గులాబ్‌రాయ్ రాంచంద్

భారత క్రికెటర్

గులాబ్‌రాయ్ రాంచంద్ (జూలై 26, 1927 - సెప్టెంబర్ 9, 2003) (Gulabrai Ramchand) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత జట్టు తరఫున 33 టెస్ట్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు. ఆస్ట్రేలియా పై ఆడిన భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ఆ సిరీస్‌ను గెలిపించాడు. అదే కెప్టెన్‌గా అతని ఏకైక సిరీస్ కావడం గమనార్హం.[1]

గులాబ్‌రాయ్ రాంచంద్

జననం మార్చు

1927, జూలై 26కరాచిలో జన్మించాడు.

టెస్ట్ క్రికెట్ గణాంకాలు మార్చు

33 టెస్టులు ఆడిన రాంచంద్ 24.58 సగటుతో 1180 పరుగులు సాధించాడు. అందులో 2 సెంచరీలు, 5 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 109 పరుగులు. టెస్టులలో 41 వికెట్లు కూడా సాధించాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 49 పరుగులకు 6 వికెట్లు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్ గణాంకాలు మార్చు

గులాబ్‌రాయ్ 145 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 36.30 సగటుతో 6026 పరుగులు సాధించాడు. అందులో 16 సెంచరీలు, 28 అర్థసెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 230 (నాటౌట్) . బౌలింగ్‌లో 255 వికెట్లు సాధించాడు.

మరణం మార్చు

2003, సెప్టెంబర్ 9ముంబాయిలో రాంచంద్ మరణించాడు.

మూలాలు మార్చు

  1. "Gulabrai Ramchand". ESPNcricinfo. Retrieved 1 August 2016.