ఖలిస్తాన్ కమెండో ఫోర్స్

ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ లేదా KCF పంజాబ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఒక సాయుధ సిక్కు సంస్థ. యుఎస్ స్టే డిపార్ట్‌మెంటు[3], పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ యొక్క అసిస్టెంట్ ఇనస్పెక్టర్ జనరల్[4] ప్రకారం ఈ కె.సి.ఎఫ్ భారతదేశంలోని అనేక హత్యలకు కారణం. దీనిలో 1995లో ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కూడా ఉంది.[3]

ఖలిస్తాన్ కమెండో ఫోర్స్
Leaderమన్‌బిర్ సింగ్ చాహెరు (1987)
లాభ్‌ సింగ్  (1987–1988)
కన్వాల్‌జిత్ సింగ్ సుల్తాన్‌విండ్ (1988–1989)
పరమ్‌జిత్ సింగ్ పంజ్వార్ [1]
Dates of operation1987–1993
Motivesపంజాబ్ రాష్ట్రంలో సిక్కుల స్వతంత్ర్య రాష్ట్రం ఖలిస్తాన్ సృష్టి , భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు.
Active regionsభారతదేశం
Ideologyసిక్కు జాతీయత
StatusIndia Under the Unlawful Activities (Prevention) Act designated as terrorist organisation by the Government of India[2]

సంస్థ గురించి మార్చు

ఈ సంస్థ వివాదస్పదమైనది. ఇది 1984లో భారత సాయుధ దళాలు గోల్డెన్ టెంపుల్ లో ప్రవేశించి చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా యేర్పడినది. భారత ప్రభుత్వం ప్రకారం కె.సి.ఎఫ్ అనేది ఒక టెర్రరిస్టు సంస్థ. కానీ ఏ టెర్రరిస్టు కార్యకలాపానికి గానీ, హత్యలకు పాల్పడినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా దానిని టెర్రరిస్టు సంస్థగా ప్రకటించలేదు. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ డిపార్టుమెంట్ ఆఫ్ స్టేట్స్ ద్వారా ఈ సంస్థ టెర్రరిస్టు సంస్థగా గుర్తించబడలేదు.[3][5][6]

ఖలిస్తాన్ కమాండో దళాలు సభ్యులు స్వాతంత్ర్య సమరయోధులుగా చెప్పుకోవడానికి [7], సిక్కులలో ఒక వర్గం సహకారం ఉంది.[8]

ఏర్పాటు , నాయకత్వం మార్చు

ఖలిస్తాన్ కమెండో ఫోర్స్ 1986లో మన్‌బిర్‌సింగ్ చాహెరుచే స్థాపించబడింది.[9][10][11]

1986 ఆగస్టు 8 న పంజాబ్ పోలీసులు మన్‌బిర్‌సింగ్ చాహెరు (హరి సింగ్) ను అరెస్టు చేసారు. ఆయన పోలీసు కస్టడీలో ఉండగా హత్యకు గురయ్యాడు.[12][13] లేదా అదృశ్యమయ్యాడు.[14] చాహెరు అరెస్టు కాబడిన తరువాత మాజీ పోలీసు అధికారి సుఖ్‌దేవ్‌సింగ్ ("సుఖా సిపాహి"గా సుపరిచితుడు) కె.సి.ఎఫ్ బాధ్యతలు స్వీకరించాడు. ఆయన తన పేరును "లాబ్‌సింగ్"గా మార్చుకున్నారు.

ఆయన మరణం తరువాత కె.సి.ఎఫ్ కన్వార్జిత్‌సింగ్ సుల్తాన్‌విండ్‌చే నడుపబడింది.[15][16] అక్టోబరు 18, 1989 న కన్వార్జిత్ సింగ్ సుల్తాన్‌విండ్ [17], ఇద్దరు యితర కె.సి.ఎఫ్. సభ్యులు జలంధర్ వద్ద పోలీసులచే అరెస్టు కాబడ్డారు. కానీ ఒక సభ్యుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కన్వార్జిత్‌సింగ్ సుల్తాన్‌విండ్ ఆ సంస్థ గురించి వివరాలు చెప్పకుండా ఉండటానికి సైనైడ్ టాబ్లెట్ తిని మరణించాడు.[17]

క్షీణత మార్చు

1988, జూలై 12, న పోలీసులు లాబ్‌సింగ్‌ను హతమార్చారు..[18] ఆయన మరణం సంస్థను దెబ్బతీసింది. ఆయన మరణం తరువాత ఈ సంస్థ వివిధ వర్గాలుగా విడిపోయింది. వాటిలో వాస్సన్‌సింగ్ జఫార్‌వాల్, పరమ్‌జిత్‌సింగ్ పంజ్వాల్, గుర్జాంత్‌సింగ్ రాజస్థానీల నాయకత్వాలలో వివిధ వర్గాలు యేర్పడినవి.[19]

లాబ్‌సింగ్ మరణం తరువాత ఈ సంస్థ విఫలం చెందడానికి మరొక కారణం ఈ సంస్థ బబ్బర్‌ఖల్సాతో పొత్తు పెట్టుకోవడంలో విఫలం చెందడం. లాబ్‌సింగ్, సుఖ్‌దేవ్‌సింగ్ బబ్బర్ ప్రారంభించిన పొత్తు విఫలం చెందింది.[20]

పోలీసులు, భారతీయ భద్రతా దళాలు ఆ సంస్థ యొక్క ప్రాంతీయ కమాండర్లను, లెప్టినెంటు జనరళ్లను వివిధ గొడవలలో పట్టుకోవడం లేదా కాల్చి చంపడం మూలంగా సంస్థ క్షీణించింది.[21]

కార్యకలాపాలు మార్చు

1980లు మార్చు

ఈ సంస్థ భారతదేశంలో 1984 లో అమృత్ సర్ స్వర్ణదేవాలయంలో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్ యొక్క ప్రతీకారంగా భారతీయ సైన్యంతో తలపడింది. [ఆధారం చూపాలి]

ఆపరేషన్ బ్లూస్టార్‌లో భారత దళానికి నాయకత్వం వహించిన అరుణ్‌వైద్య అనే జనరల్ ను హత్య చేసింది.[22]

ఈ సంస్థ ఆల్కహాల్, సిగరెట్లు, యితర సంప్రదాయవాద సిక్కుమతం ద్వారా నిషేధించబడిన వస్తువులను అమ్మే వారిపై దాడులు చేసింది.[23]

1987 లో పంజాబ్ హత్యలలో వీరి ప్రమేయం ఉన్నట్లు అనుమానాలున్నాయి.

1990లు మార్చు

1980లలో జరిగిన ఓటముల తరువాత ఈ సంస్థ 1990లలో తన పోరాటాలను కొనసాగించింది. కొన్ని సార్లు ఈ సంస్థ యితర టెర్రరిస్టు గ్రూపులతో కలసి పనిచేసింది.[ఆధారం చూపాలి]

జూన్ 1991 లో ఈశాన్య పంజాబ్ లో ఒక పాసింజర్ రైలుపై దాడి జరిపినపుడు సుమారు 50 మంది (అధికంగా హిందువులు) మరణించారు.[24] సెప్టెంబరు 1993 లో న్యూఢిల్లీ లో కాంగ్రెస్ యువజన అద్యక్షుడైన మణీంద్రసింగ్ బిట్టాను లక్ష్యంగా చేసుకుని జరిగిన బాంబ్ బ్లాస్టు ఫలితంగా ఎనిమిది మంది ప్రజలు మరణించారు.[25]

1992 అక్టోబరు 9 లో జనరల్ అరుణ్ వైద్య హత్యతో సంబంధం ఉన్నట్లు ఆరోపించబడిన హర్జీందర్‌సింగ్ జిందా, సుఖ్‌దేవ్‌సింగ్ సుక్తాలు పూణె జైలులో ఉరి తీయబడ్డారు.[26][27]

పోలీసులు వేదాదిమంది అనుమానితులను కాల్చి చంపి, అనేక మంది శవాలను హత్య కేసులను కప్పిపుచ్చడానికి దహనం చేసింది.[28][29]

ఖలిస్తాన్ ఉద్యమంలో పాల్గొన్న నాలుగు ప్రధాన మిలిటెంట్ల గ్రూపులలో ఒకటిగా 1995లో జాబితాలోనికి ఈ సంస్థ చేరింది.[30]

2000లు మార్చు

జూన్ 2006లో కె.సి.ఎఫ్ యొక్క పంజ్వాలీ వర్గం సభ్యుడైన కుల్బీర్ సింగ్ బారాపిండ్ యు.ఎస్ నుండి భారతదేశానికి వచ్చాడు. ఆయన భారతదేశంలో టెర్రరిస్టు కార్యకలాపాలకు పాల్పడి తప్పుడు పాస్‌ఫోర్టుతో యునైటెడ్ స్టేట్స్ వెళ్ళినందున భారతదేశానికి పంపించబడ్డాడు. ఆయన భారతదేశంలో 32 కేసులలో నిందితుడు. ఆయన 1990ల ప్రారంభంలో మూడు హత్య కేసులలో అరెస్టు కాబడ్డాడు.[31] ఆయన అరెస్టు తరువాత, ఖలిస్తాన్ ఉద్యమాన్ని శాంతియుత పద్ధతిలో నడిపిస్తానని ప్రకటించాడు.[32] 2003 లో క్రెడిట్ కార్డు మోసంలో ఖాలిద్ అవాన్ జైలులో ఉన్నప్పుడు ఇన్‌వెస్టిగేషన్ ప్రారంభమైనది. ఈ మోసానికి తనకు పరమజిత్ సింగ్ పంజ్వార్ అనే కె.సి.ఎఫ్ నాయకునితో సంబంధం ఉన్నTlu తెలిపాడు.[3] 2007 లో అవాన్ కు 14 యేండ్ల జైలు శిక్ష ఖరారు చేసారు.[33]

స్థితి మార్చు

2008 నుండి కె.సి.ఎఫ్ లో ఒక వర్గానికి పరంజిత్ పంజ్వార్ నాయకత్వం వహించాడు. భారతదేశంలో పదిమంది వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో ఆయన పేరు ఉంది.[34]

"గ్లోబల్ టెర్రరిజం డాటాబేస్" యొక్క యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ బీటా వెర్సన్ ఆ సంస్థ రెండి మిలిటరీ టార్గెట్ దాడులు, 9 పోలీసులపై దాడులు లేదా ప్రభుత్వంపై దాడులు, 9 ప్రజలపై, మత, రవాణా లేదా విద్యా సంస్థ పై దాడులు భారత, పాకిస్తాన్లో చేసినట్లు జూన్ 2009 లో రికార్డు చేసింది.[35]

ఈ కె.సి.ఎఫ్ భారతదేశంలో నిషేధించబడింది. [ఆధారం చూపాలి]

మూలాలు మార్చు

  1. Paramjit Singh Panjwar (Khalistan Commando Force) The Indian Express, 4 December 2008
  2. "Terrorism Act 2000". Ministry of Home Affairs (India). Archived from the original on 10 మే 2012. Retrieved 20 May 2012.
  3. 3.0 3.1 3.2 3.3 "U.S. Court Convicts Khalid Awan for Supporting Khalistan Commando Force". Embassy of the United States in New Delhi, India. 20 December 2006. Archived from the original on 11 డిసెంబరు 2008. Retrieved 31 జూలై 2016.
  4. "Law Enforcement Cases: International Narcotics Control Strategy Report: Bureau of International Narcotics and Law Enforcement Affairs". US Department of State. March 2008. Retrieved 8 June 2009.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-12-05. Retrieved 2016-07-31.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "Law Enforcement Cases: International Narcotics Control Strategy Report: Bureau of International Narcotics and Law Enforcement Affairs". US Department of State. March 2008. Retrieved 8 June 2009.
  7. Mahmood, Cynthia Keppley (1997). Fighting for Faith and Nation: Dialogues with Sikh Militants (illustrated ed.). Many interviews, example on page 102: University of Pennsylvania Press. p. 314. ISBN 978-0-8122-1592-2.{{cite book}}: CS1 maint: location (link)
  8. "U.S. Sikhs back militants' fight for homeland". THE WASHINGTON TIMES. 18 November 1991. Retrieved 20 June 2009.
  9. Encyclopedia of modern worldwide ... - Google Books. Books.google.com. Retrieved 9 August 2009.
  10. Fighting for faith and nation ... - Google Books. Books.google.com. Retrieved 9 August 2009.
  11. Violence as political discourse - Google Books. Books.google.com. 13 October 2008. Retrieved 9 August 2009.
  12. The Journal of Commonwealth & comparative politics by Taylor & Francis. Books.google.com. 12 June 2008. Archived from the original on 27 జూన్ 2014. Retrieved 9 August 2009.
  13. "The Killings In Sangrur Jail". Ihro. June 2009. Archived from the original on 2007-10-08. Retrieved 2020-05-15.
  14. Mahmood, Cynthia Keppley (1997). Fighting for Faith and Nation: Dialogues with Sikh Militants (illustrated ed.). University of Pennsylvania Press. p. 314. ISBN 978-0-8122-1592-2.
  15. "800 years of Sultanwind". Punjab Heritage. 28 July 2006. Retrieved 9 August 2009.[dead link]
  16. Terror in the mind of God: the ... - Google Books. Books.google.com. Retrieved 9 August 2009.
  17. 17.0 17.1 Juergensmeyer, Mark (2003). "The Sword of Sikhism". Terror in the mind of God (3 ed.). University of California Press. p. 95. ISBN 978-0-520-24011-7. Retrieved 18 June 2009.
  18. Terrorism in context - Page 399. Books.google.com. Retrieved 9 August 2009.
  19. Terrorism & It's Effects - various - Google Books. Books.google.com. Retrieved 2012-04-07.[permanent dead link]
  20. Genesis of terrorism: an analytical study of Punjab terrorists. Patriot. 1988. Retrieved 9 August 2009. ...(KCF) which is headed by General Labh Singh alias Sukhdev Singh alias Sukha Sipahi. Perhaps he continued to maintain his links with the Babbar Khalsa also.
  21. Terrorism in context - Martha Crenshaw - Google Books. Books.google.com. Retrieved 2012-04-07.
  22. Mahmood, Cynthia Keppley (1997). Fighting for Faith and Nation: Dialogues with Sikh Militants (illustrated ed.). University of Pennsylvania Press. p. 155. ISBN 978-0-8122-1592-2.
  23. Brown, Derek. Fanatical Sikhs turn on traders, The Guardian, 8 April 1987.
  24. Ravi Sharma, Massacre on passenger trains turns routine trip nightmare, United Press International, 16 June 1991.
  25. Three Sikh militant factions claim Delhi blast, Agence France-Presse 13 September 1993.
  26. McGirk, Tim (10 October 1992). "Protests after hanging of Sikhs". The Independent. London. Archived from the original on 3 మార్చి 2016. Retrieved 31 జూలై 2016.
  27. "The Tribune, Chandigarh, India - Punjab". Tribuneindia.com. Retrieved 2012-04-07.
  28. "India: Who killed the Sikhs". World News Australia. 3 April 2002. Archived from the original on 19 అక్టోబరు 2007. Retrieved 31 జూలై 2016.
  29. "Special Broadcasting Service :: Dateline - presented by George Negus". Archived from the original on 2008-08-28. Retrieved 2016-07-31.
  30. Martha Crenshaw, ed. (1 January 1995). Terrorism in Context. Pennsylvania State University Press. p. 394 and others. ISBN 978-0-271-01015-1. Retrieved 30 May 2009.
  31. Kulbir Singh sent to police custody Archived 2012-02-11 at the Wayback Machine, The Times of India, 19 June 2006.
  32. Zee News, India, "Judicial remand of Khalistan militant extended till 27 July" 14 July 2006
  33. Pak-Canadian jailed for aiding Khalistan ultras Archived 2016-03-04 at the Wayback Machine The Sunday Indian, 4 April 2012
  34. "8) Paramjit Singh Panjwar". rediff.com. 24 June 2008. Retrieved 19 June 2009.
  35. "Khalistan Commando Force search at Beta UM terrorism database". University of Maryland. Retrieved 20 June 2009.