కోణార్క సూర్య దేవాలయం

ఒడిషా లోని సూర్య దేవాలయం

కోణార్క సూర్యదేవాలయం, 13వ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం, ఒడిషా ఎర్ర ఇసుకరాతితో నిర్మించారు.

Konark Sun Temple
Main structure of the Sun Temple
మతం
అనుబంధంHinduism
జిల్లాPuri
దైవంSurya (Sun)
పండుగChandrabhaga Melan
పరిపాలన సంస్థASI
ప్రదేశం
ప్రదేశంKonark, Puri district, Odisha, India
రాష్ట్రంOdisha
దేశం India
కోణార్క సూర్య దేవాలయం is located in India
కోణార్క సూర్య దేవాలయం
Shown within India
కోణార్క సూర్య దేవాలయం is located in Odisha
కోణార్క సూర్య దేవాలయం
కోణార్క సూర్య దేవాలయం (Odisha)
భౌగోళిక అంశాలు19°53′15″N 86°5′41″E / 19.88750°N 86.09472°E / 19.88750; 86.09472
వాస్తుశాస్త్రం.
శైలిKalinga
సృష్టికర్తNarasingha Deva I
పూర్తైనదిc. 1250
విస్తీర్ణం10.62 ha (26.2 acres)
UNESCO World Heritage Site
స్థానంKonark, Odisha, India
CriteriaCultural: (i)(iii)(vi)
సూచనలు246
శాసనం1984 (8th సెషన్ )

ఆలయ విశేషాలు మార్చు

 
Konark Sun Temple

గంగావంశానికి చెందిన లాంగులా నరసింహదేవ I (సా.శ. 1236-1264) లో నిర్మించాడు. ఈ రాజా లాంగులా నరసింహదేవుడు రాజా అనంగభీముని కుమారుడు. సూర్య భక్తుడు. ఈ మందిరము ఎత్తు 230 అడుగులు. ఈ నిర్మాణమునకు విచిత్రమైన పౌరాణిక కథకూడా ఉంది. దీనినే మైత్రేయవన మనిఅందురు. ఉత్కళంలో ఇదే పద్మక్షేత్రం. సూర్య భగవానుడికి ఇక్కడనే ఉపాసన జరిగేది. అదెట్లనగా: శ్రీకృష్ణుని కుమారుడగు సాంబుడు ఒకనాడు నీళ్ళరేవులో అభ్యంగన స్నానం చేస్తున్న స్త్రీలను చూసాడని తండ్రి అతడిని శాపించినాడట. తండ్రిశాపం వల్ల సాంబుడు కుష్టురోగి పీడితుడై ఈ మైత్రేయవనంలో చంద్రభాగాతీరాన సూర్యారాధనచేసి రోగవిముక్తుడయ్యడట. ఆపవిత్రతను బట్టి సాంబుడు సూర్య ప్రతిమను స్థాపించి ఈమందిరాన్ని కట్టించాడట. మరొక విచిత్రం పద్మ పురాణంలో ఉంది. స్వయం సూర్యభగవానుడే ఇచ్చట తపస్సు చేసాడనీ, అందుకే ఈమందిరానికి పవిత్రత కలిగినదట. ఒడిషా లోని పుణ్యక్షేత్రాల్లో శంఖక్షేత్రం (పూరి), చక్రక్షేత్రం (భువనేశ్వరం), గదాక్షేత్రం (జాజ్ పూర్), ఈ పద్మక్షేత్రం ప్రస్సిధమైనవి.ఈ క్షేత్రం హిందువులకు అత్యంత పవిత్రంమైనది, ఇచ్చోటనే భక్త కబీరుదాసు సమాధి ఉండెనని అబుల్ఫజల్ యొక్క అయినీ అక్బరీ చెప్పుతోంది. దీనికి నల్ల పగోడా అనికూడా అంటారు.దీనిని యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు.

