కైలాష్ నాథ్ కట్జూ

భారతీయ రాజకీయవేత్త

కైలాష్ నాథ్ కట్జూ, (1887 జూన్ 17- 1968 ఫిబ్రవరి 17) భారతదేశ ప్రముఖ రాజకీయ నాయకుడు. అతను ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ గవర్నర్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర హోం మంత్రి, కేంద్ర రక్షణ మంత్రి పదువులు నిర్వహించాడు.అతను భారతదేశ ప్రముఖ న్యాయవాదులలో ఒకడు.అతని కాలం లోని కొన్ని ముఖ్యమైన కేసులలోభారత జాతీయ సైన్యం ట్రయల్స్ తో సహా ఒక ఒకభాగం. కట్జూ ప్రారంభంలోనే భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చేరాడు. తన కార్యకలాపాల కోసం తోటి స్వాతంత్ర్య కార్యకర్తలతో చాలా సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు.

Kailash Nath Katju
కైలాష్ నాథ్ కట్జూ


పదవీ కాలం
31 January 1957 – 11 March 1962
గవర్నరు Bhogaraju Pattabhi Sitaramayya
Hari Vinayak Pataskar
ముందు Bhagwantrao Mandloi
తరువాత Bhagwantrao Mandloi
నియోజకవర్గం Jaora

పదవీ కాలం
10 January 1955 – 30 January 1957
ప్రధాన మంత్రి Jawaharlal Nehru
ముందు Baldev Singh
తరువాత V. K. Krishna Menon

పదవీ కాలం
25 October 1951 – 10 January 1955
ప్రధాన మంత్రి Jawaharlal Nehru
ముందు C. Rajagopalachari
తరువాత Govind Ballabh Pant

పదవీ కాలం
21 June 1948 – 1 November 1951
ముందు C. Rajagopalachari
తరువాత Harendra Coomar Mookerjee

పదవీ కాలం
15 August 1947 – 20 June 1948
ముందు Chandulal Madhavlal Trivedi
తరువాత Asaf Ali

వ్యక్తిగత వివరాలు

జననం (1887-06-17)1887 జూన్ 17
Jaora, Jaora State, Malwa Agency, British India
(present-day Madhya Pradesh, India)
మరణం 1968 ఫిబ్రవరి 17(1968-02-17) (వయసు 80)
Prayagraj, Uttar Pradesh, India
జాతీయత Indian
రాజకీయ పార్టీ Indian National Congress
జీవిత భాగస్వామి Rup Kishori
సంతానం 5; including Shiva Nath Katju
పూర్వ విద్యార్థి Allahabad University
వృత్తి
  • Lawyer
  • Politician

జీవితం తొలిదశ మార్చు

కైలాష్ నాథ్ కట్జూ 1887 జూన్ 17న రాచరిక రాష్ట్రమైన జౌరా రాష్ట్రంలో (ప్రస్తుత రోజు మధ్యప్రదేశ్) లో జన్మించాడు. అతని కుటుంబం జౌరాలో స్థిరపడిన కాశ్మీరీ పండిట్లు. అతని తండ్రి త్రిభువన్ నాథ్ కట్జూ రాష్ట్ర మాజీ దివాన్.[1] [2]కైలాష్ నాథ్ రంగ్‌మహల్ ఉన్నత పాఠశాలలో చదువుకోవడానికి లాహోర్‌కు పంపబడినప్పుడు, జౌరా లోని న్యాయ ఉన్నత పాఠశాల చదువుకున్నాడు.పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి తన మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు.[3] 1905 మార్చిలో లాహోర్‌లోని ఫోర్మన్ క్రిస్టియన్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. అదే సంవత్సరం జూలైలో అలహాబాద్‌లోని ముయిర్ సెంట్రల్ కాలేజీలో చేరాడు.1907 సెప్టెంబరులో అతను అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి చట్టాలలో పట్టా పొందాడు. ప్రావిన్స్‌లో రెండవ స్థానంలో నిలిచాడు. 1908 లో అతను అదే విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో మాస్టర్స్ డిగ్రీని పొందాడు.1914లో అతడు అలహాబాద్‌కు వెళ్లే ముందు కాన్పూర్‌లో న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు.[1] 1919 అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి, న్యాయశాస్త్రంలో ఎల్.ఎల్.డి. డాక్టరేట్ పూర్తి చేసాడు.1921లో అలహాబాద్ ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా చేరాడు. [3]

