కాల భైరవ తెలుగు సినిమా నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు. ఆయన తెలుగు, తమిళ్, హిందీ భాషా చిత్రాలలో పాడాడు.‘బాహుబ‌లి-2’లో అతడు పాడిన దండాల‌య్యా పాట‌ కాల భైరవకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆయన 2019లో విడుదలైన మత్తు వదలరా సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా మారాడు.[1][2]

కాల భైరవ
జననం
వృత్తిసంగీత దర్శకుడు, గాయకుడు
క్రియాశీల సంవత్సరాలు2011- ప్రస్తుతం
తల్లిదండ్రులుఎం. ఎం. కీరవాణి (తండ్రి)
ఎం. ఎం.శ్రీ వల్లి (తల్లి)
బంధువులుశ్రీ‌ సింహా (తమ్ముడు)
ఎస్. ఎస్. రాజమౌళి (బాబాయ్)
కల్యాణి మాలిక్ (బాబాయ్)

కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ కలిసి పాడిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు’ పాట, 2023 మార్చి 13 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.[3]

69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ (2021) సినిమాలోని కొమురం భీముడో పాటకు జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యాడు.[4]

సంగీత దర్శకత్వం వహించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పేరు భాషా ఇతర విషయాలు
2018 నాన్న కూచి జీ5 సిరీస్ ; బ్యాక్ గ్రౌండ్ సంగీతం
2019 మత్తు వదలరా తెలుగు
2020 కలర్ ఫోటో తెలుగు
2021 తెల్లవారితే గురువారం తెలుగు [5]
2021 గుర్తుందా శీతాకాలం తెలుగు
2021 లక్ష్య తెలుగు
2021 ఆకాశవాణి తెలుగు
2021 కార్తికేయ 2 తెలుగు
2022 హ్యాపీ బర్త్‌డే తెలుగు
2022 కార్తికేయ 2 తెలుగు

పురస్కారాలు మార్చు

సైమా అవార్డులు: ఉత్తమ నేపథ్య గాయకుడు

  1. 2017: "దండాలయ్యా" (బాహుబలి 2: ది కన్‌క్లూజన్)

మూలాలు మార్చు

  1. The Times of India (23 October 2019). "Kaala Bhairava to make his debut as music director - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 4 July 2021. Retrieved 4 July 2021.
  2. Eenadu (25 March 2021). "ఎన్టీఆర్‌తో పనిచేయడమే నా కల! - music director kalabhairava interview". www.eenadu.net. Archived from the original on 4 July 2021. Retrieved 4 July 2021.
  3. https://timesofindia.indiatimes.com/tv/news/telugu/natu-natu-wins-best-original-song-award-at-oscars-2023-rahul-sipligunj-and-kaala-bhairavas-performance-receives-loudest-cheer/articleshow/98595416.cms
  4. "National Awards 2023: జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌.. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలు వీళ్లే". EENADU. 2023-08-24. Archived from the original on 2023-08-24. Retrieved 2023-08-24.
  5. TV9 Telugu (19 March 2021). "Thellavarithe Guruvaram : తెల్లవారితే గురువారం సినిమానుంచి అందమైన మెలోడీ.. సంగీతం అందించిన కాలభైరవ". Archived from the original on 4 July 2021. Retrieved 4 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=కాల_భైరవ&oldid=4075138" నుండి వెలికితీశారు