కారంపూడి

ఆంధ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లా లోని గ్రామం

కారంపూడి, పల్నాడు జిల్లా, కారంపూడి మండలంలోని గ్రామం.ఇది అదే పేరుతో ఉన్నమండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన పిడుగురాళ్ళ నుండి 17 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3492 ఇళ్లతో, 14385 జనాభాతో 1726 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7651, ఆడవారి సంఖ్య 6734. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1844 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1657. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589870[1].పిన్ కోడ్: 522614, ఎస్.టి.డి.కోడ్ = 08649.

కారంపూడి
—  రెవిన్యూ గ్రామం  —
కారంపూడి is located in Andhra Pradesh
కారంపూడి
కారంపూడి
అక్షాంశరేఖాంశాలు: 16°23′57″N 79°46′03″E / 16.399201°N 79.76738°E / 16.399201; 79.76738
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం కారంపూడి
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ కాల్వ రత్తయ్య(ఏసురత్నం)
జనాభా (2001)
 - మొత్తం 12,049
 - పురుషుల సంఖ్య 6,430
 - స్త్రీల సంఖ్య 5,619
 - గృహాల సంఖ్య 2,568
పిన్ కోడ్ 522614
ఎస్.టి.డి కోడ్ 08649

గ్రామ భౌగోళికం మార్చు

కారంపూడి, గురజాలకు 18 కి.మీ.ల, మాచర్లకు 35 కి.మీ.ల దూరంలో ఉంది.కారంపూడి భౌగోళిక సూచికలు- అక్షాంశం: ఉత్తరం 16.421 రేఖాంశం: తూర్పు 79.731949

సమీప గ్రామాలు మార్చు

గ్రామ చరిత్ర మార్చు

రాక్షసబండ మార్చు

కారంపూడి దగ్గర్లోని 'రాక్షసబండ'ను పురావస్తుశాఖ రక్షిత ప్రదేశంగా ప్రకటించనుంది. ఈ నిలువురాతిశిల క్రీస్తు పూర్వం 1000-500 శతాబ్దాల మధ్య విలసిల్లిన లోహయుగపు నాటిదిగా తెనాలికి చెందిన ఔత్సాహిక పురావస్తు పరిశోధకుడు కడియాల వెంకటేశ్వరరావు వెలుగులోకి తెచ్చాడు. కారంపూడి-దాచేపల్లి రోడ్డుకు రెండువైపులా ప్రత్యేకంగా కనిపించే 100-150 ఎకరాల్లో మధ్యగల ఎత్తయిన ప్రదేశంలో 'రాక్షసబండ' కనిపిస్తుంది. దీని ఎత్తు 19.2 అడుగులు. వెడల్పు 4.2 అడుగులు, మందం ఏడు అంగుళాలు. ప్రత్యేకంగా ప్రతిష్ఠించినట్టుండే ఇలాంటి నిలువురాతిని పురావస్తు పరిభాషలో 'మన్‌హీర్‌' అంటారు. పురావస్తు పరిశోధనలను అనుసరించి ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా ఆదిమ మానవుల శ్మశానవాటికల వద్ద, వారు నివసించిన ఇతర ప్రదేశాల్లోనూ ఒంటరిగా, సమూహాలుగా ఏర్పాటై ఉన్నాయి. కొన్నిచోట్ల వరుసగా, మరికొన్నిచోట్ల వృత్తాకారంలోనూ పాతి కనిపిస్తాయి. ఇనుముతో చెక్కిన బొమ్మలు ఉండటం దీని ప్రత్యేకత. వీటిని 'పెట్రోగ్లిప్స్‌' అని పిలుస్తారు. పెట్రో అంటే 'రాయి', గ్లిప్స్‌ అంటే 'తీర్చిదిద్దిన కళాకృతి' అని అర్థం. పలక ఆకారంలో గల ఈ మన్‌హీర్‌పై సగం నుంచి దిగువకు ఇనుముతో చిత్రించిన అనేక బొమ్మలు, ముగ్గులు, పీర్లను పోలినట్టుగా వారసత్వపరమైన పితృదేవతలు, జంతువులను చిత్రించి ఉంటాయి.'ఇవి ఆదిమ మానవుల జీవనశైలికి ప్రతిబింబాలు. నాటి మతపరమైన నమ్మకాలు. వారసత్వ పితృదేవతారాధన. వారి ఉనికిని ఈ శిలా చిత్రాలతో రికార్డు చేసుకున్నారు. కారంపూడి మన్‌హీర్‌ ప్రాంతం నాటి కర్మకాండలకు సంబంధించిన సామూహిక ప్రార్థన స్థలం. సమాధుల మధ్యలో మన్‌హీర్‌లను ఉంచటం వల్ల ఇక్కడ పితృదేవతల ఆత్మలు సంచరిస్తుంటాయని, అవి తమను రక్షిస్తాయనే విశ్వాసం ఆదిమమానవుల్లో ఉందని చరిత్రకారుల భావన.

