చింతకాయల అయ్యన్న పాత్రుడు

చింతకాయల ఆయ్యన్న పాత్రుడు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయనాయకుడు.

చింతకాయల అయ్యన్న పాత్రుడు
చింతకాయల అయ్యన్న పాత్రుడు


పదవీ కాలం
1996-98
ముందు కొణతాల రామకృష్ణ
తరువాత గుడివాడ గురునాథరావు
నియోజకవర్గం అనకాపల్లి

పదవీ కాలం
1983-89
నియోజకవర్గం నర్సీపట్నం

ఆంధ్రప్రదేశ్ సాంకేతికశాఖామత్యుడు
పదవీ కాలం
1984-86

పదవీ కాలం
1994-96
నియోజకవర్గం నర్సీపట్నం

పదవీ కాలం
2014- ప్రస్తుతం
నియోజకవర్గం నర్సీపట్నం

వ్యక్తిగత వివరాలు

జననం (1957-09-04)1957 సెప్టెంబరు 4
నర్సీపట్నం, విశాఖపట్నం జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి పద్మావతి,, ,,....
సంతానం ఇద్దరు కుమారులు - పెద్దకుమారుడు విజయ్ , చిన్నకుమారుడు రాజేష్...
నివాసం విశాఖపట్నం
మతం హిందూ
వెబ్‌సైటు [1]

బాల్యం మార్చు

చింతకాయల అయ్యన్న పాత్రుడు 4/9/ 1957 సంవత్సరంలో, విశాఖ జిల్లాలోని నర్శిపట్నంలో జన్మించాడు. ఇతడి తండ్రి వరహలు దొర.

విద్య మార్చు

ఇతదు కాకినాడలోని పి.ఆర్ కళాశాలలో బి.ఎ. పట్టా పొందాడు.

కుటుంబం మార్చు

ఇతడు జూన్ నెల 1 వ తారీకున 1983 న పద్మావతిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు.

చిరునామా మార్చు

శాశ్వతచిరునామ:శివపురం, కృష్ణదేవుపేట రోడ్, నర్సీపట్నం,531116

రాజకీయ ప్రస్తానం మార్చు

అయ్యన్న పాత్రుడు 1983-1989, 1994-1996 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ తరాపున నర్సీపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసన సభ సభ్యులుగా ఎన్నికయ్యాడు. 1984-1986 లో సాంకేతిక విద్యా మంత్రిగా ఉన్న సమయంలో అయ్యన్న స్థానికంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ ఏర్పాటుకు కృషిచేశారు. దీంతో పాటు ప్రభుత్వ సాంకేతిక శిక్షణ సంస్థ, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు.[1] 1994-96 లో రహదారులు, భవనాల శాఖా మంత్రిగా పనిచేశాడు. అప్పట్లో నియోజకవర్గం పరిధిలోని మారుమూల గ్రామాల పరిధిలోని వందల కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్డును ఆర్‌అండ్‌బీకి బదలాయించి, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. 1996 లో 11వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం తరుపున అనకాపల్లి లోఖ్ సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తరువాత అయ్యన్నను అటవీశాఖ మంత్రి పదవి వరించింది. ఆ సమయంలో నియోజకవర్గంలోని పెడిమికొండ నర్సరీ, ఆరిలోవ జౌషధ మొక్కల పెంపకానికి ప్రత్యేక నిధులు కేటాయించారు. 2004 ఎన్నికల్లో అయ్యన్న ఎమ్మెల్యేగా విజ యం సాధించినా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఖాళీగానే ఉండిపోయారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముత్యాలపాప చేతిలో అయ్యన్న ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికలలో శాసనసభ్యునిగా విజయం సాధించి మంత్రివర్గంలో నియమించబడ్డారు.[2]

సంవత్సరం నియోజకవర్గం విజేత పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు మెజారిటీ
1983 నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ 38490 రామచంద్ర రాజు శ్రీ రాజ సాగి కాంగ్రెస్ పార్టీ 37498 992
1985 నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ 43218 శ్రీరామ మూర్తి వేచలపు కాంగ్రెస్ పార్టీ 42407 811
1989 నర్సీపట్నం కృష్ణమూర్తిరాజు రాజ సాగి కాంగ్రెస్ పార్టీ 53818 చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ 42863 10955
1994 నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ 62385 కృష్ణమూర్తిరాజు రాజ సాగి కాంగ్రెస్ పార్టీ 41206 21179
1999 నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ 59853 కృష్ణమూర్తిరాజు రాజ సాగి కాంగ్రెస్ పార్టీ 51294 8559
2004 నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ 60689 వెంకట సూర్యనారాయణ రాజు దాట్ల స్వతంత్ర అభ్యర్థి 36759 23930
పెట్ల రామచంద్ర కాంగ్రెస్ పార్టీ 15453
2009 నర్సీపట్నం బోలెం ముత్యాల పాప కాంగ్రెస్ పార్టీ 65465 చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ 57718 7747
రుత్తల యెర్ర పాత్రుడు ప్రజారాజ్యం పార్టీ 18917
2014 నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ 79726 పెట్ల ఉమా శంకర్ గణేష్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 77388 2388
నేతల నాగేశ్వరరావు (షెడ్యూల్ కులం) బహుజన్ సమాజ్ పార్టీ 2721
2019 నర్సీపట్నం పెట్ల ఉమా శంకర్ గణేష్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 93818 చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ 70452 23366

మూలాలు మార్చు

  1. http://www.sakshi.com/news/andhra-pradesh/be-the-retirement-of-another-round-of-137943
  2. Sakshi (3 April 2017). "ఏపీ మంత్రుల శాఖలు ఇవే". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.

వెలుపలి లంకెలు మార్చు