కొల్లూరి కామశాస్త్రి

సంస్కృత పండితుడు

కొల్లూరు కామశాస్త్రి (1840-1907) సంస్కృతాంధ్ర పండితులు. వీరు ప్రసిద్ధిచెందిన విజయనగరం ప్రభువులైన పూసపాటి ఆనంద గజపతి రాజు సంస్థానంలో ఆస్థాన పండితులుగా ఎన్నో సంస్కృత గ్రంథాలను తెలుగులోనికి అనువదించారు.

రచనలు మార్చు

  • ఆంధ్ర ధర్మ సింధువు: కాశీనాథోపాధ్యాయుని సంస్కృత రచనకు తెలుగు అనువాదం. సరళమైన తెలుగు వచనంలో మూడు పరిచ్ఛేదాలుగా రచించారు. ఇది 1888 లో ముద్రించబడినది.
  • శూద్రకమలకరం: కమలాకర భట్టాచార్యుని సంస్కృత కృతికిది తెలుగు అనువాదం. ఇది 1887 లో ముద్రించబడినది.[1] శ్రుతి స్మృతులలో నిగూఢమైన సర్వసమతా భావాన్ని స్పష్టం చేస్తూ శూద్రాది ధర్మాలను నిర్ణయించే గ్రంథమిది.
  • ఆంధ్ర కాదంబరీ సార సంగ్రహం: ఇది 1905 లో ముద్రించబడినది.
  • లక్ష్మీ నరసింహ తారావళి
  • సింహాద్రి నాథ కర నఖస్తవః లేదా శ్రీ నరసింహదేవ కర నఖస్తవః సింహాచలం లోని లక్ష్మీ నరసింహ స్వామి స్తోత్రమిది. ఇది 1883 లో ముద్రించబడినది.
  • శ్రీ కాశీ స్తవః
  • రఘు నాయక ! భక్త వర ప్రదాయకా ! అనే మకుటంతో రాసిన శతకం,

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. ఆర్కీవు.కాంలో శూద్రకమలాకరము 1887 ప్రతి.