ఖరీఫ్ పంట అనగా వర్షంపై ఆధారపడి రుతుపవనముల రాక నుంచి రుతుపవనముల తిరోగమనం వరకు పండించే పంటలని చెప్పవచ్చు. ఆసియా ఉపఖండంలో ఈ పద్ధతిని అవలంభిస్తున్నారు. మొక్కలు నాటడం, సాగు చేయడం, నూర్పిళ్లు అన్ని ఈ ఖరీఫ్ లోనే జరుగుతాయి. శరదృతువులో కోతకు వచ్చే ఇటువంటి పంటలను భారతదేశం, పాకిస్తాలలో వేసవి లేదా రుతుపవన పంట అని కూడా పిలుస్తారు. ఖరీఫ్ పంటలు సాధారణంగా జూలై నెలలో ప్రారంభమయ్యే తొలకరి వర్షాలలో నాటుతారు. ఈ కాలాన్ని నైరుతి రుతుపవనకాలం అంటారు. పాకిస్తాన్ లో ఖరీఫ్ సీజన్ ఏప్రిల్ 16 న ప్రారంభమై అక్టోబరు 15 వరకు ఉంటుంది. భారతదేశంలో రాష్ట్రాల వారిగా పండించే పంట, ఖరీఫ్ సీజన్ మారుతుంది. మొత్తం మీద ఖరీఫ్ సీజన్ మే నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తుంది. కాని ప్రముఖంగా ఈ ఖరీఫ్ సీజన్ జూన్ నెలలో ప్రారంభమై అక్టోబరు నెలతో ముగుస్తుందని అత్యధికులు భావిస్తారు.

వరి పంట
Bajra
Groundnut

వరి మార్చు

ఖరీఫ్ లో పండించే పంటలలో ముఖ్యమైనది వరి.

సాధారణ ఖరీఫ్ పంటలు మార్చు

వరి

జొన్న

మొక్కజొన్న

పెసలు

చెరకు

గోరు చిక్కుడు

కందులు

ప్రొద్దు తిరుగుడు

సోయా చిక్కుడు

రాగి

వేరు సనగ

కాకర కాయ

ప్రత్తి

నువ్వులు

మినుము

ఇవి కూడా చూడండి మార్చు

రబీ

తొలకరి

"https://te.wikipedia.org/w/index.php?title=ఖరీఫ్_పంట&oldid=2879876" నుండి వెలికితీశారు