గ్యాంగ్ (2018 సినిమా)

గ్యాంగ్ 2018లో విడుదలైన తెలుగు సినిమా. స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లపై జ్ఞానవేల్‌ నిర్మించిన ఈ సినిమాకు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాడు. సూర్య , కీర్తి సురేష్, రమ్యకృష్ణ, కార్తిక్, బ్రహ్మానందం, నంద, ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 12న విడుదలైంది.[1]

గ్యాంగ్
దర్శకత్వంవిఘ్నేష్ శివన్
దీనిపై ఆధారితంస్పెషల్ 26 ఆధారంగా
నిర్మాతకే. ఈ. జ్ఞానవేల్‌
తారాగణం
ఛాయాగ్రహణందినేష్ కృష్ణన్
కూర్పుఏ. శ్రీకర్ ప్రసాద్
సంగీతంఅనిరుధ్ రవిచందర్
నిర్మాణ
సంస్థలు
స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్స్, యూవీ క్రియేషన్స్
విడుదల తేదీ
2018 జనవరి 12 (2018-01-12)
సినిమా నిడివి
138 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బాక్సాఫీసు90 కోట్లు

కథ మార్చు

తిలక్ (సూర్య), బుజ్జమ్మ( రమ్యకృష్ణ) ఇద్దరూ కలిసి మరికొందరితో కలిసి ఒక గ్యాంగ్‌గా ఏర్పడి నకిలీ సీబీఐ ఆఫీసర్లుగా, నకిలీ ఇన్‌కంటాక్స్ ఆఫీసర్లుగా రైడ్స్ చేస్తూ అవినీతి పరులకు వద్ద ఉండే బ్లాక్ మనీ కొట్టేస్తుంటారు. అది అవినీతి సొమ్ము కావడంతో ఎవరూ కంప్లయింట్ చేయడానికి సాహసించరు. ఈ గ్యాంగ్ చేసే పనులు పోలీస్, సీబీఐ, ఇన్‌కంటాక్స్ డిపార్టుమెంటుకు తలనొప్పిగా మారుతుంది. వీరి ఆటకట్టించడానికి స్పెషల్ ఆఫీసర్ శివశంకర్ (కార్తీక్) రంగంలోకి దిగుతాడు. ఈ గ్యాంగ్ ఇదంతా ఎందుకు చేస్తోంది? ఆ డబ్బంతా వారు ఏం చేస్తున్నారు? అనేదే మిగతా సినిమా కథ.[2][3]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

మూలాలు మార్చు

  1. The Times of India (2018). "Gang Movie: Showtimes". Archived from the original on 19 June 2022. Retrieved 19 June 2022.
  2. The Times of India (2018). "Gang Movie Review {3.5/5}: Critic Review of Gang". Archived from the original on 19 June 2022. Retrieved 19 June 2022.
  3. Sakshi (12 January 2018). "మూవీ రివ్యూ: సూర్య 'గ్యాంగ్‌'". Archived from the original on 19 June 2022. Retrieved 19 June 2022.