రముఖులకు ఉగాది పురస్కారాలు". Archived from the original on 22 మార్చి 2018. Retrieved 18 March 2018.