కుందాద్రి భారతదేశం, కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలో ఉన్న పశ్చిమ కనుమలలో దట్టమైన అడవులతో కూడినకొండ ప్రదేశం.(ఎత్తు 826 మీ). ఇది ఉడిపి నగరం నుండి 70 కి.మీ.దూరంలో ఉంది. 17 వ శతాబ్దానికి చెందిన జైన దేవాలయానికి తీర్థంకరకు ఈ కొండ అంకితం చేయబడింది. ఈప్రదేశం పూర్వ శతాబ్దాలలో కుందకుందాచార్యుడికి ఆశ్రయం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఆలయంలోని ప్రధాన దేవతమూర్తి 23 వ తీర్థంకర పార్శ్వనాథుడు. ఈ ఆలయానికి ఒక వైపున రాతితో ఏర్పడిన రెండు చిన్నచెరువులు పూర్వం ఋషులకు నీటిని అందించాయి. అన్నివాతావరణాలలో దర్శించటానికి కొండపైకి రహదారిని నిర్మించడానికి కర్ణాటక ప్రభుత్వం ముంబై నుండి వచ్చిన సహాయకులతో చేతులు కలిపింది.[1] [2]

కుందాద్రి
Kannada: ಕುಂದಾದ್ರಿ
కుందాద్రి కొండలు
కుందాద్రి కొండలు
అత్యంత ఎత్తైన బిందువు
ఎత్తు826 m (2,710 ft)
నిర్దేశాంకాలు13°33′27″N 75°10′13″E / 13.55750°N 75.17028°E / 13.55750; 75.17028
భౌగోళికం
కుందాద్రి is located in Karnataka
కుందాద్రి
కుందాద్రి
కర్ణాటకలో ప్రాంత ఉనికి

చరిత్ర మార్చు

రెండు వేల సంవత్సరాల క్రితం,కుందకుందాచార్య అనే జైనఋషి ఇక్కడే ఉండి, ఈ జైన పవిత్ర స్థలం ఏర్పడటానికి కారకుడైయినట్లుగా తెలుస్తుంది.[1] జైనఋషుల రాతివిగ్రహాలతో ఒక ఆలయం నిర్మించబడింది. ఈప్రదేశం ఏకాంతంగా ఉన్నందున, నిధిని దాచిఉంటారని కనుగొనడానికి దుండగులు ఆలయాన్ని కొంతభాగం ధ్వంసం చేసారు.[3]

రవాణా మార్చు

కుందాద్రి దాదాపు జిల్లాకేంద్రం, షిమోగా నుండి 80 కి.మీ.దూరంలో, తీర్థహళ్లి పట్టణం నుండి దాదాపు 20 కి.మీ.దూరంలో ఉంది. షిమోగా నుండి, జాతీయ రహదారి-13 ద్వారా తీర్థహళ్లి చేరుకోవాలి. అక్కడ నుండి స్టేట్ హైవే -1 (అగుంబే రోడ్డు) ద్వారా గుడ్డేకరి వరకు వెళ్లి, ఆపై ఎడమవైపుకు మలుపు తీసుకోవాలి. బెంగళూరు నుండి తీర్థహళ్లికి మొత్తం దూరం 332 కి.మీ.దూరం ఉంది. మంగళూరు నుండి జాతీయ రహదారి-13 లో తీర్థహళ్లి చేరుకోవచ్చు. మంగళూరు నుండి తీర్థహళ్ళికి దాదాపు146 కి.మీ.దూరం ఉంది. ఉడిపి నుండి తీర్థహళ్లికి అనేక చిన్న మోటారు వాహనాలు ఉన్నాయి. ఉడిపి రైల్వే స్టేషను నుండి తీర్థహళ్లికి 86 కి.మీ.దూరం ఉంది. దీనికి సమీప రైల్వే స్టేషను షిమోగాలో ఉంది. దీనికి సమీప విమానాశ్రయం మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం.

చిత్ర మాలిక మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Fernadis, Ronald Anil (30 September 2009). "On top of the world". Deccan Herald. Retrieved 3 October 2014.
  2. Veerendra, P.M. (29 November 2011). "Agumbe to be declared plastic-free zone". The Hindu. Retrieved 3 October 2014.
  3. Staff Reporter (7 November 2011). "Statue in front of Jain temple damaged". The Hindu. Retrieved 3 October 2014.