కారంపూడిలోని మన్‌హీర్‌ దిగువన శ్మశానం ఉన్నట్టు 1870-71లో వెలుగులోకి వచ్చింది. అప్పటి కలెక్టరు జేఏసీ బాస్‌వెల్‌.. మెగాలిత్‌ (లోహయుగపు) కాలంనాటి రాతితో నిర్మించిన సమాధులను గుర్తించారు. పలు సమాధులను తవ్వించి పరిశీలించారు. మృతదేహాలను ముందుగా దహనం చేసి అవశేషాలను కుండల్లో ఉంచి సమాధుల్లో భద్రపరిచి, గోళాకారంగా మట్టిని పేర్చి చుట్టూ బండరాళ్లను ఉంచారట. 140 ఏళ్ల కిందట అప్పటి కలెక్టర్‌ స్వయంగా పరిశోధన చేసి ఆ సమాధులు, 'సిథియన్‌/ తురానియన్‌ జాతుల సంస్కృతికి సంబంధించిన పురాతన అవశేషాలు'గా పేర్కొన్నారు. మెగాలిత్‌ నిర్మాణాలు సాధారణంగా తూర్పు దిశగా సూర్యుడికి ఎదురుగా ఉంచుతారు. కారంపూడి మన్‌హీర్‌ను తూర్పు, ఉత్తర దిశలుగా నిలిపి ఉంచారు. మెగాలిత్‌ నిర్మాణాలు కేవలం ప్రార్థన మందిరాలుగానే కాకుండా గ్రహాల గమనాల కనుగుణంగా రుతువులు, కాలగమనాన్ని తెలుసుకునేందుకు ఆదిమజాతులు మన్‌హీర్‌లను ఉపయోగించుకుని ఉంటారు.

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో ఒక బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాల పిడుగురాళ్ళలోను, ఇంజనీరింగ్ కళాశాల అలుగురాజుపల్లిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు అలుగురాజుపల్లిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మాచర్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

ఆదర్శపాఠశాల మార్చు

ప్రభుత్వంవారు ఈ పాఠశాలలో రు.6.5 లక్షల వ్యయంతో, 5 కి.వా. సామర్ధ్యంగల సౌర విద్యుత్తు పరికరాలను అందజేసినారు. వీటిని 2014,అక్టోబరు-28న ప్రారంభించారు. ఈ పథకం వలన పాఠశాలలోని 6 నుండి ఇంటరు తరగతులు నిర్వహించే గదులతోపాటు, కంప్యూటరు, ప్రయోగశాల గదులకు నిరంతర విద్యుత్తు సౌకర్యం అందటమే గాక, విద్యుత్తు బిల్లులు తగ్గడంతోపాటు మిగులు నిధులను విద్యార్థుల అవసరాలకు, పాఠశాలలో మెరుగైన వసతుల కల్పనకు వినియోగించెదరు. పల్నాడు ప్రాంతములో ఈ విధమైన సౌకర్యాలు కలిగించడం ఇదే ప్రథమం. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల సుద్దగుంటల కాలనీలో ఉంది.

వైద్య సౌకర్యం మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

కారెంపూడిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, 10 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.ఒకపశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.గ్రామంలో ఒక ఆయుర్వేద ఆసుపత్రి ఉంది.

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

గ్రామంలో 11 ప్రభుత్వేతర వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఇద్దరు, ఆరుగురు డిగ్రీ లేని డాక్టర్లు, ముగ్గురు నాటు వైద్యులు ఉన్నారు. నాలుగు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది. గ్రామంలో ఏర్పాటుచేసిన ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకానికి శ్రీచక్రా సిమెంటు కర్మాగారంవారు అందించిన ఆర్థిక సహకారంతో రెండు రూపాయలకే స్వచ్ఛమైన శుద్ధిచేసిన త్రాగునీరు అందించుచున్నారు.

పారిశుధ్యం మార్చు

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారాకూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు.గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు.సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు.ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు.సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు మార్చు

కారెంపూడిలో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు మార్చు

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది.అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం మార్చు

కారెంపూడిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 350 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 140 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 18 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 6 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 20 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1190 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 918 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూమి: 292 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు మార్చు

కారెంపూడిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, కారంపూడి తండాలోని గురవమ్మకుంటలో 2016 లో పూడిక తీసారు.

  • కాలువలు: 56 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 236 హెక్టార్లు

ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ పంచాయతీ మార్చు

కారంపూడి పంచాయతీ 1931 ఫిబ్రవరి 28న ఏర్పడింది.1976లో మేజర్ పంచాయతీగా మారింది.పంచాయితీ పరిధిలో 2019 నాటికి 9 మంది సర్పంచులు పనిచేసిన కాలంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. 1964లో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా ఉత్తమ పంచాయతీ పురస్కారం అందుకుంది.1980లో 1.36 లక్షల లీటర్ల సామర్ధ్యంతో నీటిట్యాంకుని నిర్మించారు.2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో కాల్వ రత్తయ్య (ఏసురత్నం), సర్పంచిగా ఎన్నికైనాడు.మండలంలో మొదటిసారి ఏర్పడిన, కారంపూడి మండల సర్పంచిల సంఘానికి ఉపాధ్యక్షుడుగా పనిచేసాడు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయం మార్చు

ఇక్కడ బ్రహ్మనాయుడు కట్టించిన చారిత్రక చెన్నకేశవ స్వామి ఆలయం ఉంది. పల్నాటి యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలు ఇక్కడ జాగ్రత్తగా భద్రపరచి ఉన్నాయి. ఆ యుద్ధ వీరుల స్మృతి స్మారకముగా ప్రతి ఏటా ఇక్కడ జరిగే ఉత్సవంనకు ఈ ప్రాంతం నలుమూలల నుండి సందర్శకులు దర్శిస్తారు

శ్రీ ఆంకాళమ్మ అమ్మవారి ఆలయం మార్చు

పల్నాటి ఇలవేలుపు ఆంకాళమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా, రెండవ శుక్రవారం నుండి, ప్రతి శుక్రవారం, సామాజిక వర్గాలవారీగా అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా ఉంది.

గ్రామదేవతలు మార్చు

పోలేరమ్మ, పాతపాటేశ్వరీ అమ్మవారల ఆలయాలు:- ఈ దేవాలయ ద్వితీయ వార్షికోత్సవం, 2014,డిసెంబరు-8, మార్గశిర బహుళ విదియ, సోమవారం నాడు, ఘనంగా నిర్వహించారు. గ్రామదేవతలుగా ప్రసిద్ధిచెందిన ఈ దేవాలయంలో అమ్మవార్లకు గ్రామస్థులు కుంకుమబండ్లు, బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు, పోతరాజుకు ప్రత్యేక అలంకరణలు చేసారు. ఈ మేరకు ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దినారు. ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించి, అనంతరం భక్తులు సమర్పించిన బోనాలను అమ్మవారికి నివేదించారు.

శ్రీ గంగా పార్వతీ సమేత సురేశ్వరస్వామివారి ఆలయం మార్చు

ఈ ఆలయం పదవ శతాబ్దానికి పూర్వమే ఉంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన ఆలయంలోని స్వామివారికి ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహించెదరు.

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయం. మార్చు

వీర్లదేవాలయం. మార్చు

 
వీర్లగుడి,కారంపూడి

వీర్లదేవాలయం 11వ శతాబ్దంలో పల్నాటి యుద్ధం ముగిసిన తరువాత బ్రహ్మనాయుడు ఆశయసిద్ది కోసం యుధ్దంలో మరణించిన 66 వీరనాయుకులకు గుర్తులుగా 66 వీరకల్లును ప్రతిష్ఠించి వీరాచారపీఠం స్థాపించి, దానికి పిడుగు వంశంవారిని పీఠాధిపతిగా నియమించాడు ఆ వీరకల్లులు, వీరాచారపీఠం ఉన్నదే వీరులగుడి (వీర్లదేవాలయం).ఈ గుడి ఒడ్డున ఉంది.యుద్ధంలో మరణించిన వీరులకు దైవత్వాన్ని ఆపాదించి, వారు ఉపయోగించిన ఆయధాలకు పూజల చేసి ఉత్సావాలు జరపటం అనే సాంప్రదాయం ప్రపంచంలో రోమ్ తరువాత ఒక్క కారంపూడిలోని వీర్లగుడిలోనే జరుగుతుంది.12వ శతాబ్దంనాటి వీర్లదేవాలయం (కారంపూడి) పల్నాటి చారిత్రిక చిహ్నాలలో ఒకటి.

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం మార్చు

ఈ ఆలయ 12వ వార్షికోత్సవం సందర్భంగా, 2015, జూన్-19వ తేదీ శుక్రవారం ఉదయం ఆలయంల్, ప్రత్యేకపూజలు, అభిషేకాలు, సాయిచాలీసా, విష్ణుసహస్రనామ పారాయణ, పల్లకీ ఉత్సవం మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తారు.

గ్రామ ప్రముఖులు మార్చు

  • గోలి వెంకట సుబ్రహ్మణ్యశర్మ- కారంపూడి మండలంలోని పట్లవీడు గ్రామానికి చెందిన ఇతను, తిరుపతి శ్రీ వేంకటేశ్వర వేదవిద్యాలయంలో అకడమిక్ డీన్, వేద విద్య ఆచార్యులుగా పనిచేస్తున్నాడు. గురుప్రబోధంతో సంపాదనకు ఆశపడకుండా అధ్యాపక వృత్తిని చేపట్టి, వేలమందికి అక్షర ప్రబోధం చేసాడు.ఇతను పురస్కారాలు పొందాడు.ఇతనికి శిష్యులు 2017 జూన్ 25న బాపట్లలో స్వర్ణ కంకణం ప్రదానం చేసి సత్కరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా, శంకర విద్యాలయానికి చెందిన పూర్వ విద్యార్థులు, శ్రీ శర్మ దంపతులను గుర్రపు రథంపై బాపట్లలో నగరోత్సవం నిర్వహించారు.
  • బెల్లంకొండ సుబ్బారావు: ప్రముఖ రంగస్థల నటుడు, న్యాయవాది.ఈయన 1902లో కారంపూడిలో జన్మించాడు.నరసరావుపేట పట్టణంలో పెరిగాడు. ఇతను 1952 నవంబరు 21న పరమపదించారు.

పరిశ్రమలు మార్చు

కారంపూడి గ్రామ శివారులో "మ్యాట్రిక్స్" పేరుతో ఒక విద్యుదుత్పత్తి కర్మాగారం ఉంది. ఈ కర్మాగారంలో వరి,శనగపొట్టు, పామాయిలు గెలల వ్యర్ధాలు మొదలగు వాటిని మండించి, విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు.

మూలాలు మార్చు

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కారంపూడి&oldid=3792572" నుండి వెలికితీశారు