కీలుబొమ్మలు 1965, ఏప్రిల్ 30వ తేదీన విడుదలైన తెలుగు చలనచిత్రం.

కీలుబొమ్మలు
(1965 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.ఎస్.ఆర్.రావు
నిర్మాణం పి.గంగాధరరావు
తారాగణం వాసంతి
నిర్మాణ సంస్థ హైదరాబాద్ మూవీస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

కథ మార్చు

బెంగాలీ రచయిత్రి నిరుపమాదేవి నవల అన్నపూర్ణ మందిర్ ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది. రామశేషయ్య పేద కుటుంబీకుడు. అతనికి హరి, జానకి, రాధ, కృష్ణ నలుగురు పిల్లలు. భార్య తులశమ్మ.మోహన్ రామశేషయ్యకు సహాయం చేయాలనుకుంటాడు. అయితే రామశేషయ్య ఆత్మాభిమానం అడ్డువస్తుందని తెలుసుకుని మిల్లులో ఉద్యోగం ఇప్పిస్తాడు. అన్నపూర్ణమ్మ మోహన్‌కు పిన్ని. మరో కుటుంబీకుడు అతని భార్య రంపాల రమణమ్మ. కూతురు లత. హరి లతను ప్రేమిస్తాడు. లతను మోహన్‌కిచ్చి పెళ్లి చేయాలని రమణమ్మ ఆశ. అయితే మోహన్‌కు జానకికి పెళ్లి చేయాలని అన్నపూర్ణమ్మ కోరిక. అయితే మోహన్ విరాగి. తనకు పెళ్లే వద్దని వెళ్లిపోతాడు. రామశేషయ్య దారిద్ర్యంతోను, అనారోగ్య్ంతోనూ బాధపడుతుంటాడు. పిల్లలున్న వృద్ధునకు జానకినిచ్చి పెళ్లిచేస్తాడు. అయితే ఆ వృద్ధుడు చనిపోతాడు. లతను ప్రేమించి తండ్రి మీద కోపంతో హరి ఇంటి నుండి వెళ్లిపోయి నాటకలలో చేరతాడు. లతను కూడా తీసుకుపోతాడు. జానకి పెళ్లి అయిన కొద్ది రోజులకే తుఫానులో చిక్కి రామశేషయ్య కూడా మరణిస్తాడు. మోహన్ తిరిగి వచ్చి జరిగినదంతా తెలుసుకుని విచారిస్తాడు. జమీందారు నరేంద్రబాబు జానకిని ప్రలోభపెడతాడు. తనకు లొంగక పోతే వివాహానికి తండ్రి చేసిన అప్పు కింద ఇల్లు వేలం వేయిస్తానని బెదిరిస్తాడు. జానకి రేపు వస్తానని మాట ఇస్తుంది. జమీందారు ఇంటిపై అప్పు తీర్చడానికి డబ్బు ఇస్తాడు. ఆ డబ్బు జానకి రాధకిస్తుంది. ఆ రోజు రాత్రి జానకి మోహన్‌కు లేఖ వ్రాస్తుంది. తన కుటుంబాన్ని ఆదుకోమని అభ్యర్థిస్తుంది. మరుసటి రోజు ఇంటిని వేలం వేయడానికి పదిమంది వస్తారు. జానకి చనిపోయి ఉంటుంది. రాధకు మోహన్ ఏదో సంబంధం కుదిర్చి వివాహం నిశ్చయిస్తాడు. ఆ పెళ్లి పీటలమీద ఆగిపోతుంది. మోహన్ రాధను పెళ్లి చేసుకుంటాడు.[1][2]

పాటలు మార్చు

పాట రచయిత సంగీతం గాయకులు
పిల్లనగ్రోవిగ మారితిరా ఎస్.పి.కోదండపాణి పి.సుశీల
బొట్టూ కాటుక పెట్టుకుని ఎస్.పి.కోదండపాణి పి.సుశీల

కలికి సుఖములు . పద్యం ఎస్. పి. కోదండపాణి. ఘంటసాల. ఆరుద్ర.

రంగుల రాట్నమై. పద్యం ఎస్.పి.కోదండపాణి.

ఘంటసాల.ఆరుద్ర

పురస్కారాలు మార్చు

  • 1964లో రెండవ ఉత్తమ తెలుగు చిత్రంగా రజత నంది పురస్కారం పొందింది.
  • 1965లో ఐర్లాండ్ లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్సితమైనది .

మూలాలు మార్చు

  1. రూపవాణి (2 May 1965). "చిత్రసమీక్ష:కీలుబొమ్మలు". ఆంధ్రప్రభ దినపత్రిక. Retrieved 30 July 2020.[permanent dead link]
  2. రామకృష్ణ (2 May 1965). "చిత్ర సమీక్ష: కీలుబొమ్మలు". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Retrieved 30 July 2020.[permanent dead link]

బయటి లింకులు మార్చు