కుతుబ్ షాహీ సమాధులు

" కుతుబ్ షాహి సమాధులు " హైదరాబాద్ లోని ప్రసొద్ధమైన గోల్కొండకోట సమీపంలో ఇబ్రహీం బాఘ్ (ప్రిసింక్ట్ గార్డెన్) వద్ద ఉన్నాయి. ఇక్కడ కుతుబ్ షాహి రాజవంశానికి చెందిన పలువురు రాజులు నిర్మించిన సమాధులు, మసీదులు ఉన్నాయి. చిన్న సమాధుల వరుసలు ఒక అంతస్తులో ఉండగా పెద్ద సమాధులు రెండు అంతస్తులలో ఉన్నాయి.[1] ఒక్కొక్క సమాధి మద్యభాగంలో శవపేటిక దానికింద నేలమాళిగ ఉంటాయి. సమాధిపై గోపురం మీద నీలి, ఆకుపచ్చని టైల్స్ అలంకరించబడి ఉంటాయి. ఇప్పుడు కొన్ని ముక్కలు మాత్రమే మిగిలి ఉన్నాయి.[2]

Qutb Shahi tombs
Tomb of Hayath Bakshi Begum
కుతుబ్ షాహీ సమాధులు is located in Telangana
కుతుబ్ షాహీ సమాధులు
Location in Telangana
ప్రదేశంGolconda, Hyderabad
రకంtomb
నిర్మాణం ప్రారంభం1543
అంకితం చేయబడినదిQutb Shahi Dynasty

ప్రదేశం మార్చు

 
గోల్కొండ కోటనుండి కుతుబ్‌షాహీ సమాధుల దృశ్యం

ఈ సమాధులు గోల్కొండ కోట ఉత్తరాన ఒక కిలోమీటర్ దూరంలో ఇబ్రహీం బాఘ్ వద్ద ఉన్నాయి.

వివరణ మార్చు

సమాధుల సమూహం విశాలమైన ఎత్తైన వేదిక మీద నిర్మించబడ్డాయి. సమాధులు గోపురాలు చదరమైన వేదికమీద ఆర్చీల మద్య అమర్చబడ్డాయి. సమాధులు విభిన్నమైన శైలిలో పర్షియన్, పాష్టన్, హిందూ సంప్రదాయాల మిశ్రితంగా నిర్మించబడ్డాయి. సమాధుల మీద నిర్మించిన నిర్మాణం జటిలమైన రాతిచెక్కడాలతో అలంకరించబడ్డాయి. సమాధుల చుట్టూ అందమైన పూదోటలు ఏర్పాటుచేయబడ్డాయి.[3] సమాధులు ఒకప్పుడు కార్పెట్లు, షాండ్లియర్లు, వెండిజలతారుతో అలంకరించిన వెల్వెట్ తెరలతో అలంకరించబడ్డాయి. కురాన్ లోని భాగాలు చెక్కడిన ఫలకాలతో అలకంరించబడిన గోడలను పర్యాటకులు చదువుతూ ముందుకు కదులుతూ ఉంటారు. రాజకుటుంబానికి చెందిన ఇతర కుటుంబ సభ్యుల సమాధులు, సుల్తాన్ సమాధుల భేదాలను గుర్తించడానికి సుల్తాన్ సమాధి మీద విభిన్నమైన బంగారు చట్రాలు బిగించబడ్డాయి.

చరిత్ర మార్చు

కుతుబ్ షాహి కాలంలో ఈ సమాధులు గొప్పగా ఆరాధించబడ్డాయి. వారి పాలన తరువాత సమాధులు నిర్లక్ష్యానికి గురైయ్యాయి. 19వ శతాబ్దంలో మూడవ సాలార్ జంగ్ సమాధులను పునరుద్ధరించమని ఆదేశించాడు. తరువాత సమాధుల చుట్టూ పూదోట ఏర్పాటు చేసి దానిచుట్టూ గోడ నిర్మించబడింది. మరొకసారి తిరిగి కుతుబ్ షాహి సమాధుల ప్రదేశం సుందర పర్యాటక ప్రాంతంగా మారింది. చివరి కుతుబ్ షాహి మినహా కుతుబ్ షాహి వంశ సభ్యులందరూ ఇక్కడ సమాధి చేయబడ్డారు.