మందిర వర్ణన మార్చు

ఈ దేవాలయం, మొగసాల (An entrance hall)- రెండూనూ పీఠంపైన రథం లాగా చెక్కిఉంది. పీఠంలో 24 చక్రాలు, ఒక్కొక్కచక్రం చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. మొగసాలసమ్ముఖంలో ఏడుగుర్రాలు. శాస్త్రోక్తంగా సూర్యభగవానుడు సప్తాశ్వరధారూఢుడై ప్రపంచం చుట్టూ తిరుగుతున్నాడు. అవన్ని ఇప్పుడు అంతగాలేవు. ఒరిసా దేవాలయములు నాలుగురకాలు: రేఖ, భద్ర, ఖఖారా, గౌరీయ. ఈదేవాలయమును, పూరి భువనేశ్వరాలయాలును రేఖా దేవాలయములు. కోణార్కము ఐదు రథాలమందిరము. మందిరం మధ్యభాగములో సుచారుకారు ఖచితమగు సింహాసనమొకటున్నది. దానిపైనసూర్యభగవానుడు. దేవాలయముతోపాటు మొగసాల ఒక తామరపూవు మీద చెక్కివున్నది. మొగసాలకు నాల్గువైపులా ద్వారాలు. ఎంతో చక్కగా లలితకళలాగు రాయిమీద సుత్తిపెట్టిచెక్కివున్నది. ఆశ్రేణీలు, తామరపువ్వులు, లతలు అవన్నీ చూస్తే రమ్యముగా ఉండును. మొగసాలమ్ముఖాన మోరొక స్వతంత్రపీఠం మీద "నాట్యమందిరం" నిర్మింపబడిఉన్నది. దీనిని కొందరు భొగమంటపమని, మరికొందరు నాట్యమందిరమని అంటారు. ఎచటా అశ్లీలాలు లేవు. అన్నివైపులా నర్తకులు భాజభజంత్రీలతో దేవార్చంబచేయటం కనబడుతోంది. ఆభంగిమలు ఈనాటి భరతనాట్యకళా ప్రదర్శకులు అనుకరించటానికి ఎంతో అనుకూలమని చెప్పవచ్చును. అంతేకాదు ఈ నాట్యమందిరము తామరపువ్వులతో నిండి ఉంది. దేవార్చనకు, భూషణానికి ప్రాచీనులు ఈపువ్వులనే వాడేవారు.

ఈనాట్యమందిరం దగ్గిరగా ఒక పెద్దబండరాయి క్రిందపడి ఉంది. దానిమీద పెద్ద తామరపువ్వు చెక్కబడివున్నది. పూవు వ్యాసము 5 అడుగులు. పూదళాలు అప్సరసలు గానాభజానా చేస్తున్నత్లు కనిపిస్తారు. కేద్రంలో కూడా ఒక చిన్నపువ్వు. దీనిలో సూర్యభగవానుడు సప్తాశ్వరధారూఢుడై కూర్చొని ఉన్నాడు. ఇరువైపులా పరిచారికలు. చేతుల్లో పువ్వులు. శిల్పి ఎంత సూక్షంగా, రసవంతంగా చెక్కినాడో! ఈరాయి నాట్యమందిరం యొక్క గర్భముద్ర అని చెప్పుతారు.

మొగసాలకు ఉతారంవైపుగా ఉన్న రెండు ఏనుగు విగ్రహాలు ఉనాయి. అవి నిజం ఏనుగులా అన్నట్లు చెక్కినారు. ఏనుగు పొడవు 9 అడుగులు వెడల్పు 5 అడుగులు, ఎత్తు 9 అడుగులు. మొగసాలకు దక్షిణం వైపు విరాట్ స్వరూపంతో రెండు గుర్రాలుండేవి. ఇప్పుడవిలేవు. వాటి వీరావేశం, ఉన్మత్తభావాలను చూస్తే దర్శకులు భయపడేవారుట. వీటి పొడవు 10 అడుగులు, వెడల్పు 6 అడుగులు.

