కిరణ్ రాథోడ్

సినీ నటి

కిరణ్ రాథోడ్ భారతీయ సినిమా నటి. తెలుగు, కన్నడ, హిందీ చిత్రాలలో నటించింది. 2001లో హిందీలో వచ్చిన యాదేయిన్ ఈవిడ మొదటి చిత్రం.

కిరణ్ రాథోడ్
2010లో రాథోడ్.
జననం (1981-01-11) 1981 జనవరి 11 (వయసు 43)
జైపూర్, భారతదేశం
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2001–ప్రస్తుతం
బంధువులురవీనా టాండన్ (కజిన్)

జననం మార్చు

రాజస్థాన్ లోని జైపూర్లో 1981, జనవరి 11 న జన్మించింది. ముంబై మిథిబాయి కాలేజీ నుండి డిగ్రీ పట్టా అందుకుంది. బాలీవుడ్ విలన్ అంజాద్ ఖాన్ వీరికి బంధువు.

సినీజీవితం మార్చు

కిరణ్ రాథోడ్ 1990 దశకం చివర్లో హిందీ పాప్ సాంగ్ ఆల్బమ్స్ లో నటించింది. అది చూసిన హిందీ చిత్రం నిర్మాతలు సినిమా అవకాశాలు ఇచ్చారు. మొదటిసారిగా యాదైన్ చిత్రంలో మొనిష్కా పాత్రను పోషించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది.

ఆతరువాత కొన్ని సినిమాలలో నటించి, దక్షిణ సినీరంగంలోకి వచ్చింది. విక్రమ్ తో జెమిని, కమల్ హాసన్ తో అన్బే శివం, అజిత్ కుమార్ తో విలన్, ప్రశాంత్ తో విన్నర్, శరత్ కుమార్ తో వంటి తమిళ హిట్ సినిమాలల్లో నటించింది. విలన్, విన్నర్, దివాన్ వంటి చిత్రాలలో తన నటనతో కిరణ్ రాథోడ్ తమిళనాడు ప్రేక్షకులను ఆకర్షించింది.

2009లో తమిళంలో వచ్చిన నాలయ్ నామదే చిత్రంలో సరసు అనే వేశ్య పాత్రతో రీఎంట్రీ ఇచ్చింది. జగ్గుభాయి, కెవ్వు కేక, అంబాల వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో సహాయక పాత్రలు పొషించింది.

చిత్ర సమహారం మార్చు

సంవత్సరం సినిమా పేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2001 యాదేయిన్ మొనిష్కా హిందీ
శుభకార్యం తెలుగు
2002 నువ్వు లేక నేను లేను తెలుగు
శ్రీరాం తెలుగు
జెమిని మనిషా తమిళం
విలన్ లావణ్య తమిళం
జాని దుష్మన్ -ఏక అనోఖి కహాని రష్మీ హిందీ
తాండవం మీనాక్ష్మీ మలయాళం
2003 ఆంబే శివం బాల సరస్వతి తమిళం
దివాన్ గీతా తమిళం
పరశురాం అంజలి తమిళం
విన్నర్ నీలవేణి తమిళం
తేన్నవన్ దివ్య తమిళం
తిరుమలై జక్కమ్మ తమిళం అతిథి పాత్ర
2004 న్యూ శివకామి తమిళం
నాని తెలుగు
అందరూ దొంగలే నవీన తెలుగు
చిన్న తమిళం అతిథి పాత్ర
2006 సావన్- ది లవ్ సీజన్లో హిందీ
సౌతెన్ సప్న సప్న సింగ్ హిందీ
తిమిరు తమిళం అతిథి పాత్ర
భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా రేణుకారాణి తెలుగు
ఇదు కథల్ వరం పరువం మనసి తమిళం
2007 క్షణ క్షణ మాయ కన్నడం
2008 మాయ కజ్హ్చ అస్వతి మలయాళం
వసూల్ తమిళం
2009 నాలి నమదే సరసు తమిళం
వసూల్ రాణి[1] తెలుగు
2010 జగ్గుబాయ్ శ్వేత తమిళం
హైస్కూల్ తెలుగు
వలిబామే వా తమిళం
గురు శిష్యన్ తమిళం అతిథి పాత్ర
Vaadaa Anushka తమిళం
2011 Manushya Mrugam Lissy Malayalam
Be Careful Kiran హిందీ
Gun Maya కన్నడ
Doubles Malayalam Special Appearance
2012 Saguni Vasundhara Devi తమిళం
భయం భయం[2] తెలుగు
Ata Pata Lapatta Reporter హిందీ
2013 Kushal Mangal హిందీ
కెవ్వు కేక[3] తెలుగు
2014 Maanikya కన్నడ Special Appearance
2015 Aambala Chinna Ponnu తమిళం
2016 Muthina Kathirikai Madhavi తమిళం
Ilamai Oonjal తమిళం
Sikkappatte Ishtapatte కన్నడ Filming

మూలాలు మార్చు

  1. తెలుగు ఫిల్మీబీట్, సినిమా వార్తలు. "కిరణ్ రాథోడ్ 'వసూల్ రాణి'". telugu.filmibeat.com. Retrieved 19 September 2016.
  2. తెలుగు ఫిల్మీబీట్, సినిమా వార్తలు. "భయం భయంగా...హాట్ లేడీ". telugu.filmibeat.com. Retrieved 19 September 2016.
  3. "Kevvu Keka Movie Review, Rating". gulte.com. Retrieved 16 July 2019.