సుల్తాన్ కులీ కుతుబ్ ముల్క్ మార్చు

" సుల్తాన్ కులీ కుతుబ్ ముల్క్" సమాధి తన వంశస్థుల సమాధుల నిర్మాణశైలికి ఉదాహరణగా నిలిచింది. ఎలివేటెడ్ టెర్రస్ ఒక్కొకవైపు 30 మీ. కొలతతో నిర్మించబడింది. సమాధి శాల అష్టకోణ నిర్మాణం. ఒక్కొక భుజం కొలత10 మీ. ఉంటుంది. మొత్తం నిర్మాణానికి గుండ్రని గోపురం ఉంటుంది. సమాధి గదిలో మూడు సమాధులు ఉన్నాయి. సమీపంలోని టెర్రస్‌లో 21 సమాధులు ఉన్నాయి. ప్రధాన సమాధి మినహా మిగిలిన అన్నింటిమీద సుల్తాన్ కులీతో వారికున్న అనుబంధం వివరణ సంబంధిత అక్షరాలు చెక్కబడి ఉన్నాయి.ఈ సమాధిని సుల్తాన్ జీవించి ఉన్న సమయంలో వారి సంప్రదాయాన్ని అనుసరించి 1953లో సుల్తాన్ కులీ కుతుబ్ ముల్క్‌చే నిర్మించబడింది.

జంషీద్ మార్చు

సుల్తాన్ కులీ సమాధి సమీపంలో కుమారుడు (కుతుబ్ షాహి వంశానికి రెండవ వారసుడు) జంషీద్ సమాధి ఉంది. ఇది సా.శ. 1550లో నిర్మించబడింది. ఈ సమాధులలో మెరిసే నల్లరాతితో అలకరించబడని సమాధి ఇది ఒక్కటే. గార్డెన్‌లో ఉన్న ఇతర సమాధులకు ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మిగిలిన రాజుల సమాధుల కంటే భిన్నంగా ఇది రెండు అతస్థులకు నిర్మించబడింది. ఎలాంటి వాక్యాలు లేక వ్రాతలు చెక్కబడని ఒకేఒక సమాధులలో జంషీద్ కులీ కుతుబ్ షాహ్‌ సమాధి ఒకటి. జంషీద్ కుమారుడు సుభాన్ సమాధి మీద కూడా ఎలాంటి అక్షరాలు చెక్కబడ లేదు. సుభాన్ కులీ కుతుబ్ షాహ్ స్వల్పకాలం మాత్రమే పాలన సాగించాడు. సుభాన్ సమాధి ఆయన తండ్రి, తాత సమాధుల మద్యన నిర్మించబడింది.ఆయనను చోటే మాలిక్ (చిన్న యజమాని) అని పిలిచేవారు.

ఇబ్రహీం కులీ మార్చు

సుల్తాన్ " ఇబ్రహీం కులీ కుతుబ్ షాహ్ " సమాధి 1580లో (ఆయన మరణించిన తరువాత) నిర్మించబడింది. సుల్తాన్ కులీ కుతుబ్ సమాధి కంటే ఇది స్వల్పంగా పెద్దది. గోపురం మీద అలంకరించబడిన ఎనామిల్ టైల్స్ ఇప్పటికీ దక్షిణం వైపు గోడమీద కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమాధి ప్రధాన చాంబర్‌లో రెండు సమాధులు, టెర్రస్ మీద 16 సమాధుకు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆయన 6 గురు కుమారులు, 3 కుమార్తెలవి ఉన్నాయి. సమాధుల మీద అన్ని వైపులా తులూ భాషలో వివరాలు చెక్కబడి ఉన్నాయి. దస్తూరి నిపుణులు ఇస్ఫాలన్, ఇస్మాయిల్, తక్వియుద్దీన్ ముహమ్మద్ సాలిహ్ (నాక్ష్, తులూ, నస్తాలిక్ భాషా అక్షరాలు చెక్కే దుకాణాలు నడిపినవారు, నగరంలోని కుతుబ్ షాహి కట్టడాల మీద అక్షరాలు చెక్కినవారు) ఇబ్రహీం షాహ్ సమకాలీనులు.

ముహమ్మద్ కులీ కుతుబ్ షాహ్ మార్చు

సుల్తాన్ ముహమ్మద్ కులీ కుతుబ్ షాహ్ కుతుబ్ షాహీ సమాధులలో పెద్ద సమూహమని భావిస్తున్నారు. ఇది 1602లో నిర్మించబడింది. ఈ సమాధి 65చ.మీ వైశాల్యం 4 మీ ఎత్తు. సమాధిని చేరడానికి సోపానాలు నిర్మించబడ్డాయి. సమాధి వెలుపలి భాగం 22 చ.మీ. లోపలి వైపు 11చ.మీ ఉంటుంది. దక్షిణం, తూర్పు వైపు ద్వారాలు ఉన్నాయి. సమాధి మీద పర్షియన్, నాక్ష్ అక్షరాలు చెక్కబడి ఉన్నాయి.

