కుల్సమ్ బేగం మసీదు (కార్వాన్)

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కార్వాన్‌ ప్రాంతంలో ఉన్న మసీదు

కుల్సమ్ బేగం మసీదు (కుల్సుంపూరా మసీదు లేదా జామా మసీదు కార్వాన్) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కార్వాన్‌ ప్రాంతంలో ఉన్న మసీదు. దీనిని 17వ శతాబ్దంలో సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, హయాత్ బక్షీ బేగంల కుమార్తె కుల్సమ్ బేగం నిర్మించింది.[1][2][3][4]

కుల్సమ్ బేగం మసీదు

కుల్సమ్ బేగం మసీదు (ఛాయాచిత్రం: గులాం యజ్దానీ (1940))

ప్రదేశం కార్వాన్‌, హైదరాబాదు, భారతదేశం
నిర్మాణ సమాచారం
మీనార్/మీనార్లు 2
భవన సామాగ్రి గ్రానైట్, సున్నం, మోర్టార్

చరిత్ర - నిర్మాణం మార్చు

వివాహ సమయంలో తన భర్త గౌరవ చిహ్నంగా ఇచ్చిన డబ్బు లేదా బహుమతితో కుల్సమ్ బేగం ఈ మసీదు నిర్మాణం చేసిందని మసీదు కమిటీ సభ్యుల అభిప్రాయం. నగరంలోని ఇతర కుతుబ్ షాహి మసీదుల నిర్మాణాల మాదిరిగానే సా.శ. 1612-1626 మధ్యకాలంలో ఈ మసీదు నిర్మించబడింది. మూడు అడుగుల ఎత్తైన పునాదిపై నిర్మించిన ఈ మసీదు ముందుభాగంలో మూడు వంపులు కలిగిన తోరణం ఉంది. ముందుభాగంలో ఉన్న రెండు స్తంభాలు భారీగా అలంకరించబడి ఉన్నాయి. మసీదు గోడప్రక్కన రెండు చిన్న వంపు మంటపాలు అదనంగా నిర్మించబడ్డాయి. మసీదు నిర్మాణానికి సరిగ్గా సంబంధించిన శాసనాలు లేవు.[5]

మూలాలు మార్చు

  1. Bilgrami, Syed Ali Asgar (1927). Landmarks of the Deccan. pp. 144–146.
  2. "Kulsum Begum's memory erodes with masjid cracks - Times of India". The Times of India. Retrieved 15 April 2020.
  3. Varma, Dr. Anand Raj. "Qutb Shahi architecture, art, pride of Deccan". Telangana Today. Retrieved 15 April 2020.
  4. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (3 April 2016). "కార్వాన్: అంగళ్ల రతనాలు అమ్మినారిచట!". పరవస్తు లోకేశ్వర్. Archived from the original on 28 మే 2019. Retrieved 18 April 2020.
  5. Khalidi, Omar. A Guide to Architecture in Hyderabad, Deccan, India (PDF). p. 47. Archived from the original (PDF) on 2020-03-13. Retrieved 2020-04-15.