చక్రాయపాలెం (కొల్లిపర మండలం)

ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా గ్రామం

చక్రాయపాలెం గుంటూరు జిల్లా, కొల్లిపర మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

చక్రాయపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
చక్రాయపాలెం is located in Andhra Pradesh
చక్రాయపాలెం
చక్రాయపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°14′24″N 80°42′30″E / 16.240057°N 80.708259°E / 16.240057; 80.708259
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం కొల్లిపర
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ : 522301
ఎస్.టి.డి కోడ్

గ్రామ చరిత్ర మార్చు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు మార్చు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామ భౌగోళికం మార్చు

సమీప గ్రామాలు మార్చు

చదలవాడ 2 కి.మీ., జెముడుపాడు 2 కి.మీ., జంపని 4 కి.మీ., నేలపాడు 4 కి.మీ., చివలూరు 5 కి.మీ.

గ్రామంలో మౌలిక వసతులు మార్చు

అంగనవాడీ కేంద్రం:- ఈ గ్రామంలో ఆరున్నర లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంగనవాడీ కేంద్రనికి, 2015,డిసెంబరు-6వ తేదీనాడు శంకుస్థాపన నిర్వహించారు.

గ్రామ ప్రముఖులు మార్చు

ఈ వూరివారైన శ్రీ రెడ్రౌతు నారాయణగారు, ప్రజాప్రతినిధిగా కాకపోయినా, గ్రామాభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించారు. గ్రామంలో పశువైద్యశాల లేక గ్రామస్థులు అగచాట్లు పడుచుంటే, నారాయణగారు ఈ విషయాన్ని మంత్రులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొనివెళ్ళి, తన స్వంత స్థలం 4 సెంట్ల భూమిని విరాళంగా ఇచ్చారు. ఆ స్థలంలో రు.1.75 లక్షలతో గ్రామానికి పశువైద్యశాల రూపుదిద్దుకున్నది. 1993లో అప్పటి పశుసంవర్ధక శాఖా మంత్రి శ్రీ ఎన్.రఘువీరారెడ్డి, హోం శాఖామంత్రి ఆలపాటి ధర్మారావు, ఎం.ఎల్.ఏ గుదిబండి వెంకటరెడ్డి, పశువైద్యశాలను ప్రజలకు అంకితం చేశారు. దానికి కృషి చేసిన నారాయణగారిని సత్కరించారు. గ్రామంలోని విద్యార్థులకు చదువుకోవడానికి పాఠశాల గది నిర్మాణానికి నారాయణగారు రు.60,000 ఆర్థిక సాయం అందించారు. నారాయణగారి కృషి వలన నేడు 80% కుటుంబాలు పశుపోషణ చేస్తున్నాయి. ప్రజలు పాడితో అధిక ఆదాయం ఆర్జిస్తూ ఆర్థికంగా అభివృద్ధిచెందుచున్నారు.

గ్రామ విశేషాలు మార్చు

ఈ గ్రామానికి చెందిన శ్రీ రెడ్రౌతు శ్రీనివాసరావు, కామేశ్వరి దంపతుల కుమార్తె రమ్య, 2014 మార్చిలో నిర్వహించిన ఇంటరు పరీక్షలలో, ఎం.ఈ.సి.విభాగంలో 982 మార్కులు సాధించి రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈమె చిన్నతనం నుండి సాధారణ పాఠశాలలలో చదివినది. 10వ తరగతిలో9.5 పాయింట్లు సాధించింది. ప్రస్తుతం సి.ఏ. సి.పి.టి చదువుచున్న ఈమె, మంచి ఛార్టర్డ్ అకౌంటెంటుగా స్థిరపడాలని కొరుకొంటున్నది.

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.