కురసాల కన్నబాబు

ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు

కురసాల కన్నబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వ్య‌వ‌సాయం, స‌హ‌కార శాఖ‌ మంత్రిగా పని చేశాడు.[4]

కురసాల కన్నబాబు

వ్య‌వ‌సాయం, స‌హ‌కార శాఖ‌
పదవీ కాలం
8 జూన్ 2019[1] – 2022 ఏప్రిల్ 10[2]
ముందు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

ఎమ్మెల్యే
పదవీ కాలం
23 మే 2019 – ప్రసుతం
ముందు పిల్లి అనంతలక్ష్మి
నియోజకవర్గం కాకినాడ గ్రామీణ
పదవీ కాలం
2009 – 2014
తరువాత పిల్లి అనంతలక్ష్మి
నియోజకవర్గం కాకినాడ గ్రామీణ

వ్యక్తిగత వివరాలు

జననం 1970
రమణయ్యపేట, కాకినాడ , ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, ప్రజా రాజ్యం పార్టీ
జీవిత భాగస్వామి కురసాల శ్రీవిద్య
బంధువులు కురసాల సురేష్‌బాబు,[3] కురసాల కళ్యాణ్ కృష్ణ
సంతానం సిరి
నివాసం వైద్య నగర్‌, రమణయ్యపేట,కాకినాడ , ఆంధ్రప్రదేశ్

జననం, విద్యాభాస్యం మార్చు

కురసాల కన్నబాబు 1970లో కురసాల సత్యనారాయణ, కృష్ణవేణి దంపతులకు తూర్పు గోదావరి జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ , రమణయ్యపేటలో జన్మించాడు.ఆయన వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ (సోషియాలజీ), హైదరాబాద్ అంబేద్కర్ యూనివర్సిటీ నుండి ఎంఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) పూర్తి చేశాడు.కన్నబాబు ఈనాడు పత్రికలో 18 సంవత్సరాల పాటు జర్నలిస్ట్ గా పని చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

కురసాల కన్నబాబు 2009లో ప్రజా రాజ్యం పార్టీ ద్వారా రాజకీయాలోకి వచ్చి, కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. ఆయన 2012లో ప్రజారాజ్యం పార్టీని, కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేయడంతో ఆయన కాంగ్రెస్ పార్టీ లో చేరాడు. కన్నబాబు 2014లో కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు.[5] ఆయన 28 జనవరి 2016లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కన్నబాబు 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నుండి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పిల్లి అనంతలక్ష్మి పై 8,789 ఓట్ల మెజారిటీతో గెలిచి,[6] వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో వ్య‌వ‌సాయం, స‌హ‌కార శాఖ‌ మంత్రిగా పని చేశాడు.[7][8]

మూలాలు మార్చు

  1. TV5 News (8 June 2019). "ఏపీ మంత్రుల ప్రొఫైల్." (in ఇంగ్లీష్). Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Prajasakti (10 April 2022). "రాజీనామాలను ఆమోదించిన గవర్నర్". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  3. Sakshi (12 July 2019). "శోక సంద్రం.. కన్నబాబు నివాసం". Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.
  4. Sakshi (2019). "Kakinada rural Constituency Winner List in AP Elections 2019". www.sakshi.com. Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.
  5. Sakshi (18 March 2019). "తూర్పు గోదావరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రొఫైల్స్‌". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.
  6. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  7. 10 TV (5 November 2020). "వందేళ్ల తర్వాత : ఏపీలో జనవరి నుంచి సమగ్ర భూ సర్వే". 10TV (in telugu). Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  8. Sakshi (8 June 2019). "'తూర్పు'కే పెద్దపీఠం". Archived from the original on 18 January 2024. Retrieved 18 January 2024.