గుడ్లవల్లేరు

ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండల గ్రామం

గుడ్లవల్లేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలం లోని గ్రామం. ఇదే మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన గుడివాడ నుండి 12 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2961 ఇళ్లతో, 10491 జనాభాతో 775 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5062, ఆడవారి సంఖ్య 5429. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3316 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 544. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589606[1].పిన్ కోడ్: 521356.

గుడ్లవల్లేరు
—  రెవెన్యూ గ్రామం  —
గుడ్లవల్లేరు is located in Andhra Pradesh
గుడ్లవల్లేరు
గుడ్లవల్లేరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°21′00″N 81°03′00″E / 16.3500°N 81.0500°E / 16.3500; 81.0500
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గుడ్లవల్లేరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 10,902
 - పురుషులు 5,692
 - స్త్రీలు 5,210
 - గృహాల సంఖ్య 2,761
పిన్ కోడ్ 521356
ఎస్.టి.డి కోడ్ 08674

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల ఉంది. ఒక ప్రైవేటు పాలీటెక్నిక్ ఉంది. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప వైద్య కళాశాల విజయవాడలోను, మేనేజిమెంటు కళాశాల గుడివాడలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడలో ఉన్నాయి. గుడ్లవల్లేరు గ్రామంలో అనేక విద్యాసంస్థలు ఉన్నాయి.

  • ఇంజినీరింగ్ కళాశాల.
  • ఏ.ఏ.ఎన్.ఎం & వి.వి.ఆర్.ఎస్.ఆర్.పాలిటెక్నిక్ కళాశాల:- ఈ కళాశాల వ్యవస్థాపకులు కీ.శే. అడుసుమిల్లి అశ్వత్థనారాయణమూర్తి.
  • వి.వి.ఫార్మశీ కళాశాల.
  • శ్రీ వల్లభనేని రంగయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  • ఎస్.ఈ.ఆర్.ఎం.ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో 1982-83 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన 150 మంది విద్యార్థులు, 33 సంవత్సరాల తరువాత, 2016, సెప్టెంబరు- 25వ తేదీ ఆదివారంనాడు, ఈ పాఠశాల ప్రాంగణంలో కలుసుకొని తమ చిన్ననాటి ఙాపకాలను నెమరువేసుకున్నారు. తమకు చదువు నేర్పించిన గురువులను సన్మానించారు.
  • గ్రంథాలయం.

వైద్య సౌకర్యం మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

గుడ్లవల్లేరులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, 9 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

అలోపతి ఆసుపత్రి, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.కొసరాజు వెంకటరామకృష్ణారావు ప్రభుత్వ హోమియో వైద్యశాల.

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ముగ్గురు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ముగ్గురు, డిగ్రీ లేని డాక్టర్లు ఐదుగురు, ఒక నాటు వైద్యుడు ఉన్నారు. ఆరు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం మార్చు

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు మార్చు

గుడ్లవల్లేరులో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది.

రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు మార్చు

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

విద్యుత్తు మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.ఈ కేంద్రానికి, ప్రభుత్వం సౌరవిద్యుత్తు కేంద్రాన్ని మంజూరుచేసింది. ఈ కేంద్రం భవనాలపై సౌరపలకలు ఏర్పాటుచేసి, ఆస్పత్రికి అవసరమైన విద్యుత్తును వినియోగించుకొని, మిగిలినది కేంద్రప్లాంటుకు తరలించేలాగా, ఏర్పాటుచేస్తున్నారు. [27]

భూమి వినియోగం మార్చు

గుడ్లవల్లేరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 295 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 479 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 479 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు మార్చు

గుడ్లవల్లేరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 479 హెక్టార్లు

ఉత్పత్తి మార్చు

గుడ్లవల్లేరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు మార్చు

వరి

పారిశ్రామిక ఉత్పత్తులు మార్చు

బియ్యం

సమీప గ్రామాలు మార్చు

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం

రైలు ప్రయాణ వసతి మార్చు

బ్యాంకులు మార్చు

  1. సప్తగిరి గ్రామీణ బ్యాంక్:- గ్రామంలోని పంచాయతీ కార్యాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఈ బ్యాంక్ (ఇండియన్ బ్యాంక్‌కు అనుబంధం) శాఖను, 2017, మార్చి-15న ప్రారంభించారు.