ముహమ్మద్ కుతుబ్ షాహ్ మార్చు

ఇతర ప్రధాన సమాధులలో 6 సుల్తాన్ ముహమ్మద్ కుతుబ్ షాహ్ సమాధి ఒకటి. ఈ సమాధి ముఖభాగం ఒకప్పుడు ఎనామిల్డ్ టైల్స్‌తో అలంకరించబడి ఉండేది. అయినప్పటికీ టెర్రస్ మీద మాత్రమే అవి ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్న 6 సమాధుల మీద తులు, నాక్ష్ అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. ఈ సమాధి 1626లో నిర్మించబడింది. రాజకుటుంబానికి చెందిన సమాధులలో సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షాహ్ సమాధి చివరిది. చివరి కుతుబ్ షాహి వంశస్థుడు " అబ్దుల్ హాసన్ కుతుబ్ షాహ్ " (తానా షాహ్), దౌలతాబాద్ చెరశాలలో ఖైదీగా ఉండి మరణించాడు.

 
కుతుబ్‌షాహీ సమాధుల సముదాయంలో ఉన్న ప్రసిద్ధ మస్జిద్

ఫాతిమా సుల్తాన్ మార్చు

ఫాతిమా సుల్తాన్ సమాధి గోపురం సమాధి గార్డెన్ ప్రవేశ ద్వారం పక్కనే ఉంటుంది. ఫాతిమా ముహమ్మద్ కుతుబ్ షాహ్ సహోదరి. ఆమె సమాధివేదికలో పలు సమాధులు ఉన్నాయి. వీటిలో రెండు మీద అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. ముహమ్మద్ కులీ సమాధికి దక్షిణంలో మూడు సమాధులు ఉన్నాయి. ఇక్కడ కుల్తూం సమాధి (ముహమ్మద్ కుతుబ్ షాహ్ మనుమరాలు) ఉంది. కుల్తుం సుల్తాన్‌కు అత్యంత ప్రీతిపాత్రమైన భార్య కుర్షిద్ బీబి కుమారుని కుమార్తె. కుల్తుం భర్త, కుమార్తె సమాధులు కూడా ఇక్కడ ఉన్నాయి.

రాజమంశానికి చెందని సమాధులు మార్చు

సుల్తాన్ అబ్దుల్లా అభిమాన వైద్యులు (హకీం) నిజాముద్ధీన్ అహమ్మద్ గిలానీ, అబ్దుల్ జబ్బర్ గిలానీలకు ఇక్కడ 1651లో జంటగా సమాధులు నిర్మించబడ్డాయి. కులీ కుతుబ్ షాహీ సమాధులలో కొన్ని రాజకుటుంబానికి చెందని వాటిలో ఇవి ఉన్నాయి. మరొక జంట సమాధులు ప్రేమమతి, తారామతికి చెందినవి. సుల్తాన్ అబ్దుల్లా షాహ్‌కు ప్రీతిపాత్రమైన ఈ ఇద్దరు వేశల సమాధులు ఆయనకు సమీపంలో సమాధి చేయబడ్డారు. కుతుబ్ షాహి కుటుంబానికి చెందని సమాధులలో నెక్నం ఖాన్ సమాధి ఒకటి. నెక్నం ఖాన్ అబ్దుల్లా సైన్యంలో కర్నాటకా సైన్యానికి అధ్యక్షత వహించాడు. ఇబ్రహీం కుతుబ్ షాహ్ సమాధి వేదిక నిర్మించబడిన ఈ సమాధి నెక్నం ఖాన్ మరణించిన రెండు సంవత్సరాల తరువాత 1672లో నిర్మించబడింది.

అబ్దుల్ హాసన్ మార్చు

చివరి కుతుబ్ షాహి సుల్తాన్ అబ్దుల్ హాసన్ సమాధి ఆయన జీవించి ఉన్న సమయంలో ఆయనచేత స్వయంగా నిర్మించబడింది. అయినప్పటికీ ఇక్కడ మిర్ అహ్మద్ సమాధిచేయబడ్డాడు. మిర్ అహ్మద్ సుల్తాన్ అబ్దుల్లా అల్లుని కుమారుడు. సుల్తాన్ అబ్దుల్లా కుమార్తెలలో ఒకతే అయిన ఖనుం సమాధి ఆమె భర్త మిర్ అహ్మద్ సమాధి ప్రక్కన నిర్మించబడింది.

