చంచల్‌గూడ జైలు, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులోని చంచల్‌గూడలో ఉంది.దీనిని సెంట్రల్ జైలు అనిఅంటారు. చంచల్‌గూడలో ఉన్నందున దీనికి అదేపేరు స్థిరపడింది.తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ పరిధిలో దీని పాలనా నిర్వహణ సాగుతుంది. పెద్దమనుషుల ఒప్పందం కుదిరి, 1956 నవంబరు 1 న ఆధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.1956 నవంబర్ 1 న జరిగిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జైళ్ల విభాగం ఉనికిలోకి వచ్చింది.ప్రారంభంలో జైళ్ల శాఖలో కొన్ని సెంట్రల్ జైళ్లు, జిల్లా జైళ్లు,సబ్ జైళ్లు మాత్రమే ఉండేవి.న్యాయవ్యవస్థ నియంత్రణ నుండి సబ్ జైళ్ల పరిపాలనను జైళ్ల శాఖకు బదిలీ చేయడానికి 1976 లో ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాన్ని అనుసరించి, జైళ్ల విభాగం తనను తాను ఒక ప్రధాన విభాగంగా విస్తరించబడింది.[1]

చంచల్‌గూడ జైలులో స్త్రీల ఖైదీలు ఉండే ఒక బ్యారెక్

దేశంలోని అత్యంత ప్రగతిశీల జైళ్ల విభాగాలలో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది.దేశంలోని ఇతర రాష్ట్రాలలోని జైళ్లలోని అనుకరించబడిన అనేక దూర సంస్కరణలు ప్రవేశపెట్టబడినట్ల్లు తెలుస్తుంది. జైళ్లలో స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు, గ్యాస్ వంట వ్యవస్థను ప్రవేశపెట్టడం,1980 లో పొడి రకం మరుగుదొడ్ల స్థానంలో సెప్టిక్ మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం, నిరంతరాయంగా నీటి సరఫరా, ఖైదీలకు వినూత్న వృత్తి శిక్షణా కార్యక్రమాలను ప్రవేశపెట్టడం,ఆధునిక వైద్య సౌకర్యాలు కల్పించబడ్డాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ విభజించిన తరువాత ఇది తెలంగాణ రాష్ట్ర జైళ్ల విభాగం పరిధిలోకి వచ్చింది.ఇటీవలి కాలంలో, తెలంగాణ రాష్ట్ర జైళ్ల విభాగం దేశంలో మొదటిసారిగా జైళ్లు, కోర్టుల మధ్య వీడియో లింకేజ్ వ్యవస్థను ప్రవేశపెట్టడంలో ప్రత్యేకమైన ప్రత్యేకతను సాధించింది. ఇది అండర్ట్రియల్ ఖైదీలకు త్వరగా న్యాయం చేయటానికి వీలు కల్పించింది.[1]

పూర్వ చరిత్ర మార్చు

భారతదేశంలోని పురాతన జైళ్లలో హైదరాబాద్‌లో ఉన్న చంచల్‌గూడ సెంట్రల్ జైలు ఒకటి.ఇది హైదరాబాద్ పాత నగరప్రాంతానికి చెందిన చంచల్‌గూడలో ఉంది. దీని ప్రధాన వాస్తుశిల్పి నవాబ్ ఖాన్ బహదూర్ మీర్జా అక్బర్ బేగ్.నిజాం పాలకుడి పాలనలో నిజాం-ఉల్-ముల్క్ అనే పేరుతో 1876లో దీనిని నిర్మించారు.మొత్తం భూమి విస్తీర్ణం 49.32 ఎకరాలు.ఈ జైలులో మొత్తం 1000 మంది ఖైదీల సామర్థ్యం ఉంది.బ్యారక్స్ సంఖ్య 23, వాచ్ టవర్లు నాలుగు, నివాస గృహాలు 93,ఆసుపత్రి భవనం ఒకటి. తయారీ వర్క్‌షాప్ ఒకటి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత గురు ప్రతాప్ ఈ జైలు మొదటి సూపరింటెండెంటుగా పనిచేశాడు.దోషులుగా తేలి, రెండు సంవత్సరాలకు మించి జైలు శిక్ష విధించబడిన ఖైదీలు జైలు శిక్ష ఈ జైలులోనే ఉంటుంది.1989-90లో ఖైదీలుకు వయోజన అక్షరాస్యత కార్యక్రమం ప్రవేశపెట్టి, 100% అక్షరాస్యత సాధించింది. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్శిటీ తరుపున అధ్యయన కేంద్రాన్ని దేశంలో కలిగి ఉన్న జైళ్లలో ఇది మొదటి జైలు.ఈ జైలు తరుపున ఒక పెట్రోల్ స్టేషన్ కూడా నిర్వహించబడుతుంది.ఇది హైదరాబాదులోనే అత్యధిక లాభాలు ఆర్జించే పెట్రోలు పంపుగా గుర్తించబడింది.[1]

తరలింపు ప్రతిపాదన మార్చు

చంచల్‌గూడ జైలును త్వరలో చర్లపల్లి కేంద్ర కారాగారం ఖైదీల వ్యవసాయ కాలనీ (పిఎసిసి) కొత్త ప్రాంగణానికి తరలించనున్నట్లుగా తెలుస్తుంది.[2]

చంచల్‌గూడ జైలులో నిర్బంధించబడిన పేరొందిన నేరగాళ్ళు:

  1. నకిలీ స్టాంపుల కుంభకోణం సృష్టించిన అబ్దుల్‌ కరీం తెల్గీ
  2. కోట్లాది రూపాయలను కొల్లగొట్టిన కృషి బ్యాంకు ఛైర్మన్‌ కోసరాజు వెంకటేశ్వరరావు
  3. దీపికా చిట్‌ఫండ్‌‌ అధిపతి బాలాజీ
  4. వాసవి బ్యాంకు ఛైర్మన్‌ గంజి రాజమౌళి గుప్తా
  5. పాస్‌పోర్టు, మాఫియా నాయకుడు అబూసలేం
  6. అబూసలేం ప్రియురాలు మోనికాబేడీ (సినీ నటి)
  7. నాగార్జున ఫైనాన్స్ ఎండి కె.ఎస్‌. రాజు
  8. నాగార్జున ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్‌ జిఎస్‌ రాజు
  9. సత్యం కంప్యూటర్స్ ఛైర్మన్‌ రామలింగరాజు అతడి సోదరుడు రామరాజు

జైలు సూపరింటెండెంట్‌ మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 "TS Prisons Department". tsprisons.gov.in. Archived from the original on 2020-02-18. Retrieved 2020-08-08.
  2. Feb 11, Koride Mahesh / TNN /; 2017; Ist, 10:00. "prisons department: Chanchalguda jail shift picks up pace | Hyderabad News - Times of India". The Times of India. Retrieved 2020-08-08. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)

వెలుపలి లంకెలు మార్చు