ఇతర వసతులు మార్చు

పిల్లల పార్కు మార్చు

గ్రామంలో పుల్లేరు కొత్తవంతెన ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఈ పార్కుని, 2016, నవంబరు-27న ప్రారంభించారు. ఈ పార్కులో తొలిగా పిల్లలు ఊగే పెద్ద ఊయలను ప్రారంభించారు. పెయింటర్ రత్నప్రసాదు, స్నేహలత దంపతులు ఈ పార్కులో శ్రీరాముల విగ్రహాలు, శివలింగం, నంది విగ్రహం ఏర్పాటు చేసి ఇక్కడ పిల్లలు ఆడుకునేటందుకు వీలుగా పార్కుని అభివృద్ధి చేసేటందుకు సంకల్పించారు.

డివిజన్ రైతు శిక్షణ కేంద్రం మార్చు

గ్రామంలో, డివిజన్ పశుసంవర్ధకశాఖ కార్యాలయం వెనుక, నూతనంగా 60 లక్షల రూపాయల నాబార్డు నిధులతో ఈ కార్యాలయానికి రెండస్థుల భవన నిర్మాణం, 2016, జూన్‌లో ప్రారంభించారు. 31-5-2017కి నిర్మాణం పూర్తికాగలదు.

త్రాగునీటి సౌకర్యం మార్చు

మంచినీటి చెరువు:- 18 ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువుకు మార్చి నుండి జూన్ వరకు, నీరు చిత్రం పంట కాలువనుండి జి.యి.సి.పక్కనుండి బోదే ద్వారా వస్తుంది.

కొత్త చెరువు:- గ్రామంలోని అంబేద్కర్ నగర్ లో, ఆరు ఎకరాల విస్తీర్ణంలో, 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, ఈ మంచినీటి చెరువు ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ చెరువు నీటిని, అంబేద్కర్ నగర్, నీలకంఠేశ్వరపురం, కొత్తగా ఏర్పాటు చేయుచున్న చంద్రబాబునగర్ కాలనీ వాసుల త్రాగునీటి అవసరాలకు ఉపయోగించెదరు.

అగ్రహారం చెరువు:- ఇటీవల ఈ చెరువును 2.6 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధిచేసారు.

గ్రామ పంచాయతీ మార్చు

  • నీలకంఠేశ్వరపురం, గుడ్లవల్లేరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
  • గుడ్లవల్లేరు గ్రామ పంచాయతీ భవనాన్ని 1968 లో నిర్మించారు.
  • 2013 జూలైలో గుడ్లవల్లేరు గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో చాపరాల బాలాజీ, సర్పంచిగా ఎన్నికైనాడు. ఉప సర్పంచిగా వల్లభనేని సుబ్బారావు చౌదరి ఎన్నికైనాడు.
  • చాపరాల బాలాజీ, 2016, జనవరి-13న గుడ్లవల్లేరు గ్రామ పంచాయతీ సర్పంచి పదవికి రాజీనామా చేసాడు.
  • గుడ్లవల్లేరు గ్రామ ఉపసర్పంచిగా ఉన్న వల్లభనేని వెంకటసుబ్బరావు చౌదరి, 2016, జనవరి-18న, ఇంఛార్జ్ సర్పంచిగా, పదవీ స్వీకారం చేసాడు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం మార్చు

ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమి సందర్భంగా (మే నెలలో) వైభవంగా నిర్వహించెదరు. ఈ కార్యక్రమాలలో భాగంగా స్వామివార్ల కళ్యాణం నిర్వహించెదరు.

ఈ ఆలయ 200 వ వార్షికోత్సవాలను 2016, మే-19వ తేదీ గురువారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా, గురువారం స్వామివారికి పంచామృత స్నపన, విశేషార్చనలు నిర్వహించి, స్వామివారిని పెళ్ళికుమారుని చేసారు. శుక్రవారం రాత్రి దివ్య తిరుకళ్యాణోత్సవం, శనివారం గరుడోత్సవం ఆదివారం పవళింపుసేవలు నిర్వహించెదరు.

శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయం మార్చు

ఈ పురాతన ఆలయ 17వ వార్షికోత్సవాలు, 2014, జూన్-13వ తేదీ శుక్రవారం నుండి 16వ తేదీ సోమవారం వరకు వైభవంగా నిర్వహించారు.

ఈ ఆలయంప్రాంగణంలో, శ్రీ వల్లభనేని జగన్మోహనరావు, శాంతకుమారి దంపతులు అందజేసిన మూడు లక్షల రూపాయల విరాళంతో, నూతనంగా నిర్మించిన యాగశాల భవనాన్ని, 2015, జూన్-4వ తేదీ గురువారంనాడు, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, ప్రారంభించారు.

2017, ఫిబ్రవరి-24న మహాశివరాత్రి సందర్భంగా, ఈ ఆలయంలో 2017, ఫిబ్రవరి-22న, ఇత్తడితో తయారుచేసిన, ఐదున్నర అడుగుల ఎత్తయిన భారీ శివలింగాన్ని ఏర్పాటు చేసారు. దీనిని మచిలీపట్నంలో తయారు చేయించారు. ఈ శివలింగం చుట్టూ, 1,21,111 రుద్రాక్షలతో అలంకరించారు.

ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, 2017, జూన్-11వతేదీ ఆదివారం నుండి 13వతేదీ మంగళవారం వరకు వైభవంగా నిర్వహించారు.

శ్రీ వాసవీ పంచాయతన క్షేత్రంలోని శ్రీ నగరేశ్వరస్వామివారి ఆలయం మార్చు

శ్రీ సత్యనారాయణస్వామివారి అలయం మార్చు

రెండవ అన్నవరంగా ప్రసిద్ధిచెందిన ఈ ఆలయం, స్థానిక సంత రహదారిలో ఉంది. ఈ ఆలయంలో స్వామివారి 66వ వార్షిక బ్రహ్మోత్సవాలు, 2016, ఫిబ్రవరి-17వతేదీ బుధవారం నుండి ఒక వారంరోజులపాటు నిర్వహించారు.

శ్రీ సిద్ధిబుద్ధి విఘ్నేశ్వర స్వామివారి ఆలయం మార్చు

స్థానిక గౌడ వంశీయులకు చెందిన ఈ ఆలయం, బస్సుస్టాండ్ కూడలిలోని కొత్త వంతెన ప్రక్కన ఉంది.

శ్రీ బాలరెడ్డెంకమ్మ తల్లి ఆలయం మార్చు

మండలంలోని చింతలగుంట లో వేంచేసియున్న బెజవాడవారి ఇలవేలుపు అయిన శ్రీ బాలరెడ్డెంకమ్మ తల్లి (దేవరమ్మ తల్లి) వార్షిక ఉత్సవాలను 2016, మే-13వ తేదీ శుక్రవారం, 14వ తేదీ శనివారంనాడు వైభవంగా నిర్వహించారు. జిల్లా నలుమూలలనుండి బెజవాడ వంశస్థులు వేలాదిగా ఈ ఉత్సవానికి తరలివచ్చారు. గౌడ సంఘీయులలోని బెజవాడ వంశస్థుల ఇలవేలుపుగా అమ్మవారికి, ప్రతి మూడు సంవత్సరాలకొకసారి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వచ్చుచున్నది. 14వ తేదీ శనివారం ఉదయం మాత వివాహం, సానికి చెరగడం, మద్యాహ్నం పిల్లా పాపలతోసహా వందలాది కుటుంబాలు స్థానిక పుట్టపొలం వద్ద పేగుచుట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరి చుట్టూ పేగు చుట్టడంతో సందడి నెలకొన్నది. రాత్రికి బంగారు పుట్టలో అమ్మవారిని పెట్టడం, తదుపరి గజాల కొలువు జరిపినారు. 15వ తేదీ ఆదివారం ఉదయం అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. అమ్మవారి ఘటం పోతురాజు గడలతో భక్తులు ఊరేగింపులో పాల్గొని పూజాధికాలు నిర్వహించారు. అనంతరం మహిళలు కుంభ, పాల నైవేద్యాలను నిర్వహించారు. పెద్ద యెత్తున పోటుగొర్రెను జరిపినారు. మొక్కుబడులను చెల్లించుకొని పెద్దయెత్తున విందుభోజనాలు చేసారు.

శ్రీ అంకమ్మ తల్లి ఆలయం మార్చు

మండలంలోని తాడిచెర్లలో వేంచేసియున్న, పల్లెం వంశస్థుల ఇలవేలుపు అయిన శ్రీ అంకమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఏడు సంవత్సరాల తరువాత 2016, మే-18వ తేదీ బుధవారంనుండి 22వ తేదీ ఆదివారం వరకు వైభవంగా నిర్వహించెదరు. 18వతేదీ బుధవారం పసుపు, కుంకుమలు తీసికొనిరావడం, గామోత్సవం, చల్దినైవేద్యాలు, 22వతేదీ ఆదివారంనాడు కోరలబండి మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు. ప్రతి రోజూ గ్రామోత్సవం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు.

శ్రీ దాసాంజనేయస్వామివారి ఆలయం మార్చు

ఈ పురాతన ఆలయం స్థానిక వార్ఫురోడ్డులో ఉంది. 2014, నవంబరు-30, ఆదివారం నాడు ఈ ఆలయంలో, శ్రీ ఆంజనేయస్వామివారి జన్మనక్షత్రమైన పూర్వాభాద్రను పురస్కరించుకొని, ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో, ఆనాటినుండి స్వామివారి జన్మనక్షత్రం నాడు పూజలు చేయుటలేదు. తొలిసారిగా ఈ పూజలను ఆదివారం నుండి ప్రారంభించారు. స్థానిక యువకుల కృషితో దీనికి బీజం పడినది. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, తమలపాకు పూజలు, విశేష అర్చనలు నిర్వహించారు.

ఈ అలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి సందర్భంగా స్వామివారి ఉత్సవాలు ఐదురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు.

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం మార్చు

స్థానిక రైల్వే స్టేషను రహదారిలోని ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి సందర్భంగా, ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. విచ్చేసిన భక్తులకు, పానకం, వడపప్పు, తీర్ధప్రసాదాలు అందజేసెదరు.

కొండాలమ్మ ఆలయం మార్చు

శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం మార్చు

స్థానిక మంచినీటు చెరువు ప్రక్కన ఉన్న ఈ ఆలయంలో, 2015, ఆగష్టు-16వ తేదీ, శ్రావణమాసం, మొదటి ఆదివారంనాడు, అమ్మవారి జాతరను, 160 కుటుంబాలకు చెందిన రజక సంఘీయులు, సంయుక్తంగా వైభవంగా నిర్వహించారు.

శ్రీ విఙానందాశ్రమం మార్చు

గ్రామంలో ఆధ్యాత్మిక విశేషాలు మార్చు

ఈ గ్రామంలోని రజకసంఘీయులు, 2015, మే నెల-3వతేదీ ఆదివారం వైశాఖ మాసం, శుద్ధ చతుర్దశి రాత్రి, 18 సంవత్సరాల తరువాత, శ్రీ వీరభద్రుని పళ్ళెం పట్టే కార్యక్రమంలో, భారీగా ఉత్సవాలను నిర్వహించారు. శ్రీ సిద్ధేశ్వరస్వామి వారి ఆలయం నుండి మహిళలు, పళ్ళేలలో జ్యోతులతో వెంటరాగా, శ్రీ వీరభద్రస్వామిని ట్రాక్టరుపై ఉంచి, మేళతాళాలతో ఊరేగింపుకు తరలినారు. శ్రీశైలం, సత్తుపల్లి గ్రామాలకు చెందిన వీరశైవజంగాలు, శ్రీ శివపార్వతులు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, నందివాహనం, శ్రీ నరసింహస్వామి, కళారూపాలతో ఆకట్టుకున్నారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో గ్రామంలోని, ప్రధాన, అంతర్గత రహదారులలో ఊరేగింపు సాగినది. హిరణ్యకశిపుని వధ, శివతాండవం, శ్రీ వినాయక నృత్యం, పార్వతీమాత అభినయం, శివగణాల వీరంగం వంటి జానపదరూపాలను కళ్ళకు కట్టినారు. ఉదయం, వీరభద్రునిక కట్టిన ఆనను తొలగించడంతో ఉత్సవాలు ముగింపుమకు వచ్చినవి. ఈ కార్యక్రమంలో రజక సంఘీయులు పెద్దసంఖ్యలో పాల్గొని తీర్ధప్రసాదాలను స్వీకరించారు.

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, పశుసంపద.

