కాంతి సంవత్సరం

ఖగోళ పొడవు యొక్క యూనిట్, కాంతి ఒక సంవత్సరంలో శూన్యంలో ప్రయాణించే దూరం అని నిర్వచించబడింది

కాంతి సంవత్సరం, (ఆంగ్లం : Light Year) అతి పెద్ద దూరాల్ని కొలవడానికి ఉపయోగించే ఒక కొలమానము. దీనిని ప్రత్యేకంగా ఖగోళ శాస్త్రములో ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. కాంతి సుమారుగా ఒక సెకనుకి 3 లక్షల కిలోమీటర్లు వేగంతో ఒక సంవత్సరం పాటు శూన్యంలో ప్రయాణించిన దూరాన్ని ఒక కాంతి సంవత్సరము అని అంటారు. కాంతి వేగము ఒక సెకనుకు 3 లక్షల కిలో మీటర్ల లెక్కన నిముషానికి 180 లక్షల కిలోమీటర్లు, గంటకు 108 కోట్ల కిలో మీటర్ల దూరం, రోజుకు 2592 కోట్ల కిలో మీటర్ల దూరం, సంవత్సరానికి 9 లక్షలా 50 వేల కోట్ల కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

12lightyears.gif
సూర్యునికి 12.5 కాంతి సంవత్సరాల సుదూరంలో ఉండే నక్షత్రాలు

సాంఖ్యక బలము మార్చు

ఒక కాంతి సంవత్సరం వీటితో సమానం:

సంవత్సరమనగా ఒక జూలియన్ సంవత్సరం (గ్రెగోరియన్ సంవత్సరం కాదు), అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య లెక్కల ఆధారంగా ఖచ్చితంగా 365.25 రోజులు (ఖచ్చితంగా, మొత్తం 3,15,57,600 సెకన్లు) .[1]

ఇతర కాంతి సంవత్సరాలు మార్చు

సంవత్సరం : విధము సంవత్సరం (రోజులు) కాంతి సంవత్సరం (కి.మీ.) కాంతి సంవత్సరం (మైళ్ళు)
జూలియన్ సంవత్సరం (IAU) 365.25 9,460,730,472,580,800 5,878,625,373,184
గ్రెగోరియన్ సంవత్సరం 365.2425 9,460,536,207,068,020 5,878,504,662,190
1900.0 సగటు అక్షాంశ సంవత్సరం
(ఇంటర్నెట్ సర్చ్ ఇంజిన్ల ఆధారంగా)
365.242198781 9.460 528 404 88×1015 5,878,499,814,135
2000.0 సగటు అక్షాంశ సంవత్సరం 365.242190419[2] 9.460 528 188 28×1015 5,878,499,679,546

మూలాలు మార్చు

  1. "IAU Recommendations concerning Units". Archived from the original on 2007-02-16. Retrieved 2008-03-31.
  2. Derived from X. Moisson, "Solar system planetary motion to third order of the masses", Astronomy and astrophysics 341 (1999) 318-327, p. 324 (N for Earth fitted to DE405) and N. Capitaine et al., "Expressions for IAU 2000 precession quantities" PDF (685 KB) Astronomy and Astrophysics 412 (2003) 567-586 p. 581 (P03: pA).

ఇవీ చూడండి మార్చు