కుల గౌరవం 1972లో విడుదలైన తెలుగు సినిమా. రామకృష్ణ ఎన్.ఎ.టి కంబైన్స్ పతాకంపై ఎన్. త్రివిక్రమ రావు నిర్మించిన ఈ సినిమాకు పేకేటి శివరాం దర్శకత్వం వహించాడు.[1] ఎన్.టి.రామారావు , జయంతి, ఆరతి ప్రధాన పాత్రలలో నటించగా, టి.జి.లింగప్ప సంగీతాన్నందించాడు.[2] ఈ సినిమాలో తాత, తండ్రి, మనుమడిగా త్రిపాత్రాభినయంలో ఎన్.టి.రామారావు నటించాడు. లర్ ఫిల్మ్స్ యుగంలో కూడా ఇది నలుపు& తెలుపు చిత్రంగా తయారు చేయబడింది.

కులగౌరవం
(1972 తెలుగు సినిమా)
దర్శకత్వం పేకేటి శివరాం
తారాగణం నందమూరి తారక రామారావు,
జయంతి
సంగీతం టి.జి.లింగప్ప
నిర్మాణ సంస్థ రామకృష్ణ ఎన్.ఎ.టి. కంబైన్స్
భాష తెలుగు

కథ మార్చు

జమీందర్ రాజా రామచంద్ర బహదూర్ (ఎన్. టి. రామారావు) కుటుంబ ప్రతిష్టకు, ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇస్తాడు. అదే సమయంలో, అతను స్వచ్ఛంద సంస్థలకు నెలకొల్పాడు. అతని కుమారుడు రఘునాథ ప్రసాద్ (మళ్ళీ ఎన్. టి. రామారావు) దేశభక్తిపై బలమైన నమ్మకం గల వ్యక్తి. ఒకసారి అతను సీత (జయంతి) ప్రేమలో పడతాడు. కాని రామచంద్ర బహదూర్ వారి వివాహాన్ని వ్యతిరేకిస్తాడు, కాబట్టి, రఘు ఇంటిని వదిలిపెట్టి ఆమెను వివాహం చేసుకుంటాడు. సమయం గడిచిపోతుంది, ఈ జంట ఒక పసికందు, శంకర్ కు జన్మనిస్తారు. ఆ సమయంలో, రామచంద్ర బహదూర్ తన కొడుకు, మనవడు కోసం నిరాశకు గురవుతాడు. అది గమనించిన దివాన్ వక్రమైన ప్రణాళికలు చేస్తాడు. దీని ద్వారా రఘు సీతను అనుమానిస్తాడు. తన కొడుకును తీసుకొని ఇంటి నుండి బయలుదేరుతాడు. హృదయ విదారక సీత ఆమె పవిత్రతను నిరూపించుకోవాలని నిర్ణయించుకుంటుంది. రఘు తన పేరు మార్చుకుని కూలీగా పనిచేస్తూ తన కొడుకుని చదివిస్తూంటాడు. అదే విధంగా రఘును వెదుకుతూ వెళుతున్న సీత రైలులో మూర్చపోతే కాంట్రాక్టర్ రక్షిస్తాడు. కాంట్రాక్టర్ తమతో పాటు ఉండాలని కోరడంతో అతని కుమార్తె రాధకు చూసుకోవడానికి సీత అక్కడ చేరుతుంది. సంవత్సరాలు గడిచేకొద్దీ, శంకర్ (మరోసారి ఎన్.టి.రామారావు) డాక్టర్ అయ్యాడు. మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నాడు. .రాధా (ఆర్తి) కూడా అదే కాలేజీలో చదువుతుంది. వారు ఒకరినొకరు ప్రేమించుకుంటారు.

అక్కడ, రాజా రామచంద్ర బహదూర్ అనారోగ్యంతో, మానసికంగా కలత చెందుతాడు. ఒకరోజు సీతకు అనారోగ్యం కలిగినప్పుడు రాధ శంకర్ ను పిలుస్తుంది. అప్పుడు శంకర్ తన తల్లిని గుర్తిస్తాడు. కానీ తన తండ్రి ఆమోదించే వరకు అతను ఆమెను కలవడానికి ఇష్టపడడు. మిగిలిన కథలో శంకర్ తన తాతకు గుణపాఠం నేర్పి తన తల్లిదండ్రులను కలుపుతాడు.

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • సంభాషణలు: సముద్రాల జూనియర్
  • సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, కోసరాజు
  • సంగీతం: టి.జి.లింగప్ప
  • ఛాయాగ్రహణం: మార్కస్ బార్ట్లే
  • కళ: ఎస్.కృష్ణారావు
  • నిర్మాత: ఎన్. త్రివిక్రమ రావు
  • దర్శకుడు: పెకేటి శివరం
  • స్క్రీన్-ప్లే, పర్యవేక్షణ: నందమూరి తారక రామారావు
  • బ్యానర్: NAT / RK
  • విడుదల తేదీ: 18 అక్టోబర్ .
  • పాటలు: మాతృత్వం లోనే ఉంది ఆడజన్మ.ఘంటసాల, సుశీల.రచన: కొసరాజు.
  • హాల్లో హెల్లొ డాక్టరు , ఘంటసాల , సుశీల రచన: కొసరాజు.

మూలాలు మార్చు

  1. "Kula Gowravam (Cast & Crew)". Chitr.com.[permanent dead link]
  2. "Kula Gowravam (Review)". gomolo.com. Archived from the original on 2018-06-12. Retrieved 2020-08-24.
"https://te.wikipedia.org/w/index.php?title=కులగౌరవం&oldid=3960140" నుండి వెలికితీశారు