వృత్తి జీవితం మార్చు

1933లో అలహాబాద్ ఉన్నత న్యాయస్థానంలో మీరట్ కుట్ర కేసులో నిందితుడిని, తరువాత ఢిల్లీలోని ఎర్రకోటలో భారత జాతీయ సైన్యం విచారణలో నిందితులైన మిలిటరీ అధికారులను కట్జూ సమర్థించాడు.1937 జూలై 17న, అతను గోవింద్ బల్లభ్ పంత్ కేబినెట్‌లో యునైటెడ్ ప్రావిన్సుల చట్టం, న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అయ్యాడు. అలహాద్ జిల్లా దోబా నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. [4] 1939 నవంబరు 2 న మంత్రిత్వ శాఖ రాజీనామా చేసింది. వెంటనే కట్జూ 18 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. అతను మళ్లీ 1942లో ఖైదు చేయబడ్డాడు అతను భారత రాజ్యాంగ సభలో కూడా పనిచేశాడు. 1935, 1937 మధ్య అలహాబాద్ పురపాలక సంఘం ఛైర్మన్‌గా, తరువాత ప్రయాగ్ మహిళా విద్యాపీఠం, అలహాబాద్ కులపతిగా పనిచేశాడు. [3]

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, కట్జూ ఉన్నత రాజకీయ పదవులను నిర్వహించాడు. మొదట్లో అతను 1947 ఆగస్టు 15 నుండి 1948 జూన్ 20 వరకు ఒరిస్సా గవర్నర్‌గా పనిచేసాడు. అతను1948 జూన్ 21న పశ్చిమ బెంగాల్ గవర్నరుగా పదవిని చేపట్టి,1951 అక్టోబరు 31 వరకు ఆ పదవిలో ఉన్నాడు.1951లో అతను మందసౌర్ నియోజకవర్గం నుండి లోకసభకు ఎన్నికయ్యాడు. 1951లో జవహర్‌లాల్ నెహ్రూ మంత్రివర్గంలో చేరాడు.1951 నవంబరులో సి. రాజగోపాలాచారి తరువాత దేశంలో మూడవ హోం మంత్రి అయ్యాడు.1955లో అతడిని రక్షణ మంత్రిగా చేశారు.అతను 1957 జనవరి 31న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు.1962 మార్చి 11 వరకు ఆ పదవిలో కొనసాగాడు. అతను సాధారణ పరిపాలన, హోమ్, ప్రచార, ప్రణాళిక,అభివృద్ధి, సమన్వయం, అవినీతి నిరోధక వంటి శాఖలను నిర్వహించాడు. [5]

వ్యక్తిగత జీవితం మార్చు

కట్జూ, అతని భార్య రూప కిషోరీకి ఐదుగురు సంతానం.వారిలో ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. [3] [1] కుమారుడు బ్రాహ్మణాథ్ కట్జూ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. [6] పెద్ద కుమారుడు శివ నాథ్ అదే కోర్టులో న్యాయమూర్తిగా, ఉత్తర ప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా కూడా పనిచేశాడు.శివ నాథ్ కుమారుడు కైలాష్ నాథ్ కట్జూ మనవడు మార్కండేయ కట్జూ భారత అత్యన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేశాడు. అతని మనవరాలు తిలోత్తమ ముఖర్జీ న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరు.అమె రాజకీయవేత్త, మాజీ దౌత్యవేత్త శశి థరూర్ మొదటి భార్య.కట్జూ 1967 వేసవిలో కిడ్నీ వ్యాధితో బాధపడి కోలుకున్నాడు.1968 ఫిబ్రవరి ప్రారంభంలో అతని పరిస్థితి క్షీణించి, ఫిబ్రవరి 17న అలహాబాద్‌లోని అతని నివాసంలో మధ్యాహ్నం మరణించాడు.[2] మరుసటి రోజు గంగానది ఒడ్డున కుమారుడు శివ నాథ్ అంత్యక్రియలు నిర్వహించాడు.[7]