కోణాల్కులోని పెద్దదేవాలయపు సమ్ముఖంలో అరుణస్తంభముండేది. దానిని మహారాష్ట్రులు పూరీకి తీసుకుపోయి, పూరీ సింహద్వారమందు స్థాపించి యున్నారు. అరునుడు సూర్యుని రథసారథి. చేతులు జోదించి దేవుని ధ్యానిస్తునాట్లు ఉంది. ఈ క్షేత్రానినే ఉల్లేఖిస్తూ శివాజీ ఏకామ్రకాననంలో భువనేశ్వరం "ఉత్కళ దేశం దేవతల ప్రియనికేతన" అని శంఖు పూరించాడు.

ఇక్కడగల రామచండీమందిరమును కోణార్కు అధిషాత్రిదేవీ మందిరము. దీనినే కొందరు బుద్ధుని తల్లియగు మాయాదేవీమందిరము అంటారు. దీనిలోని ప్రతిమ ఇప్పుడు దేవాలయమునకు దగ్గరగా ఉన్నా లియాఖియా అనుగ్రామమందు ఉంది.కళాపహడు కోణాల్కముపై దండెత్తి వచ్చినప్పుడు రామచండిమందిరాన్ని ధ్వసం చేయతలచాడు. ఆదుస్థుతిలో దేవీ నీళ్ళుతెచ్చేనేపాన చంకలో బిందె పెట్టుకొని లియఖియాకు పోయింది. కళాపహాడ్ తుదకు నిరుత్సాహుడై దేవిని అన్వేషించుటకు పోయినాడు. లియఖియాలో దేవి తేలి ఉండటం చూసి ఎంతో పిలిచాడు, కాని లాభము లేకపోయింది. తుదకు కళపహాడ్ సిగ్గుపడి ఆమందిరమ్మీద ఇట్లు వ్రాసాడు.

భోలా రామొచొండి, భోలారె
కోళాపహోడుకు దువారె బోసాయి
భోలాపాణి పాంయి గొలారె.

అంటె రామచండి దుడుకుతనంతో తన్ను ద్వారంలో కూర్చుండబెట్టి నీళ్ళకోసం నదికిపోయి తిరిగి రాలేదని విసుగుపడి ఈపద్యం రాసాడు.

ఇంకా ఇక్కడ నవగ్రహాలు ఇక్కడ చూడవలసినదవి. ఈగ్రహాలు మనుష్యాకారంలో ఝేఏవాఖాలాళూ చిమ్మేటట్లు మెరుస్తున్నాయి. తలలపై ముకుటం, పద్మాసనం వేసినట్లు చక్కబడినవి. ఇంకా ఎన్నో మూర్తులు కాలావస్తలో శిథిల పడినవి. ఈ మూర్తులన్నిటింకీ ముఖ్యమంది సూర్యప్రతిమ. ఈ సూర్యప్రతిమకు తలపై మకుటం, చెవుల్లో కుండలాలు, కంఠంలో హారం, మెడలో జెందెం, వాటిలో మువ్వలు, కటిప్రదేశంలో మేఖల, దానికింద గ్రంథిమాల- ఆ ఘటన మనోభావభంగిమలు ఎంతో స్వాభావికంగా జీవకళలు తొణికిసినట్లు కనిపిస్తోంది. ఈ ప్రతిమనుకూడా కొందరు బుద్ధదేవుని ప్రతిమ అని కొందరు భ్రమపడ్డారు. ఈ పుణ్య క్షేత్రంలో మాఘ సప్తమినాడు గొప్పయాత్ర జరుగుతుంది. ఇంకా కొన్ని యాత్రలు పూర్వం వైభవంగా జరిగేవి. వీటిలో ముఖ్యమైనవి చైత్రయాత్ర, రథయాత్ర, చంద్రభాగాయాత్ర.

