కోమాలి (2020 సినిమా)

కోమాలి 2020లో విడుదలైన తెలుగు సినిమా. వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై ఐసరి కె.గణేష్ నిర్మించిన ఈ సినిమాకు ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించాడు. జయం రవి, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 04 డిసెంబర్ 2020న విడుదలైంది.[1]

కోమాలి
దర్శకత్వంప్రదీప్ రంగనాథన్
రచనప్రదీప్ రంగనాథన్
నిర్మాతఐసరి కె.గణేష్
తారాగణంజయం రవి, కాజల్ అగర్వాల్
ఛాయాగ్రహణంరిచర్డ్ ఎం.నాథన్
కూర్పుప్రదీప్ ఇ. రాఘవ్
సంగీతంహిప్హాప్ తమిజా
నిర్మాణ
సంస్థ
వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌
విడుదల తేదీ
2019 ఆగస్టు 15 (2019-08-15)
సినిమా నిడివి
141 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

రవి (జయం రవి) పదవ తరగతి విద్యార్థి. 1999 డిసెంబర్ 31న ప్రమాదం కారణంగా కోమాలోకి వెళ్లి 16 ఏళ్ల తర్వాత కోమా నుంచి బయటకొస్తాడు. అప్పటికే అతని చుట్టూ ఉన్న ప్రపంచం చాలా మారిపోతుంది. తన ఆలోచనలు పదహరేళ్ల వయసుకే ఆగిపోయి ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో రవికి అతని స్నేహితుడు చెల్లెల భర్త (యోగిబాబు) అండగా నిలబడతాడు. సాంకేతికంగా మనిషి ఎదిగే క్రమంలో ఏం కోల్పోయాడనే విషయాన్ని రవి గ్రహిస్తాడు. అదే సమయంలో ఎమ్మెల్యే (కె.ఎస్.రవికుమార్) తో రవికి చిన్న సమస్య ఎదురవుతుంది. ఆ సమస్యేంటి? ఆ సమస్య నుండి రవి ఎలా బయటపడ్డాడు? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌
  • నిర్మాత: ఐసరి కె.గణేష్
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రదీప్ రంగనాథన్
  • సంగీతం: : హిప్ హాప్ తమిళ
  • సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం.నాథన్

మూలాలు మార్చు

  1. TV9 Telugu (3 December 2020). "డిసెంబర్ 4న 'జీ5'లో కాజల్ అగర్వాల్ 'కోమాలి' ప్రీమియర్... ప్రేక్షకులను మెప్పించేనా.!". Archived from the original on 14 September 2021. Retrieved 14 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Sakshi (31 July 2019). "కోమాలిలో కావాల్సినంత రొమాన్స్‌". Sakshi. Archived from the original on 14 సెప్టెంబరు 2021. Retrieved 14 September 2021.