కాలుతున్న పూలతోట

సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన తెలుగు రచన

కాలుతున్న పూలతోట 2010లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన నవల.[1] దీనిని సయ్యద్ సలీం రచించారు.[2] "ఎయిడ్స్" ఇతివృత్తంతో తెలుగులోకి వచ్చిన తొలి నవల ఇది.

కాలుతున్న పూలతోట
"కాలుతున్న పూలతోట" పుస్తక ముఖచిత్రం
కృతికర్త: సయ్యద్ సలీం
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: ఎయిడ్స్ వ్యాధి - భయాల గురించి
ప్రచురణ:
విడుదల: 2006
పేజీలు: 232

నేపథ్యం మార్చు

నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న అతి పెద్ద సమస్యల్లో ఒకటి హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఈ వ్యాధి గురించిన సరైన అవగాహన లేకపోవటం వల్ల జరిగిన, జరుగుతున్న అనర్ధాలెన్నో. హెచ్ ఐ వి ఉందని తెలీగానే అది మరణ కాసణమనుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నవాళ్ళూ, ఏ తప్పూ చేయకుండానే రక్త మార్పిడి సమయంలో హెచ్.ఐ.వి బారిన పడి నమాజ బహిష్కరణకు గురౌతున్న అభాగ్యులు, కూతురికి ఆ రాగం సోకిందని తెలికాక గర్భిణీ అన్న కనికరం కూడా లేకుండా వూరి బయట స్మకానంలో వదిలేసి వచ్చిన తల్లిదండ్రులు, ఓ విద్యార్థికి హెచ్.ఐ.వి ఉందన్న కారణంతో అతన్ని స్కూల్ నుంచి వెళ్ళగొట్టేదాకా ఉద్యమించిన మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు వంటి అంశాలు ఆయనను ఈ కథాంశంతో నవల రాయడానికి ప్రేరేపించిన అంకాలు.[3]

కథాంశం మార్చు

ఒక ఊరిలో ఒక స్వామీజీ ఊరి పొలిమేరలో మసూచి అమ్మవారిని కలవడం, ఆమెను ఈ ఊరివారికి ఏమీ చేయవద్దని హెచ్చరించడం, ఆమె నలుగురిని మాత్రమే తీసుకొని పోతానని మాట యివ్వడం, స్వామీజీ దేశాటనకు పోయి తిరిగి వచ్చిన తరువాత్ ఆ ఊరిలో తొమ్మిది మంది మరణించడం, ఆమెను కలసి ఎందుకిలా జరిగింది అని నిలదీయడం, ఆమె వ్యాధి కంటే భయం వల్ల మిగిలినవారు చనిపోయారని చెప్పడాన్ని ఒక కథలో తెలియజేసారు. ఈ నవలలో వ్యాధి సోకి మరణించేవారి కన్నా భయం వల్ల మరణించేవారే హెచ్చు అని తెలియజేసారు. భయం అనేది ఎన్ని రకాలుగా మనిషిని పీడిస్తుందో ఈ నవలలో చెప్పడానికి ప్రయత్నించారు.

ఈ నవల మొదట "నవ్య" వారపత్రికలో ధారావాహికంగా ప్రచురించబడి 2006లో పుస్తక రూపంలో వెలువడింది. శ్రీమతి శాంతకుమారి గారు ఈ నవలను "నయీ ఇమారత్ కె ఖండహర్"గా హిందీలో అనువదించారు. ఈ నవలో హెచ్. ఐ. వి/ఎయిడ్స్ రాగుల గౌరవప్రదంగా జీవించే హక్కు గురించి, వాళ్ళ విషయంలో సమాజం యొక్క నైతిక బాధ్యత గురించి, హెచ్ ఐ వి సోకిన పిల్ల ల చదువుకునే హక్కు గురించి చర్చించటం వల్ల ఈ అనువాదానికి 2009 వ సంవత్సరానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, న్యూఢిల్లీ వారి అవార్డు దక్కింది.ఈ నవలకు 2010 నంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

దీన్ని కన్నడ భాషలోకి జి. వీరభద్ర గౌడ గారు, మలయాళంలోకి శ్రీ ఎల్ ఆర్. స్వామి గారు, ఇంగ్లీష్ లోకి డా. జయలక్ష్మి గారు అనువదించారు.

మూలాలు మార్చు

  1. "'Abhyudaya Sahiti Puraskaram' presented to Saleem". STAFF REPORTER. Thi Hindu. 9 January 2012. Retrieved 8 February 2016.
  2. అక్షరశిల్పులు (PDF) (ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ ed.). సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌. 2010. p. 136. Retrieved 7 February 2016.
  3. కాలుతున్న పూలతోట నవలా నేపథ్యం

ఇతర లింకులు మార్చు