మతభేదం మార్చు

ముఖ్యమైన విషయమేమనగా- ఈకోణార్కము బౌద్ధావశేషమా, కాదా? ఈ విషయంలో చాలా మంది చారిత్రుకులు తర్కించి తర్కించి ఎన్నో గ్రంథాలు వ్రాసారు. ఈచోటనే హ్యూయంసాంగ్ యొక్క చెలితోలా లేకా చిత్రోత్పలా అనే బౌద్ధమత కేంద్రమొకటి ఉండేది. బౌద్ధయుంగంలో కళింగ రాజధాని దంతపురము ఈ చిత్రోత్పల పేరేనంటారు. హిందువులూ, బౌద్ధులూ గొప్ప స్నేహ భావంతో కలసిమెలసి ఉండెవారని హ్యూయంసాంగ్ చెప్పుతాడు. కోణార్కుకి మైత్రేయవనమని పద్మపురాణంలో వ్రాసివున్నది. బుద్ధదేవుని మారుపేరు మైత్రేయుడని, పాళీ భాషలో మైత్రేయుడని ఆక్షేత్రానికి అందుకోసమే మైత్రేయవనమని పేరువచ్చిందటారు. కోణార్కములో అర్కవటము (జిల్లేడు చెట్టు) ఉండేది. దానిక్రింద వటేశ్వరుడు కూడా నేటివరకు పూజింపబడుచున్నాడు. కపిలసంహితను బట్టి ఆచెట్టు క్రింద సూర్యభగవానుడె జపించాడని ప్రమాణం ఉంది. ఆస్థలాన్ని కొందరు బుద్ధిని బోధిద్రుమముండే దంటారు. ఆచెట్టు క్రిందనే బుద్ధదేవుడు 49 రోజులు తప్పస్సు చేసేడంటారు. కొందరు అమరకోశం బట్టి బుద్ధుని మారుపేరు అర్కబధువని, దేవుని పేరును బట్టి స్థలం పేరు కోణార్కమైదని అంటారు. నరసింహదేవుని తామ్ర శాసనంలో ఈ స్థలానికి కోణా కోణా లేదా కోణాకమనము అని పేరుంది. బుద్ధదేవుని మరొకపేరు కోణాకమనీ, అందువల్లనే కోణార్కము బుద్ధదేవుని నామాంతరమగు స్థలమనీ అంటారు. కోణార్కుకు అర్ధమేమంటే కోణ + అర్క = కోణార్క . పూరీక్షేత్రానికి (North-East) ఈశాన్య కోణంలోని అర్కదేవుని క్షేత్రం గనుక దీనికి కోణార్కమని పేరు. ఇలా చాలా విషయాల్లో కోణర్కమునకు బౌద్ధులకు సంబంధమును ఉంది.