గ్రామ ప్రముఖులు మార్చు

  • ఎర్నేని లీలావతీ దేవి స్వాతంత్ర్య సమర యోధురాలు.
  • వల్లభనేని రంగయ్య చౌదరి గుడ్లవల్లేరు సంత వ్యవస్థాపకులు, గుడ్లవల్లేరు గ్రామాభివృద్ధి సంఘం వ్యవస్థాపకులు. వీరిని గుడ్లవల్లేరు గ్రామ పితామహులుగా పేర్కొంటారు.
  • వల్లభనేని వెంకటరత్నం పశుపోషణలో జాతీయస్థాయిలో పేరెన్నికగన్న రైతు ప్రముఖులు. పాల దిగుబడిలో అత్యున్నత స్థాయికి చేరుకున్న వీరు 1986 లో నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీగారి మ్నుండి గోపాలరత్న పురస్కారం అందుకున్నారు. వీరు 76 సంవత్సరాల వయస్సులో 2016, నవంబరు-20న వయోభారంతో కన్నుమూసాడ. మరణానంతరం, అతని నేత్రాలను కుటుంబ సభ్యులు అతని అంగీకారంతో శంకర నేత్రాలయానికి అందజేసారు.
  • గద్దె రామతులశమ్మ ఆధ్యాత్మికవేత్త

గ్రామవిశేషాలు మార్చు

గడియారం స్థంభం మార్చు

1952లో స్థానిక బస్సు స్టాండ్ కూడలిలో, అర్యవైశ్య ప్రముఖులు శ్రీ కోట జ్వాలరామయ్య తదితరులు, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములుగారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నాలుగుస్తంభాల నడుమ, విగ్రహాన్ని ఏర్పాటుచేసి, పైన స్లాబ్ వేసినారు. 1958లో పంచాయతీ ఆ కట్టడంపై స్థూపాకారం నిర్మించి, అందులో గడియారాలను అమర్చారు. నాలుగువైపులా గడియారాలను పెట్టి, చుట్టూ విద్యుద్దీపాలను అమర్చారు. 1958లో నాటి శాసనసభ్యులు శ్రీ గరిమెళ్ళ నాగిరెడ్డి, దీనిని ఆవిష్కరించారు. అప్పట్లో గానుగ సున్నంతో కట్టిన ఈ కట్టడం, నేటికీ చెక్కుచెదరలేదు. పంచాయతీ నిర్లక్ష్యం వలన ఇది కళావిహీనంగా మారినది.

శ్రీ కొసరాజు వెంకటకృష్ణారావు చారిటబుల్ ట్రస్టు మార్చు

ఈ ట్రస్ట్ ద్వారా 8 సంవత్సరాలుగా నిత్యం నిరుపేద వృద్ధులు, అనాథలకు, వారి ఇళ్ళకే క్యారీజీలద్వారా, రెండుపూటలకూ సరిపడా భోజనపదార్ధాలు పంపించుచున్నారు. విన్నూతంగా ఇళ్ళకే నిత్యాన్నదానం చేయడాన్ని "ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్శ్" అను సంస్థ వారు గుర్తించి, ఈ ట్రస్ట్ పేరును నమోదు చేసుకున్నారు. ఈ సంస్థవారు, ఈ పురస్కారానికి సంబంధించిన గుర్తింపు పత్రం, ఙాపిక, బ్యాడ్జీలను, 2015, జూన్-13వ తేదెనాడు, కొసరాజు జీనియస్ సంస్థ, విజయవాడ ప్రాంత కో-ఆర్డినేటర్ శ్రీ ఎన్.రవికుమార్ ద్వారా, ట్రస్ట్ వారికి అందజేసినారు.

జవహర్ లాల్ నెహ్రూ పశువుల సంత మార్చు

దీనిని కీ.శే. వల్లభనేని రంగయ్య చౌదరి ఏర్పాటుచేసారు. గ్రామస్థులు ఆయన గ్రామానికి చేసిన సేవలకు గుర్తుగా ఆయన కాంస్యవిగ్రహాన్ని స్థానిక సంతరహదారిలో ఏర్పాటుచేసారు. ఈ సంత 65వ వార్షికోత్సవాన్ని, 2015, ఆగష్టు-12వ తేదీనాడు, కీ.శే. రంగయ్య వర్ధంతిని పురస్కరించుకొని, నిర్వహించారు. ఈ సందర్భంగా కీ.శే.రంగయ్య కాంస్యవిగ్రహానికి భారీగా పూలమాలలు వేసి అతనికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సంతలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు.

మూలాలు మార్చు

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు మార్చు