కార్తవరాయని కథ ఆర్.ఆర్.పిక్చర్స్ పతాకంపై నిర్మించబడిన తెలుగు సినిమా. ఈ సినిమా 1958, అక్టోబర్ 18న విడుదలయ్యింది.

కార్తవరాయని కథ
(1958 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.ఆర్.రామన్న
కథ మద్దిపట్ల సూరి
తారాగణం నందమూరి తారక రామారావు,
సావిత్రి,
పి.కన్నాంబ
సంగీతం అశ్వత్థామ
గీతరచన దేవులపల్లి కృష్ణశాస్త్రి
మల్లాది రామకృష్ణశాస్త్రి
సంభాషణలు మద్దిపట్ల సూరి
నిర్మాణ సంస్థ ఆర్.ఆర్.పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

పాటలు మార్చు

వెల్వెట్ వాయిస్ గా ప్రసిద్ధిగాంచిన గాయకుడు ప్రతివాది భయంకర శ్రీనివాస్ (పి.బి.శ్రీనివాస్) ఆలపించిన 'ఆనంద మోహనా ఖగరాజ వాహనా' అనే పాట ఈ సినిమాలోనిదే. ఈ పాట రచన మల్లాది రామకృష్ణశాస్త్రి. ఈ పాటలో వచ్చే 'దైవరాయ', 'పాపపానుపు' వంటి పదాలు మల్లాది శైలిని తెలుపుతాయని ఒక సందర్భంలో 'పాడుతా తీయగా' అనే ఈ-టీవీ వారి కార్యక్రమంలో పి.బి.శ్రీనివాస్ అన్నారు.

  1. ఆనంద మోహనా ఖగరాజ వాహనా - రచన : మల్లాది రామకృష్ణశాస్త్రి; గానం : పి.బి.శ్రీనివాస్
  2. కలువ రేకులలోన - కలలు మూగేనే - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి . ఘంటసాల.
  3. గాజులమ్మా గాజులు కన్నియ చేతుల మోజులు - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి; గానం : ఎస్.జానకి
  4. పూసే మల్లిరెమ్మ కాసే మావికొమ్మ ఏ పూల తేనె తెచ్చి పూజ చేసిరమ్మ - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి, గానం:ఎ. జి. రత్నమాల
  5. మూగే చీకటి ముసుగులో దాగే బంగారు తారా - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
  6. నా మనసేమోనే సఖియా నను విడిపోయేనే - గానం : పి.లీల
  7. శంగిలి గింగిలి జిలిబిలి గలిబిలి . ఘంటసాల . రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి.
  8. ఒకసారి దిగిరావా (పద్యం). ఘంటసాల రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి.