కీర్తి సురేష్

సినీ నటి

కీర్తీ సురేష్ భారతీయ నటి. మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించారు.[1] నిర్మాత జి. సురేష్ కుమార్‌, నటి మేనకల కుమార్తె కీర్తి. 2000 మొదట్లో బాలనటిగా తెరంగేట్రం చేశారు ఆమె. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి, వెండితెరకు తిరిగి వచ్చిన తరువాత హీరోయిన్ పాత్రల్లో నటిస్తున్నారు. 2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలి సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యారు ఆమె. ఆ తరువాత తమిళ, తెలుగు చిత్రాలు కూడ నటించేందుకు సిద్ధమయ్యారు.

కీర్తి సురేష్
2017లో కీర్తి సురేష్
జననం (1992-10-17) 1992 అక్టోబరు 17 (వయసు 31)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
విద్యపెర్ల్ అకాడమీ, ఫ్యాషన్ డిజైన్ లో ఎం.ఎ (ఆనర్స్)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2000 – ప్రస్తుతం
తల్లిదండ్రులు
బంధువులురేవతి
(సహాయ దర్శకురాలు)

తొలినాళ్ళ జీవితం మార్చు

కీర్తీ తల్లిదండ్రులు మలయాళ సినీనిర్మాత సురేష్ కుమార్, మలయాళ నటి మేనక. మేనక నిజానికి తమిళ ప్రాంతానికి చెందినవారు.[2][3]  కీర్తీ అక్క రేవతీ సురేష్ వి.ఎఫ్.ఎక్స్ స్పెషలిస్ట్. షారుఖ్ ఖాన్ నిర్మాణ  సంస్థ రెడ్ చిల్లీస్ లో పనిచేశారు రేవతి.[4][5] నాలుగో తరగతి వరకు  తమిళనాడులోని చెన్నైలో చదువుకున్నారు కీర్తి.[6] ఆ తరువాత చదువు తిరువనంతపురంలోని కేంద్రీయ విద్యాలయలో సాగింది. తిరిగి చెన్నైకు పెర్ల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసేందుకు వచ్చారు. స్కాట్లాండ్ లో నాలుగు నెలల పాటు ఒక కోర్సు చదివిన కీర్తి, లండన్లో రెండు నెలల ఇంట్రెన్ షిప్ లో చేరారు. సినిమాల్లోకి నటిగా రాకపోయి ఉంటే డిజైనింగ్ లో ఉండేదాన్ని అని ఒక ఇంటర్వ్యూలో వివరించారు కీర్తి.[7]

నటించిన చిత్రాలు మార్చు

సూచిక
  ఇంకా విడుదలవని సినిమాలను సూచిస్తుంది:
సంవత్సరం చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు
2000 పైలట్స్ మళయాళం బాల్య నటి
2001 అచనయికిస్టం బాల్య నటి
2002 కుబేరన్ సిద్దార్దన్ కూతురు బాల్య నటి
2013 గీతాంజలి గీత, అంజలి కథానాయికిగా తొలి చిత్రం
2014 రింగ్‌ మాస్టర్ కార్తీక
2015 దర్బోని దేవి
ఇదు ఎన్న మాయం మాయ తమిళం తొలి పరిచయం(తమిళం)
2016 నేను శైలజ శైలజ తెలుగు తొలి పరిచయం(తెలుగు)
రజిని మురుగన్ కార్తిగ దేవి తమిళం
తొడరి \ రైల్ (తెలుగు) సరోజ తమిళం తెలుగులో రైల్ గా అనువాదమైంది
రెమో కావ్య తమిళం తెలుగులో రెమోగా అనువాదమైంది
2017 బైరవా మలర్‌విళి తమిళం తెలుగులో ఏజెంట్ భైరవ గా అనువాదమైంది
నేను లోకల్ కీర్తి తెలుగు
పాంబు సట్టై వేణి తమిళం
2018 అజ్ఞాతవాసి సుకుమారి తెలుగు
థానా సెర్ధా కూటమ్ మధు తమిళం తెలుగులో గ్యాంగ్ గా అనువాదమైంది
మహానటి సావిత్రి తెలుగు[8] [9]
నడిగైయర్ తిలగమ్ తమిళం
సామి స్క్వేర్ దియా తమిళం తెలుగులో సామి 2 గా అనువాదమైంది
సండ కోళి 2 దుర్గా దేవి తమిళం తెలుగులో పందెం కోడి 2 గా అనువాదమైంది
సర్కార్ నీల తమిళం తెలుగులో అదే పేరుతో అనువాదమైంది
2020 మిస్ ఇండియా తెలుగు
2021 రంగ్ దే అనుపమ తెలుగు
మరక్కార్ మళయాళం\ తెలుగు
పెద్దన్న తెలుగు
2022 గుడ్ లక్ సఖీ సఖి తెలుగు
సాని కాయితం పొన్ని తమిళం తెలుగులో చిన్ని
సర్కారు వారి పాట కళావతి తెలుగు
వాషి మాధవి మోహన్ మలయాళం
2023 దసరా వెన్నెల తెలుగు [10]
మామన్నన్ లీల తమిళం తెలుగులో నాయకుడు
భోలా శంకర్ మహాలక్ష్మి తెలుగు [11]
2024 సైరన్ కె. నందిని తమిళం [12]
రఘుతత కయల్విజి చిత్రీకరణ
రివాల్వర్ రీటా రీటా చిత్రీకరణ
కన్నివేది TBA చిత్రీకరణ
బేబీ జాన్ TBA హిందీ చిత్రీకరణ; హిందీ అరంగేట్రం

మ్యూజిక్ వీడియో మార్చు

సంవత్సరం పేరు గాయని సంగీత దర్శకుడు భాషా ఇతర విషయాలు మూలాలు
2022 గాంధారి అనన్య భట్ పవన్ సి.హెచ్ తెలుగు కోరియోగ్రఫీ - బృందా [13]

పురస్కారాలు మార్చు

జాతీయ పురస్కారం

  • 2018: జాతీయ ఉత్తమ నటి - మహానటి

సైమా అవార్డులు

మూలాలు మార్చు

  1. "Characters Which Has Scope To Perform Excites Me, Says Keerthi Menaka". www.filmibeat.com. Retrieved 18 November 2014.[permanent dead link]
  2. "Menaka was treated like a queen". Archived from the original on 2016-09-15. Retrieved 2017-01-07.
  3. "Want to play memorable roles like mom". malayalam.filmibeat.com. Retrieved 18 November 2014.
  4. "Menaka was treated like a queen". The New Indian Express. Archived from the original on 15 సెప్టెంబర్ 2016. Retrieved 18 November 2014. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  5. "One for the family". The Hindu. Retrieved 18 November 2014.
  6. Gupta, Rinku (7 April 2015). "Mayas Role Is Very Close to My Heart". The New Indian Express. Archived from the original on 2 డిసెంబర్ 2015. Retrieved 8 December 2015. {{cite news}}: Check date values in: |archive-date= (help)
  7. "Keerthy Suresh". Keerthy Suresh Height, Weight, Age, Affairs, Wiki & Facts. StarsFact. 10 November 2016. Retrieved 13 November 2016.
  8. https://www.hindustantimes.com/regional-movies/savitri-biopic-pre-look-poster-of-mahanati-released-on-women-s-day/story-VSI8Sn1n7AJuBR5BCIi2AP.html
  9. "Savitri biopic: Pre-look poster of Mahanati released on Women's Day". 8 March 2017. Retrieved 21 May 2018.
  10. Hindustantimes Telugu, Nelki Naresh (17 October 2022). "పెళ్లి కూతురు గెట‌ప్‌లో కీర్తిసురేష్ -ద‌స‌రా ఫ‌స్ట్‌లుక్ రిలీజ్‌". Archived from the original on 17 October 2022. Retrieved 17 October 2022.
  11. Namasthe Telangana (17 June 2023). "భోళా శంకర్ డబ్బింగ్‌ షురూ.. కీర్తి సురేష్ పోస్ట్‌ వైరల్‌". Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.
  12. Sakshi (9 February 2024). "కీర్తి సురేశ్ పవర్‌ఫుల్‌ పాత్రలో వస్తోన్న సైరన్". Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.
  13. Eenadu (21 February 2022). "కీర్తి సురేశ్‌ 'గాంధారి'.. డ్యాన్స్‌ చూస్తే వావ్‌ అనాల్సిందే". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.