గౌతమి (నటి)

సినీ నటి

తాడిమల్ల గౌతమి (జననం 1969 జూలై 2) తెలుగు, తమిళ సినిమా నటి. ఈమె విశాఖపట్నంలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదువుతుండగా సినిమాలలో నటించే అవకాశమొచ్చింది. ఈమె ఏసుక్రీస్తు జీవితగాథను చిత్రీకరించిన దయామయుడు సినిమాతో రంగప్రవేశం చేసింది. ఈమె గురు శిష్యన్ సినిమాతో తమిళ సినిమా రంగములో ప్రవేశించినది. ఇందులో రజనీకాంత్ సరసన నటించినది.

గౌతమి
జననం
తాడిమల్ల గౌతమి

(1969-07-02) 1969 జూలై 2 (వయసు 54)
విద్యాసంస్థగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (గీతం) యూనివర్సిటీ, విశాఖపట్నం
వృత్తినటి, టీవీ హోస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త
క్రియాశీల సంవత్సరాలు1987 – 1998
2015 – ప్రస్తుతం
రాజకీయ పార్టీఏఐడీఎంకే (2024-)
జీవిత భాగస్వామిసందీప్ భాటియా
(1998–1999) (విడాకులు)
భాగస్వామికమలహాసన్
(2004–2016)
పిల్లలుసుబ్బులక్ష్మి (జ. 1999)
బంధువులుసౌమ్య బొల్లాప్రగడ (మేనకోడలు)

గౌతమి, జెంటిల్మన్ సినిమాలో ప్రభుదేవాతో కలిసి డ్యాన్స్ చేసిన చికుబుకు రైలే పాట చాలా ప్రాచుర్యము పొందినది.

వ్యక్తిగత జీవితం మార్చు

గౌతమి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో టి. ఆర్. శేషగిరిరావు, వసుంధరా దేవి దంపతులకు జన్మించింది.[1] ఆమె తండ్రి ఆంకాలజిస్ట్ కాగా తల్లి పాథాలజిస్ట్. గౌతమి బెంగుళూరులోని బిషప్ కాటన్ బాలికల పాఠశాలలో చదువుకుంది.

ఆమె 1998 జూన్ 4న చెన్నైలో సందీప్ భాటియా అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు సుబ్బులక్ష్మి అనే కుమార్తె 1999లో జన్మించింది. తర్వాత వారు 1999లో విడాకులు తీసుకున్నారు.

ఆ తరువాత 2004 నుండి 2016 వరకు నటుడు కమల్ హాసన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్న గౌతమి అతనితో తన సంబంధాన్ని ముగించుకున్నట్లు తన బ్లాగ్‌ ద్వారా ప్రకటించింది. "నేను మిస్టర్ హాసన్ ఇకపై కలిసి లేమని ఈ రోజు చెప్పడం నాకు హృదయ విదారకంగా ఉంది. దాదాపు 13 సంవత్సరాల తరువాత, నా జీవితంలో నేను తీసుకున్న అత్యంత వినాశకరమైన నిర్ణయాలలో ఇది ఒకటి.." అని గౌతమి తన బ్లాగ్‌లో రాసుకుంది.[2]

ఆమె 35 సంవత్సరాల వయస్సులో ఆమె రొమ్ము క్యాన్సర్‌తో బాధపడింది. ఆ తర్వాత కోలుకుంది.[3]

కొన్ని తెలుగు చిత్రాలు మార్చు

రాజకీయ జీవితం మార్చు

గౌతమి 1997లో భారతీయ జనతా పార్టీలో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2023 అక్టోబర్ 23న బీజేపీ పార్టీకి రాజీనామా చేసింది.[4] ఆమె 2024లో అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ సీఎం ఎడపడి కె. పలనిసామి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ఏఐడీఎంకే) పార్టీలో చేరింది.[5]

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. "Actress Gautami About Her Telugu Movies @SakshiTVCinema - YouTube". web.archive.org. 2023-02-02. Archived from the original on 2023-02-02. Retrieved 2023-02-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Gautami opens up on Kamal Haasan: After 13 years together, our paths have irreversibly diverged". India.com. 2 Nov 2016. Archived from the original on 2 November 2016.
  3. "'మీకేం కాదు... నేను చెబుతున్నా కదా '". web.archive.org. 2023-02-02. Archived from the original on 2023-02-02. Retrieved 2023-02-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. Namasthe Telangana (23 October 2023). "బీజేపీకి రాజీనామా చేసి న‌టి గౌత‌మి తాడిమ‌ళ్ల". Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.
  5. Eenadu (14 February 2024). "అన్నాడీఎంకేలో చేరిన సినీనటి గౌతమి". Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.