హజారత్ హుస్సేన్ షాహ్ వాలి మార్చు

సమాధుల పశ్చిమ భాగంలో ప్రఖ్యాత సూఫీ సన్యాసి " హజారత్ హుస్సేన్ షాహ్ వాలి " మసీదు ఉంది. 1562లో హుస్సేన్ సాగర్ నిర్మించి హజారత్ హుస్సేన్ షాహ్ వాలి ప్రజల మనసులో చిరస్థాయిగా ఆరాధ్యనీయుడు అయ్యాడు. ఈ గార్డెన్‌లో ఉన్న సమాధులు కాని నిర్మాణాలలో మార్చురీ బాత్ (శవాలకు స్నానంచేయించే ప్రదేశం), హయత్ భక్షీ బేగం మసీదు ప్రధానమైనవిగా ఉన్నాయి.

మార్చురీ బాత్ మార్చు

మార్చురీ బాత్ ముహమ్మద్ కులీ సమాధికి ఎదురుగా నిర్మించబడింది. రాజులు, వారి కుటుంబ సభ్యుల శరీరాలు చివరిసారిగా విశ్రాంతస్థానానికి తీసుకుని వెళ్ళేముందు శరీరాలకు స్నానం చేయించే సంప్రదాయం నిర్వహించడానికి వసతిగా సుల్తాన్ కులీ కుతుబ్ షాహ్ దీనిని నిర్మించాడు. రాకుటుంబ సభ్యుల శరీరాలను బంజారా ద్వారం నుండి వెలుపలకు తీసుకు వచ్చి ఇక్కడ స్నానం చేయించి తరువాత సంప్రదాయబద్ధంగా సమాధి చేయబడుతుంది. ఈ సంప్రదాయం చూడడానికి బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరౌతూ ఉంటారు.పురాతన పర్షియన్, టర్కిష్ విధానం అనుసరించి స్నానవిధులు ఆచరించబడుతుంటాయి.

మసీదులు మార్చు

కుతుబ్ షాహీలు గోల్కొండ, హైదరాబాదు ప్రాంతాలలో పలు మసీదులు నిర్మించారు. ప్రతిసమాధి ప్రక్కన ఒక మసీదు నిర్మించబడి ఉంటుంది. వీటిలో అతిపెద్దది, అద్భుతమైనది హయత్ బక్షీ బేగం సమాధి ప్రక్కన నిర్మించబడింది. 1666లో నిర్మించబడిన ఈ మసీదు " గోల్కొండ సమాధుల మసీదు "గా ప్రాబల్యత సంతరించుకుంది. మసీదు పైకప్పులో 15 గుమ్మటాలు అలంకరించబడ్డాయి. ప్రార్ధానా మందిరం రెండు ఎత్తైన మినార్లతో అలంకరించబడి ఉంది.ఇవి కళాత్మక దస్తూరీతో అందంగా అలంకరించబడి ఉన్నాయి.

హయత్ బక్షీ బేగం మార్చు

హయత్ బక్షీ బేగం ముహమ్మద్ కులీ కుతుబ్ షాహ్ కుమార్తె. ఐదవ కుతుబ్ షాహ్ ముహమ్మద్ కుతుబ్ షాహ్ భార్య. ఆరవ సుల్తాన్, ఏడవ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షాహ్ తల్లి. ఆమెను ప్రేమగా " మా షాహెబా " అని పిలిచేవారు. కుతుబ్ షాహి పాలకుల కాలంలో గోల్కొండ సుల్తానుల సమాధి తోట " లాగర్ - ఈ - ఫెయిజ్ అతర్ " (ఆహ్లాదకర ప్రాంతం) గా గుర్తించబడింది. ఇక్కడ పేదలను ఆహ్లాదపరచడానికి సంగీతం, నృత్యం, నాటకం వంటి ఉచిత ప్రదర్శనలు ప్రదర్శించబడుతుంటాయి.

ఇతర వివరాలు మార్చు

  1. కుతుబ్‌షాహీ సమాధులకు సమీపంలో దక్కన్ ఉద్యానవనం కూడా ఉంది.[4]

చిత్రమాలిక మార్చు

ఇవి కూడా చూడండి మార్చు

మూలాల జాబితా మార్చు

  1. Namasthe Telangana (27 November 2022). "నగర బావులకువిశ్వఖ్యాతి". Archived from the original on 27 November 2022. Retrieved 27 November 2022.
  2. Restoration of Quli Qutub Shahi tombs
  3. Archaeology Dept. increases security at Qutb Shahi tombs
  4. నవ తెలంగాణ, హైదరాబాదు (17 January 2017). "నగరవాసులకు అందుబాటులోకి దక్కన్‌ పార్క్‌". NavaTelangana. Archived from the original on 16 June 2020. Retrieved 15 June 2020. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 15 జూన్ 2020 suggested (help)

వెలుపలి లింకులు మార్చు