గోవిందరావుపేట మండలం

తెలంగాణ ములుగు జిల్లా లోని మండలం

గోవిందరావుపేట మండలం, తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాకు చెందిన మండలం.[1].[2] 2016 పునర్వ్యవస్థీకరణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేరిన ఈ మండలం, 2019 లో చేసిన మరో పునర్వ్యవస్థీకరణలో ములుగు జిల్లాలో భాగమైంది.[3][4] ప్రస్తుతం ఈ మండలం ములుగు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 4 నిర్జన గ్రామాలు.ఈ మండల ప్రధాన పరిపాలనా కేంద్రం, గోవిందరావుపేట

గోవిందరావుపేట
—  మండలం  —
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, గోవిందరావుపేట స్థానాలు
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, గోవిందరావుపేట స్థానాలు
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, గోవిందరావుపేట స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°16′53″N 80°19′04″E / 18.281518°N 80.317841°E / 18.281518; 80.317841
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ములుగు జిల్లా
మండల కేంద్రం గోవిందరావుపేట
గ్రామాలు 10
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 30,738
 - పురుషులు 15,320
 - స్త్రీలు 15,418
అక్షరాస్యత (2011)
 - మొత్తం 57.20%
 - పురుషులు 68.90%
 - స్త్రీలు 45.42%
పిన్‌కోడ్ 506344

జిల్లాలకు మార్పులు మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్​ జిల్లా పటంలో మండల స్థానం

వరంగల్ జిల్లా నుండి జయశంకర్ జిల్లాకు మార్చు

లోగడ గోవిందరావుపేట గ్రామం/ మండలం, వరంగల్ జిల్లా, ములుగు రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా గోవిందరావుపేట మండలాన్ని (0+14) పద్నాలుగు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[5]. ఈ మండల ప్రధాన పరిపాలనా కేంద్రం, గోవిందరావుపేట

జయశంకర్ జిల్లా నుండి ములుగు జిల్లాకు మార్చు

2018 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం ములుగు జిల్లాను ఏర్పాటు చేసింది. మరో 8 మండలాలతో పాటు గోవిందరావుపేట మండలాన్ని కూడా కొత్త జిల్లాలోకి చేర్చారు.[2][6]

గణాంకాలు మార్చు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం - మొత్తం 30,738 - పురుషులు 15,320 - స్త్రీలు 15,418.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 343 చ.కి.మీ. కాగా, జనాభా 30,738. జనాభాలో పురుషులు 15,320 కాగా, స్త్రీల సంఖ్య 15,418. మండలంలో 8,366 గృహాలున్నాయి.[7]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. మచ్చాపూర్
  2. చాల్వాయి
  3. బుస్సాపూర్
  4. రంగాపూర్
  5. మొట్లగూడెం
  6. ముత్తాపూర్
  7. పస్రనగరం
  8. లక్నవరం
  9. కర్లపల్లి
  10. రాంపూర్

గమనిక:నిర్జన గ్రామాలు 4 పరిగణనలోకి తీసుకోబడలేదు.

మండలం లోని దేవాలయాలు మార్చు

పస్ర గ్రామంలోని శ్రీరామాలయం

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. 2.0 2.1 https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/MULUGU.PDF
  3. "ములుగు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  4. https://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/MULUGU.PDF
  5. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-26. Retrieved 2017-11-29.
  6. "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 Feb 2019. Retrieved 17 Feb 2019.
  7. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు