కాకర్లమూడి (వేమూరు మండలం)

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా గ్రామం

కాకర్లమూడి, బాపట్ల జిల్లా, వేమూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

కాకర్లమూడి
—  రెవెన్యూయేతర గ్రామం  —
కాకర్లమూడి is located in Andhra Pradesh
కాకర్లమూడి
కాకర్లమూడి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°13′44″N 80°44′07″E / 16.229025°N 80.735371°E / 16.229025; 80.735371
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం వేమూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి జి.కనకరత్నం
పిన్ కోడ్ 522301
ఎస్.టి.డి కోడ్ 08644

గ్రామ చరిత్ర మార్చు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు మార్చు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామ భౌగోళికం మార్చు

సమీప గ్రామాలు మార్చు

1) చదలవాడ 2) కుచ్చెళ్ళపాడు3) చెముడుబాడు పాలెం4) వరహపురం5) చక్రాయపాలెం6) జంపని

రవాణా సౌకర్యాలు: మార్చు

తెనాలి నుండి కుచ్చెళ్ళపాడు వెళ్ళవలసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ బాస్సులు అన్ని వయా కాకర్లమూడి నుంచి కుచ్చెళ్ళపాడు వెళ్లును, ఆటోమొబైల్ సౌకర్యాలున్నాయి.

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

కాకర్లమూడిలో ప్రభుత్వ ఏలిమెంటరీ స్కూల్ ఉంది. దాని నిర్మాణం శ్రీ ముద్దాభక్తుని సుబ్బారావుగారు చదలవాడ పంచాయితీ సర్పంచ్ గా ఉన్నప్పుడు జరిగింది. అప్పటికింకా కాకర్లమూడి గ్రామపంచాయితీ ఏర్పాటుకాలేదు. కాకర్లమూడి గ్రామం కూడా చదలవాడ గ్రామపంచాయితీలో ఉండేది

గ్రామ పంచాయతీ మార్చు

  1. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో జి.కనకరత్నం, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా అమ్మిశెట్టి కిశోర్ ఎన్నికైనారు.
  2. ఈ గ్రామాన్ని 2012-13 ఆర్థిక సంవత్సరానికి, కేంద్రప్రభుత్వ నిర్మల్ పురస్కారానికి ఎంపికచేసారు. ఈ పురస్కారం క్రింద రు. 2 లక్షల రూపాయల నగదు మరియూ ఆ గ్రామ ప్రజాప్రతినిధులను ప్రభుత్వం సత్కరించనున్నది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి గ్రామంలో 282 నివాస గృహాలు ఉండగా 100% మరుగుదొడ్లు ఉన్నాయి. 2015,ఆగస్టు-22వ తేదీనాడు, ఈ గ్రామ సర్పంచి, ఎం.పి.డి.వో., పంచాయతీ కార్యదర్శి, ఆర్.డబ్లు.ఎస్. ఏ.ఈ., విశాఖపట్నంలో రాష్ట్రమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకుంటారు.

ప్రధానమైన పంటలు మార్చు

1) వరి 2) జొన్న3) మొక్కజొన్న4) మినుములు

ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం,వ్యవసాయ ఆధారిత వృత్తులు, సాప్ట్ వేర్ ఉద్యోగులకు నిలయం

గ్రామ ప్రముఖులు మార్చు

  • చందు దశరథరామయ్య:- వీరు ప్రసిద్ధ వామ పక్ష నాయకులు, సంగీతదర్శకులు. వీరి వర్ధంతిని ఈ గ్రామంలో, 2016,మే-10న ఘనంగా నిర్వహించారు.
  • బొల్లిముంత నాగేశ్వరరావు:- రచయిత. అనేక నవలలు, కథలు, నాటకాలు, నాటికలు వ్రాశాడు. కొన్ని సినిమాలకు కథ, సంభాషణలు సమకూర్చాడు.

గ్రామ విశేషాలు మార్చు

కాకర్లమూడి గ్రామం/ఇంటిపేరు మార్చు

శ్రీ కాకర్లమూడి నాగేశ్, అమెరికాలోని ఫ్లోరిడాలో, 40 సంవత్సరాలనుండి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. వీరు హైదరాబాదులో పుట్టి పెరిగినారు. వీరి తండ్రి కాకినాడలో పుట్టి పెరిగినారు. శ్రీ కాకర్లమూడి నాగేష్ గారి కుమార్తె మహిమ, ఉన్నత చదువులు చదివి, అమెరికాలో ఒక బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఈమె తన ఇంటి పేరుగా ఉన్న గ్రామం గురించి తెలుసుకోవాలని, ఆరు సంవత్సరాలనుండి గూగుల్ లో శోధించింది. సంక్రాంతికి హైదరాబాదులోని తమ బంధువుల ఇంటికి వచ్చిన ఆమె, వారి సాయంతో, చివరికి, ఈ గ్రామానికి, 2016,జనవరి-16న చేరుకుని మురిసిపోయింది. తమ ముత్తాతలు ఆ గ్రామంలో ఉండేవారనీ, వారి ద్వారానే తమకు ఆ ఇంటి పేరు వచ్చినదని తెలుసుకుని మహదానందం చెందినది. గ్రామమంతా కలియతిరిగినది. పల్లె చిత్రాన్ని స్వయంగా ఫొటోలు తీసుకొన్నది. తన తండ్రి పేరు నాగేష్ అనీ, ఆయన తండ్రిపేరు రామకృష్ణమూర్తి అనీ, ఆయన తండ్రి రామచంద్రయ్య అనీ, అయన తండ్రి వెంకటరామయ్య అనీ, వారి వివరాలను గ్రామస్థులకు, సగం ఆంగ్లంలోనూ, సగం తెలుగులోనూ గుర్తుచేసే ప్రయత్నం చేసింది.

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.

వెలుపలి లంకెలు మార్చు