ప్రచురణలు మార్చు

కైలాష్ నాథ్ కట్జూ కొన్ని పుస్తకాలు రాశారు, వాటిలో కొన్ని:

  • న్యాయవాదంలో ప్రయోగాలు: న్యాయస్థానాలలో ఒక కొలస్సస్
  • నాకు గుర్తున్న రోజులు
  • న్యాయవాదంలో జ్ఞాపకాలు, ప్రయోగాలు

అతను మరికొన్ని వ్యాసాలు వ్రాసాడు, ఈ క్రింది వాటితో సహా అనేక చిరస్మరణీయ ప్రసంగాలు చేశాడు:

  • నాకు తెలిసిన కొందరు న్యాయమూర్తులు, న్యాయవాదులు [8]
  • హైకోర్టు భవనం స్వర్ణోత్సవాల సందర్భంగా 1966 నవంబరు 26 న చేసిన ప్రసంగం. [9]

నేషనల్ హెరాల్డ్ సహ వ్యవస్థాపకుడు మార్చు

అతను ది నేషనల్ హెరాల్డ్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ వ్యవస్థాపకులలో ఒకడు.మరో రెండు వార్తాపత్రికలను ప్రచురించిన సంస్థ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అసలైన ఏడుగురు చందాదారులలో కట్జూ ఒకడు.[10] 2012లో సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలతో సన్నిహితంగాఉన్న మరో ఇద్దరు ఏర్పాటు చేసిన కంపెనీ కట్జూ వాటాలను స్వాధీనం చేసుకుంది. ఢిల్లీలోని న్యాయస్థానంలో వీరిపై నేరపూరిత కుట్ర కేసు నమోదైంది.

ప్రస్తావనలు మార్చు

  1. 1.0 1.1 1.2 "Members Bioprofile: Katju, Dr. Kailas Nath". Lok Sabha. Archived from the original on 28 February 2018. Retrieved 28 February 2018.
  2. 2.0 2.1 "K. N. Katju passes away". The Indian Express. Press Trust of India. 18 February 1968. p. 7.
  3. 3.0 3.1 3.2 3.3 Reed, Stanley (1950). The Indian And Pakistan Year Book And Who's Who 1950. Bennett Coleman and Co. Ltd. p. 698. Retrieved 20 February 2018.
  4. Reed, Stanley (1941). The Indian Year Book 1940–41. Bennett Coleman and Co. Ltd. p. 132. Retrieved 28 February 2018.
  5. India: A Reference Annual 1960. Ministry of Information and Broadcasting. 1960. p. 419. Retrieved 28 February 2018.
  6. "Hon'ble Mr. Brahma Nath Katju". allahabadhighcourt.in. Archived from the original on 7 October 2007. Retrieved 28 February 2018.
  7. "Katju cremated". The Indian Express. Press Trust of India. 19 February 1968. p. 9.
  8. Some Judges and Lawyers Whom I Knew by K N Katju Archived 2018-12-10 at the Wayback Machine. Dadinani.com. Retrieved on 10 December 2018.
  9. Speech By Dr. Kailas Nath Katju. Formerly Governor of Orissa and West Bengal, Union Minister for Home Affairs and Defence, and Chief Minister of Madhya Pradesh, Delivered on 27 November 1966, On the occasion of the Golden Jubilee of the High Court Building. allahabadhighcourt.in
  10. AJL did not inform us or obtain approval for equity transfer, say shareholders Archived 10 డిసెంబరు 2018 at the Wayback Machine. Msn.com (30 September 2008). Retrieved on 2018-12-10.

వెలుపలి లంకెలు మార్చు