గీత గోవిందం (సినిమా)

2018 తెలుగు - కన్నడ చిత్రం మరియు పరశురామ్ దర్శకత్వం లో విడుదల చేసిన చిత్రం

గీత గోవిందం 2018 లో పరశురామ్ దర్శకత్వంలో విడుదలైన హాస్య ప్రేమ కధా తెలుగు చిత్రం.[1] ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మించాడు. గోపీ సుందర్ స్వరాలు సమకూర్చాడు.ఇది ఆగష్టు 15, 2018 న భారతదేశంలో, 14 ఆగస్టు 2018 న US లో విడుదలైంది. విడుదలైన వెంటనే ప్రజలనుండి మంచి చిత్రం గా బాగా ప్రజాదారణ పొందింది.[2]

గీత గోవిందం
సినిమా పోస్టర్
దర్శకత్వంపరశురామ్
నిర్మాతబన్నీ వాసు
తారాగణంవిజయ్ దేవరకొండ
రష్మికా మందన్న
సంగీతంగోపీ సుందర్
నిర్మాణ
సంస్థ
గీతా ఆర్ట్స్
విడుదల తేదీ
2018 ఆగస్టు 15 (2018-08-15)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

ఒక అర్ధరాత్రి, విజయ్ నిత్యా ను నడిరోడ్డులో కలవడంతో కథ ప్రారంభం అవుతుంది. నిత్య విజయ్ చాలా బాధగా ఉండటం గమనించి ఆరా తీస్తుంది. అప్పుడు విజయ్ తన కథ ఆమెకు చెబుతాడు. నీలు అనే విద్యార్థిని అతని వెంట పడుతూ ఉంటుంది. గుడికి వెళ్ళి అక్కడ అలంకరించేది గీత అనే అమ్మాయని తెలుసుకుంటాడు. ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు అని తెలుసుకుని చాలా ఆనందిస్తాడు.విజయ్ సోదరి నిశ్చితార్థం కోసం కాకినాడ వెళ్లాల్సి వస్తుంది. అనుకోకుండా గీత కూడా ఇతని తో పాటు అదే బస్సు లో ప్రయాణిస్తుంది. ఆమె కిటికీ పక్కన సీట్ లో కూర్చుంటుంది. ఆమె నిద్ర పోతూ వుండగా హీరో సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నిస్తాడు. అదే సమయంలో బస్సు కుదుపు కి గురి అవడంతో అతను ఆమెపై పడతాడు. విజయ్ క్షమించమని అడుగుతాడు. కానీ గీత అతని చేతిని కట్టేసి తన అన్నయ్యను ఫణీంద్రను పిలుస్తుంది. ఆ మరుసటి రోజు ఫణీంద్ర బస్సు చేరుకొని సంఘటన గురించి అడుగుతాడు. గీత అతను తప్పించుకుని పారిపోయాడు అని చెపుతుంది. విజయ్ తాను తప్పించుకున్నట్లు సంతోషపడతాడు కానీ తన పెళ్ళి చేసుకోబోతున్నది ఫణీంద్ర అని తెలుసుకుని షాక్ కి గురి అవుతాడు. బస్సు లో అల్లరి చేసినవాడు విజయ్ అని మొదట ఫణీంద్ర అనుమానిస్తాడు. కానీ తన చెల్లెలు, విజయ్ కాదు అని చెప్పడం తో ఆవిషయం మర్చిపోతాడు. విజయ్ గీత కు ధన్యవాదాలు చెపుతాడు. మీ చెల్లెలు పెళ్ళి ఇబ్బందుల్లో పడ్డం ఇష్టం లేక అల్లరి చేసింది నువ్వు కాదు అని అన్నయ్య తో చెప్పను అని చెపుతుంది.

గీత తండ్రి షాపింగ్ లో విజయ్ సాయం తీసుకోమని చెప్తాడు. ఆమె ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటుంది. అదే సమయం లో నీలు విజయ్ ఫోన్ కి ఒక చెత్త వీడియో పంపుతుంది. అనుకోకుండా అది చూసిన గీత కి విజయ్ మీద చెడు అభిప్రాయం ఇంకా బలపడిపోతుంది. గీత తన బాస్ ఇంటికి కి తన అన్నయ్య పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి వెళ్తుంది. గీత అక్కడ నీలు అమ్మని చూసి ఆశ్చర్య పోతుంది.గీ త ఆమెతో నీలు గురించి, ఆమె తో విజయ్ కి ఉన్న చేదు స్నేహం గురించి చెపుతుంది. అప్పుడు ఆమె విజయ్ గురించి చెప్పిన విషయం విని గీత షాక్ కి గురి అవుతుంది. హీరో విజయ్ ఎంత ఉత్తముడో వివరిస్తుంది. గీత విజయ్ తో ప్రేమలో పడుతుంది. తన అన్నయ్య తో బస్సు లో జరిగిన గొడవ గురించి మర్చిపోమని చెపుతుంది. కానీ ఆమె తన ప్రేమ గురించి విజయ్ తో చెప్పదు. గీత తాతయ్య కు హార్ట్ ఎటాక్ వస్తుంది. గీత నాన్నమ్మ ఫణీంద్రతో పాటే గీత్ కి కూడా మ్యారేజ్ చేసేయమని పట్టు బడుతుంది. ఫణీంద్ర విజయ్ అయితే మంచిదని అని అందరికి చెపుతాడు. అందుకు గీత ఒప్పుకుంటుంది కానీ విజయ్ కి గీత తనని ఆప్షన్ గా ఎంచుకోవడం నచ్చదు.

తారాగణం మార్చు

సాంకేతికవర్గం మార్చు

నిర్మాణం మార్చు

అభివృద్ధి మార్చు

చిత్రీకరణ మార్చు

సంగీతం మార్చు

పాటల జాబితా మార్చు

Song: ఇంకేం ఇంకేం కావాలె Music: గోపీ సుందర్ Lyrics: Ananta Sriram Singer: SidSriram

వాట్ ద లైఫ్, రచన: శ్రీమణి, గానం విజయ్ దేవరకొండ

ఏంటి ఏంటి , రచన: శ్రీమణి, గానం.చిన్మయి

వచ్చిందమ్మ , రచన: శ్రీమణి, గానం.సిద్ శ్రీరామ్

తనేమన్నది తనేమన్నదీ , రచన: అనంత శ్రీరామ్ ,గానం.అనురాగ్ కులకర్ణి

స్పందన మార్చు

మూలాలు మార్చు

  1. "Geetha Govindam first look: Vijay Devarakonda, Rashmika Mandanna share adorable chemistry in this new age romcom- Entertainment News, Firstpost". Firstpost (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2013-07-12. Retrieved 2018-07-12.
  2. "Geetha Govindam box office collection: Vijay Deverakonda-Rashmika Mandanna starrer storms box-office, enters 100 crore club". The Times of India. Retrieved 31 May 2020.

బయటి లంకెలు. మార్చు