గరుడ ముక్కు అనగా ఒక ఔషధ మొక్క. దీని విత్తనాలు గ్రద్ధ ముక్కు ఆకారంలో, కాండం రెండు చేతులు కలిసినట్లుగా ఉంటుంది. ఈ మొక్క శాస్త్రీయ నామం మార్టీనియా ఆన్యువా (Martynia Annua). దక్షిణ భారతదేశంలో ఉన్న ఎజెన్సీ నేలల్లో ఈ మొక్క ఎక్కువగా కనిపిస్తుంది. పంజాబీ, హిందీ భాషల్లో ఈ మొక్కను హతజోరి లేక హతజోడి అని అంటారు. సంస్కృతంలో ఈ మొక్కను కాకంగి, కకనస అనే పేర్లతో పిలుస్తారు.

గరుడ ముక్కు
గరుడ ముక్కు మొక్క చిత్రపటం.
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Family:
Genus:
Species:
ఎం. ఆన్యువా
Binomial name
మార్టీనియా ఆన్యువా
Synonyms

మార్టీనియా డయాండ్రా

ఉపయోగాలు మార్చు

 
కొక్కెం కలిగిన గరుడ ముక్కు పండ్లు.
 
Martynia annua

మొక్క ఆకుల రసం మూర్ఛ వ్యాధికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆకుల రసం నిద్రలేమికి, క్షయ, బొంగురు గొంతుకు, విషపురుగుల కాటుకు, గండమాలకు ఉపయోగపడుతుంది [1][2][3] 2. విత్తనాల నుంచి తీసిన నూనెను తెల్లజుట్టుకు, దురదలకు, చర్మవ్యాధులకు వాడవచ్చును.

ఇతర విషయాలు మార్చు

మధ్యప్రదేశ్ ఏజన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఈ మొక్క కాండాన్ని తాంత్రిక, వశీకరణ చర్యలకు వాడుదురు.

 
గద్దముక్కు చెట్టు. నాగార్జున సాగర్ వద్ద తీసిన చిత్రము

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2012-10-08. Retrieved 2012-08-08.
  2. Phytochemical and Pharmacognostical studies of Martynia Annua plant - by Katare Vivekanand, Pathak A.K, Kori M.L, Chakraborty Bodhisattwa, Nandy Subhangkar
  3. ournal of Pharmacognosy and Phytochemistry - Vol. 1 No.6 2013, www.phytojournal.com, Page |135, Martynia annua, L.: A Review on Its Ethnobotany, Phytochemical and Pharmacological Profile, Ashwani K Dhingra, Bhawna Chopra, Sanjeev K Mittal

లంకెలు మార్చు