నిర్మాణకౌశలం మార్చు

కోణార్కు నిర్మాణానికి రెండు రకాల గాథలు ఇమకా ఒరిసాలో వాడుకలో ఉన్నాయి. ఒకటి లాంగులా నరసింహదేవుమంత్రి శివాయిసాంత్రా- రామచందీ పరమాన్నాం కథ. ఈకథ మాదలా పంచాంగంలో ఉంది.రెండోది చాలా చమత్కారమైంది. 1200లమంది శిల్పులు 16 సంవత్సరాల కాలంలో ఈ దేవాలయం కట్టిరని, అందులో ఒక ప్రధాన శిల్పి ఈ మందిర నిర్మాణంకోసం ఇంట్లో గర్భవతియగు భార్యను విడిచిపెట్టి కోణార్కమునకు పోయాడు. కొన్ని రోజులయ్యాక ఆశిల్పికి ఒక కురావాడు జన్మించాడు.ఆకుర్రవాడొకరోజు తోడిబాలురతో ఆడుకొనుచున్నాప్పుడు కుర్రవాళ్ళు తా తండ్రిలేని పిల్లడని అతనిని హేళన చేశారు. దానితో వాడు చాలా సిగ్గు పడి కోపంతో తల్లివద్దకు పోయి, తన తండ్రి ఎవరో చెప్పమని నిర్భందిచాడు. తండ్రి కోణార్కు మందిర నిర్మాణంలో పనిచేస్తున్నాడని చెప్పి తల్లి కొడుకుచేతుల్లో పోలి కోశం రేగిపళ్ళు పెట్టి పంపించింది.కుర్రవాడు తండ్రిని వెదుకుతూ కోణార్కమునకు చేరాడు. అప్పటిసరికి 1200 శిల్పులు మందిరమంతా నిర్మించి పూర్తిచేయలేకపోయారు. శిల్పులంతా నిరుత్సాహులై రాజావారి కఠినశాసనంకోసం భయబడ్డారు. ఆరాత్రి అందరూ పడుకున్న సమయం చూసి, శిల్పి బాలుడు స్వయంగా ఆమందిరము యొక్క ధ్వజాన్ని కట్టి పూర్తిచేశాడు. తెల్లవారాక శిల్పులు సంపూర్ణమందిరాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. కాని తమ్మందరినీ రాజు చేతకాని వాళ్ళని దూషిస్తాడని, ఆకుర్రవాని తండ్రికిలా ఆజ్ఞాపించారు. "బొరొళొహొ బొడెయిరె దాయీ కీ ఎకా పువొరొ దాయీ". అనగా 1200 శిల్పులు పూచీయు లేక ఒక్క కొడుకు పూచీయా" అప్పుడు తండ్రి చాలా విషయావస్థలో పడి ఏమీ జవాబు చెప్పలేక, కుమారుడను ఆమందిర శిఖిరానికి తీసుకుపోయి అక్కడనుండి క్రిందకు జారవిడిచాడు. [1]

పతనం మార్చు

కోణర్కపతనం! పతనమంటే గుండె జలదరిస్తుంది. ఆ నిర్మాణకౌశలము, ఆశోభ, ఆకారు కలాపము అదంతా ఎక్కడికి పోయింది? ఆ మొగసాల, ఆ భూషణాదులు, ఆ మందిరాలు ఏవీ? ఇంకా ఉన్నాయి భగ్న దశలో వికృతాకారాన్ని చూపిస్తూ. ఎన్ని గాలి తుపానులో! ఎన్ని భూకంపాలో! ఎన్ని పిడుగులో! దయా దాక్షిణ్యంలేక భారతీయ విజయ స్తంభాన్ని విరుగగొట్టింది. ఇంకా తనివితీరక పరదేశీయులు ఈ గౌరవ స్తంభాన్ని విరుగగొట్టారు. కర్కోటకుడగు కళాపహాడు కూడా వికలాంగు పరిచాడు. మరికొంత మంది మహమ్మదీయ నావికులు కుత్సిత బుద్ధి వినియోగించి ఉత్కలకళామణిని కనుమరుగు పరిచారు. ఇచ్చోటనే భక్త కబీరుదాసు పవిత్రసమాధి ఉమదని మరిచిరి. కాలం కడుపు నిండింది. కోణార్క పతనం పూర్తి చెందిది. హిందూదేవదేవీల దివ్య మందిరము, జాతీయ కాంతి సౌధము పోర్చుగీసుల ఆశ్రయ స్థలము నేడు ముక్కలు ముక్కలై మొండిబ్రతుకింకా బ్రతికే ఉంది. అంతే చాలు. మనకు ఆ జీర్ణ విజయ చిహ్నమే చాలు. ఆ గ్రుడ్డి దీపమే వెలుగు.

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

  1. Praveen, K. "Konark Sun Temple Abhishekam Online Booking". Temples Guru. Temples Guru. Retrieved 31 January 2024.

బయటి లింకులు మార్చు